లోన్స్ / క్రెడిట్ – నవయుగం TV
Money Management: Salary పెరిగినా ఆర్థిక ఆందోళన అధికమవుతోందా?కారణాలు తెలుసుకోండి.
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది, బోనస్ చేతికి అందింది.. సాధారణంగా ఇవన్నీ జరిగితే మనలో సంతోషం పెరగాలి, ఆర్థిక భరోసా కలగాలి. కానీ విచిత్రంగా, చాలా మందిలో ఆదాయం పెరిగిన కొద్దీ “నెల ఆఖరికి డబ్బులు సరిపోవట్లేదు” అనే ఆందోళన (Financial Anxiety) కూడా పెరుగుతోంది. ఇది కేవలం మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు, నేటి డిజిటల్ యుగంలో ఇదొక సామాజిక సమస్యగా మారుతోంది.
నిజానికి ఇది డబ్బు కొరత వల్ల వచ్చే సమస్య కాదు, మన జీవనశైలి మరియు ఆలోచనా విధానంలో ఉన్న లోపాల వల్ల ఏర్పడే సంక్షోభం. అసలు ఆదాయం పెరిగినా ఆర్థిక ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? దీని నుంచి బయటపడే మార్గాల గురించి వివరంగా చర్చిద్దాం.
ఆదాయం పెరిగినా డబ్బు మిగలడంలేదా? అసలు సమస్య మీ ఆలోచనలోనే ఉంది
లైఫ్‌స్టైల్ క్రీప్: మీకు తెలియకుండానే మిమ్మల్ని మింగేస్తున్న మహమ్మారి
మీ జీతం పెరగగానే మీ ఖర్చులు కూడా అదే నిష్పత్తిలో పెరగడాన్నే ‘లైఫ్‌స్టైల్ క్రీప్’ (Lifestyle Creep) అంటారు.
ముందు వరకు సాధారణ బైక్ మీద వెళ్లేవారు, జీతం పెరగగానే కార్ EMI గురించి ఆలోచించడం.
నెలకోసారి బయట భోజనం చేసేవారు, వారానికోసారి ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లడం.
పెరిగిన ఆదాయం మన జీవన ప్రమాణాలను పెంచాలి, కానీ అది మన పొదుపును హరించి వేయకూడదు. ఈ తేడాను గుర్తించలేక చాలా మంది ‘ఖర్చుల చక్రబంధం’లో చిక్కుకుపోతున్నారు.
డిజిటల్ యుగంలో ‘కనిపించని’ ఖర్చులు
పూర్వం ఖర్చు చేయాలంటే జేబులో నుంచి నోట్లు తీసి ఇచ్చేవాళ్లం. అప్పుడు డబ్బు ఖర్చవుతుందనే స్పృహ ఉండేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ మయం.
ఆటో-డెబిట్ సబ్‌స్క్రిప్షన్లు: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+, జిమ్ మెంబర్‌షిప్‌లు, ప్రీమియం యాప్స్.. ఇలా ఎన్నో మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి డబ్బును తీసేస్తున్నాయి.
EMIల మోజు: “నో కాస్ట్ EMI” అనే మాట వినగానే అవసరం లేకపోయినా ఖరీదైన గ్యాడ్జెట్లు కొనడం పరిపాటిగా మారింది.
జీతం క్రెడిట్ అయిన మరుక్షణమే ఇవన్నీ డెబిట్ అయిపోతుండటంతో, చేతిలో డబ్బు మిగలడం లేదనే భావన ఆందోళనను పెంచుతోంది.
సోషల్ మీడియా మరియు ‘పోలికల’ సంస్కృతి
ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం ఆర్థిక అసంతృప్తికి ప్రధాన కారణం.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితుడి విదేశీ యాత్ర ఫోటోలు చూసి, మనం కూడా వెళ్లాలని అప్పు చేసి మరీ ప్లాన్ చేయడం.
పక్కింటి వారు కొత్త కారు కొన్నారని, మనకున్న మంచి కారును మార్చి కొత్తది కొనడం.
సోషల్ మీడియా మనలో FOMO (Fear Of Missing Out) ని పెంచుతోంది. అవసరాల కోసం కాకుండా, పదిమందికి చూపించుకోవడం కోసం చేసే ఖర్చులు ఎప్పుడూ మిమ్మల్ని ఆర్థికంగా ఎదగనివ్వవు.
పెట్టుబడి పెట్టిన రెండేళ్లకే రిజల్ట్ కనిపించకపోవడంతో, “ఇది వర్కవుట్ అవ్వదు” అని ఆపేసి, ఆ డబ్బును అనవసర ఖర్చులకు మళ్లించేస్తుంటారు. ఇక్కడే కాంపౌండింగ్ (Compounding) మ్యాజిక్‌ను మనం మిస్ అవుతాం.
ఆర్థిక ఆందోళన నుండి బయటపడటం ఎలా? (మార్గాన్సోపానాలు)
నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం (Financial Freedom) కేవలం ఎక్కువ సంపాదించడం వల్ల రాదు, ఉన్న దానిని ఎలా మేనేజ్ చేస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
50/30/20 రూల్‌ను పాటించండి:
మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి:
50% – అవసరాలు: అద్దె, కిరాణా, మందులు, బిల్లులు.
30% – కోరికలు: ఎంటర్టైన్మెంట్, షాపింగ్, బయట భోజనం.
20% – పొదుపు & పెట్టుబడి: అత్యవసర నిధి, రిటైర్మెంట్ ప్లానింగ్.
ఖర్చులపై నిఘా ఉంచండి:
నెలకు కనీసం ఒక్కసారైనా మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూడండి. మీకు అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లు ఏవైనా ఉంటే వెంటనే రద్దు చేయండి. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో మీకు స్పష్టంగా తెలియాలి.
గోల్-బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్:
ఏదో ఒక చోట డబ్బు దాచడం కంటే, ఒక లక్ష్యం కోసం పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకు: “ఇది నా పిల్లల చదువు కోసం”, “ఇది నా సొంత ఇంటి కల కోసం”. ఇలా లక్ష్యం ఉన్నప్పుడు అనవసర ఖర్చులు చేయడానికి మనసు ఒప్పుకోదు.
‘పోలిక’ను పక్కన పెట్టండి:
గుర్తుంచుకోండి.. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదు. ఎదుటివారి ఆస్తుల కంటే మీ ‘నెట్ వర్త్’ (Net Worth) పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. విలాసాల కంటే మానసిక ప్రశాంతత మిమ్మల్ని ధనవంతుడిని చేస్తుంది.
ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మన జీవితంలో జరిగేటివి. మా స్నేహితుని విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అతను ఒక మధ్య తరగతి కుటుంబం. తను సంపాదించే జీతం నెలకి 15000 అప్పుడు తను జీవితంలో కొద్దిగా కుటుంబం కోసం మరికొద్దిగా తన ఖర్చులకోసం ఖర్చు చేసేవాడు. అప్పుడు తనుకు అప్పులు ఏమీ లేవు ఉన్నంతలో తృప్తిపడేవాడు. అతను ఏమనుకున్నాడు అంటే ఈ 15000 తో నా జీవితం అంతంత మాత్రమే ఉంది, 30 వేల రూపాయలు నేను సంపాదిస్తే నా జీవితం బెటర్ అవుతుంది అని అనుకున్నాడు. అలాగే తనకి 30 వేల రూపాయల జీతం కూడా దొరికింది. తను గతంలో తన కోసం బట్టలు కొనాలన్నా ఫుడ్ తినాలన్నా సాధారణమైనటువంటి షాప్ లో కొనేవాడు ఒక నార్మల్ రెస్టారెంట్లో తినేవాడు. కానీ 30 వేల రూపాయలు జీతం వచ్చాక ఇంకొంచెం బెటర్మెంట్ కోరుకున్నాడు. కొంచెం కాస్ట్లీ రెస్టారెంట్ కి కొంచెం ఖరీదైనటువంటి బట్టలు కొనడం అలవాటు చేసుకున్నాడు. అప్పుడు కూడా తన జీవితం సాధారణంగానే ఉంది. పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. దాని తర్వాత నా జీతం ఇంకా పెరిగితే బాగుంటుంది నా లైఫ్ లో సెటిల్ అవ్వగలను అని అనుకున్నాడు. తన కష్టం కొద్ది ఒక మంచి జీతం తను పొందగలిగాడు నెలకి 70000 సంపాదించాడు.
మొదట్లో చాలా సంతోషపడ్డాడు నా జీవితం ఇక మారిపోతుంది నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని ఎంతగానో సంతోషించాడు. అప్పుడే మొదలైంది అసలైన కథ తన జీవితంలో మొదలైంది. ఎక్కువ జీతం సంపాదించేసరికి ఇంకొంచెం కాస్ట్లీ వస్తువులు కొనడం అలవాటు చేసుకున్నాడు. ఫుడ్ విషయంలో మెయింటైన్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అలాగే తన జీతానికి తగ్గట్టుగానే లోన్స్, క్రెడిట్ కార్డులు అంటూ తీసుకున్నారు. ప్రతినెల వీటి భారం పెరుగుతూ వస్తూ ఉంది. రాను రాను తన పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే? తను నెల అంత కష్టపడి సంపాదించే జీతం కేవలం EMI కట్టుకోవటానికి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి మాత్రమే సరిపోయేది . తన మెయింటెనెన్స్ కోసం ఫుడ్ కోసం మళ్లీ క్రెడిట్ కార్డ్స్ ని ఆసరాగా చేసుకున్నాడు. ఇది ప్రతి నెల జరుగుతూ వచ్చేది. చివరికి తన పరిస్థితి కష్టపడి నెల అంతా పని చేసి వచ్చిన ప్రతి రూపాయి అప్పు కట్టడానికే సరిపోతుంది. తను బ్రతకటానికి కూడా కష్టమైపోతుంది.
ఇటువంటి స్థితిలోకి రావటానికి ప్రధానమైన కారణం ఆర్థిక స్థిరత్వం మీద అవగాహన లేకపోవడం, ఖర్చుల మీద అవగాహన లేకపోవడం. తను చేసినటువంటి ఆర్థిక తప్పిదం వలన తన జీవితం ఎంత క్లిష్టమైన పరిస్థితిలోకి మారిపోయిందంటే? ఉద్యోగం చేస్తే అప్పులు కట్టాలి, ఉద్యోగం చేయకపోతే అప్పులు మీద పడతాయి. ఉద్యోగం చేస్తున్నాడు అప్పులు కడుతున్నాడు. బ్రతకడం కోసం మళ్లీ అప్పు చేస్తున్నాడు. ఈ లైఫ్ సైకిల్ తన జీవితం అంతా ఒక మిషిన్ల పని చేయడానికి అలవాటు చేసింది. అతను కేవలం అప్పు కట్టడానికి మాత్రమే బ్రతుకుతున్నాడు. ఇటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని తను భావిస్తాడు. కాబట్టి ఆర్థిక స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. ఉన్నవాటిలో మన ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది .
ఒక అనారోగ్యం వారం రోజులు వస్తే మనం కోలుకోవడానికి రెండు మూడు నెలలు సమయం పడుతుంది. అలాగే ఆర్థికంగా మనం చేసే పొరపాటు వలన ఒక్క సారి వెనకబడిపోతే మనం సాధారణమైన పరిస్థితిలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు కష్ట పడవలసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉండాలంటే కచ్చితంగా ఖర్చుల మీద కంట్రోల్ కలిగి మనం జీవించాలి లేదంటే మన జీవితం మన చేతుల్లో ఉండదు.
మరిన్ని అప్డేట్స్ కొరకు వాట్సాప్ చానల్ లో జాయిన్ అవ్వండి.
📱 Join Our WhatsApp Channel
Google Pay – Axis Bank Flex Digital Credit Card: పూర్తి వివరాలు
నేటి డిజిటల్ యుగంలో చాలామంది నగదు రహితమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యూపీఐ(UPI) పేమెంట్ వచ్చిన తర్వాత జేబులో పర్సు లేకపోయినా పర్వాలేదు కానీ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్లి ఏదైనా కొనేయొచ్చు అనే విధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) మరియు ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) బ్యాంక్ కలిపి సరికొత్త డిజిటల్ క్రెడిట్ కార్డు ని ప్రవేశపెట్టారు.అదే “గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్“.
ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రయోజనాలు ఏమిటి? అలాగే దీన్ని సులభంగా ఎలా పొందాలో వివరాలు తెలుసుకుందాం.
గూగుల్ పే ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
సాధారణంగా క్రెడిట్ కార్డ్ అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది ఏటీఎం వంటి ప్లాస్టిక్ కార్డు. కానీ ఫిజికల్ కార్డు లేకుండానే పూర్తి డిజిటల్ క్రెడిట్ కార్డు కూడా ఉంటుందని తెలుసా? అంటే క్రెడిట్ కార్డు మన చేతికి రాకున్నా పర్లేదు కానీ మొబైల్ ఫోన్లో అది యాక్టివ్ లో ఉంటుంది. దాని ద్వారా మనం ట్రాన్సాక్షన్లు కూడా చేయవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం కూడా లేదు.
రూపే (RuPay) నెట్‌వర్క్ పవర్
ఈ కార్డు యొక్క అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది రూపే (RuPay) ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. దీని ద్వారా మన క్రెడిట్ కార్డు ని నేరుగా గూగుల్ పే యూపీఐ కి లింక్ చేసుకోవచ్చు. అలాగే మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు ద్వారా మనము స్కాన్ చేసి మన క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి అమౌంట్ ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు.
గూగుల్ పే ఫ్లెక్స్ కార్డ్ ప్రత్యేకతలు (Key Features)
ఈ క్రెడిట్ కార్డ్ కి కొన్ని ప్రత్యేకమైన లాభాలు కూడా ఉన్నాయి. అందులో బాగా ఉపయోగపడే ఫ్యూచర్ ఏమిటంటే? మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్ కి రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి . సాధారణంగా వేరే క్రెడిట్ కార్డులకైతే మనం చేసిన ట్రాన్సాక్షన్ కి నెల తరువాత రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. కానీ ఈ క్రెడిట్ కార్డు కి మాత్రం మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కి వెంటనే రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. వాటిని తర్వాత మనము ఉపయోగించుకోవచ్చు.ఇందులో ఒక స్టార్ విలువ ఒక రూపాయికి సమానం ($1 Star = 1 Rupee$). ఇది వినియోగదారులకు చాలా స్పష్టమైన లాభాన్ని ఇస్తుంది.దరఖాస్తు చేయడం నుండి కేవైసీ (KYC) వరకు అంతా పేపర్‌లెస్ మరియు ఆన్‌లైన్ పద్ధతిలోనే జరుగుతుంది.మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు లేకపోయినా, ఈ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే వెసులుబాటు ఉంటుంది.
ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బాగా లాభదాయకంగా ఉంటుంది
ఎవరయినా యూపీఐ పేమెంట్స్ ద్వారా చిన్నచిన్న పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటే వాళ్ళకి ఈ కార్డు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రతిసారి మనము కార్డు తీసుకొని వెళితేనే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి లేకపోతే లేదు అన్న టెన్షన్ లేకుండా, మన మొబైల్ ఫోన్ లోనే ఉండటం వల్ల ఈజీగా మనం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ యాడ్ అవటంవల్ల వాటిని తిరిగి ఉపయోగించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. తక్కువ డాక్యుమెంటేషన్ త్వరగా క్రెడిట్ కార్డు పొందాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు.
గూగుల్ పే ఫ్లెక్స్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలి? (Step-by-Step Guide)
మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే (GPay) యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసి ఓపెన్ చేయండి.యాప్ హోమ్ స్క్రీన్‌పై క్రిందికి స్క్రోల్ చేస్తే ‘Manage your money’ లేదా ‘Money’ సెక్షన్ కనిపిస్తుంది.అక్కడ మీకు ‘Credit Cards’ లేదా ‘Get Flex’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.మీ పాన్ కార్డ్ (PAN), వృత్తి (Job/Business), మరియు నెలవారీ ఆదాయ వివరాలను ఎంటర్ చేయండి.ఆధార్ నంబర్ ద్వారా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయండి. అవసరమైతే వీడియో కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది.మీ క్రెడిట్ స్కోర్ మరియు వివరాలను బ్యాంక్ పరిశీలించి, నిమిషాల్లోనే అప్రూవల్ ఇస్తుంది.కార్డు ఆమోదం పొందిన వెంటనే, మీ డిజిటల్ కార్డు గూగుల్ పే యాప్‌లో కనిపిస్తుంది. మీరు వెంటనే షాపింగ్ మొదలుపెట్టవచ్చు.
ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits)
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి మరియు తరచుగా యూపీఐ వాడేవారికి ఈ కార్డు ఒక వరమని చెప్పవచ్చు.
ప్రయోజనం
వివరణ
క్యాష్‌బ్యాక్ & రివార్డ్స్
గూగుల్ పే ద్వారా చేసే లావాదేవీలపై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
నో జాయినింగ్ ఫీ
ప్రారంభ ఆఫర్ కింద అనేకమందికి తక్కువ ఫీజు లేదా జీరో ఫీజుతో లభించే అవకాశం ఉంది.
షాపింగ్ ఆఫర్స్
మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు.
డైరెక్ట్ క్రెడిట్
రివార్డులు నేరుగా మీ గూగుల్ పే వాలెట్ లేదా స్టేట్‌మెంట్ డిస్కౌంట్‌గా మారతాయి.
గూగుల్ పే మరియు యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా తీసుకువచ్చినటువంటి ఈ ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్ నిజంగానే వినియోగదారులకు చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు. మన దగ్గర మనీ లేని సమయంలో ఈ క్రెడిట్ కార్డ్ వాడుకొని అత్యవసర పరిస్థితులలో యూపీఐ ద్వారా మనము ట్రాన్సాక్షన్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ఎంత భద్రంగా వాడుకుంటామో అలాగే మరికొన్ని క్రెడిట్ కార్డ్స్ అయినా లోన్స్ అయినా మనకు పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడిన ప్రతిసారి దాని బిల్లులు సకాలంలో చెల్లించడం అనేది మన మనీ మేనేజ్మెంట్ కి అలాగే మన క్రమశిక్షణ కి నిదర్శనం. లేదంటే మనం క్రెడిట్ కార్డ్ బిల్లులకి ఎక్కువగా వడ్డీ చెల్లించవలసి వస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ని జాగ్రత్తగా ఉపయోగించుకొని దాని ద్వారా లాభం పొందే విధంగా చూసుకోవాలి.
అప్పు కట్టకపోతే గ్యారెంటర్ జైలుకు వెళ్లాల్సిందేనా? మధ్యవర్తిగా ఉండే వ్యక్తులు తెలుసుకోవాల్సిన కఠిన వాస్తవాలు!
నేటి సమాజంలో అప్పు చేయకుండా ఉండటం చాలా కష్టం. మన అవసరాల నిమిత్తము, ఆరోగ్యం కోసమో, లేదంటే మన బంధువుల కోసమో స్నేహితుల కోసం అప్పు చేస్తూ ఉంటాం. మనం అప్పు తీసుకునే క్రమంలో మధ్యవర్తిగా మన స్నేహితులను బంధువులను గ్యారెంటరీగా పెడుతూ ఉంటాము. అలాగే మనం కూడా ఏదో ఒక సందర్భంలో స్నేహితులకో, బంధువులకో ఎవరికో ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు లోన్ల దగ్గర గ్యారెంటర్‌గా సంతకం చేయడం సర్వసాధారణం. అయితే, రుణం తీసుకున్న వ్యక్తి (Borrower) చేతులెత్తేస్తే, ఆ భారం మొత్తం గ్యారెంటర్ మీద పడుతుందని చాలామందికి తెలియదు. భారతీయ చట్టాలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాయి.
అసలు ‘గ్యారెంటర్’ అంటే చట్టం దృష్టిలో ఎవరు?
భారతీయ కాంట్రాక్ట్ చట్టం (Indian Contract Act, 1872) సెక్షన్ 126 ప్రకారం.. ఒక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు, అతను ఆ అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఆ బాధ్యతను తాను స్వీకరిస్తానని మూడో వ్యక్తి ఇచ్చే హామీనే ‘గ్యారెంటీ’.
ఇక్కడ గ్యారెంటర్ అంటే కేవలం సాక్షి కాదు, అతను “రెండవ రుణగ్రహీత” (Co-borrower) తో సమానం. అంటే అప్పు తీసుకున్న వ్యక్తితో సమానంగా గ్యారెంటర్‌కు కూడా బాధ్యత ఉంటుంది.
అప్పు తీసుకున్న వారు కట్టకపోతే గ్యారెంటర్ పరిస్థితి ఏమిటి?
ప్రధాన రుణగ్రహీత (Primary Borrower) వాయిదాలు చెల్లించడం ఆపేస్తే, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మొదట అతనికి నోటీసులు ఇస్తాయి. కానీ అతను స్పందించకపోతే, చట్టం ప్రకారం బ్యాంకులు నేరుగా గ్యారెంటర్‌ను సంప్రదిస్తాయి.
సమాన బాధ్యత (Co-extensive Liability): సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, అప్పు కట్టమని అడిగే హక్కు బ్యాంకుకు గ్యారెంటర్ పైన కూడా ఉంటుంది. అప్పు తీసుకున్న వాడి ఆస్తులు అమ్మే వరకు ఆగాల్సిన అవసరం బ్యాంకుకు లేదు.
ఆస్తుల జప్తు:
ఒకవేళ గ్యారెంటర్ కూడా అప్పు కట్టకపోతే, అతని ఆస్తులను (ఇల్లు, పొలం, వాహనాలు) జప్తు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుంది.
జీతం నుండి రికవరీ:
గ్యారెంటర్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగి అయితే, కోర్టు ఉత్తర్వుల ద్వారా అతని జీతం నుండి కొంత భాగాన్ని అప్పు కింద జమ చేసుకునే అవకాశం ఉంది.
గ్యారెంటర్ ఆర్థిక జీవితంపై పడే ప్రభావం (CIBIL Score)
చాలామందికి తెలియని భయంకరమైన నిజం ఇది. అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లింపులు చేయకపోతే, అది గ్యారెంటర్ యొక్క CIBIL స్కోర్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది.
మీరు స్వయంగా అప్పు తీసుకోకపోయినా, మీ పేరు మీద ఉన్న గ్యారెంటీ అకౌంట్ ‘డిఫాల్ట్’ అయితే, మీకు భవిష్యత్తులో ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు.
మీ క్రెడిట్ రిపోర్టులో ‘Defaulted Guarantor’ అని ముద్ర పడుతుంది.
SARFAESI చట్టం మరియు గ్యారెంటర్
బ్యాంకులు అప్పుల వసూలు కోసం SARFAESI Act, 2002 ని ఉపయోగిస్తాయి. దీని ప్రకారం:
రుణగ్రహీత అప్పు కట్టకపోతే, బ్యాంకు 60 రోజుల నోటీసు ఇస్తుంది.
ఆ తర్వాత గ్యారెంటర్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది. దీని కోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం బ్యాంకుకు ఉండదు.
గ్యారెంటర్‌కు ఉండే చట్టపరమైన హక్కులు (Rights of a Guarantor)
బాధ్యతలు ఉన్నట్లే, గ్యారెంటర్‌కు కొన్ని హక్కులు కూడా ఉన్నాయి:
వారసత్వ హక్కు (Right of Subrogation): ఒకవేళ గ్యారెంటర్ అప్పు మొత్తం చెల్లిస్తే, ఆ తర్వాత అతను రుణగ్రహీత మీద కేసు వేసి తన డబ్బును వసూలు చేసుకునే హక్కు పొందుతాడు. అంటే, బ్యాంకుకు ఉన్న అన్ని అధికారాలు గ్యారెంటర్‌కు వస్తాయి.
సెక్యూరిటీ హక్కు:
అప్పు కోసం రుణగ్రహీత బ్యాంకులో ఏవైనా ఆస్తులు తాకట్టు పెట్టి ఉంటే, ఆ వివరాలు తెలుసుకునే హక్కు గ్యారెంటర్‌కు ఉంటుంది.
నోటీసు పొందే హక్కు:
రుణ ఒప్పందంలో ఏవైనా మార్పులు జరిగితే (వడ్డీ రేటు పెంపు వంటివి), గ్యారెంటర్ అనుమతి లేకుండా అవి చెల్లవు.
గ్యారెంటర్‌గా సంతకం పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు ఎవరికైనా గ్యారెంటర్‌గా ఉండాలనుకుంటే ఈ క్రింది విషయాలు ఆలోచించండి:
పరిమితి విధించండి:
అప్పు మొత్తంలో కొంత భాగానికి మాత్రమే నేను గ్యారెంటర్‌గా ఉంటానని అగ్రిమెంట్‌లో రాయవచ్చు (Limited Guarantee).
ఆర్థిక స్థితిగతులు:
అప్పు తీసుకునే వ్యక్తికి ఆ అప్పు తీర్చే స్తోమత ఉందా లేదా అని వ్యక్తిగతంగా విచారించండి.
డాక్యుమెంట్లు చదవండి:
సంతకం పెట్టే ముందు ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ పూర్తిగా చదవండి. అందులో గ్యారెంటర్ బాధ్యత ఎంతవరకు ఉందో గమనించండి.
ముగింపు (Conclusion)
సహాయం చేయడం మంచిదే, కానీ అది మన కొంప ముంచేలా ఉండకూడదు. గ్యారెంటర్‌గా సంతకం చేయడం అంటే “అతను కట్టకపోతే నేను కడతాను” అని చట్టబద్ధంగా ఒప్పుకోవడమే. కాబట్టి, ఎవరికోసం పడితే వారి కోసం గ్యారెంటర్‌గా ఉండకండి. ఒకవేళ ఇప్పటికే గ్యారెంటర్‌గా ఉంటే, రుణగ్రహీత అప్పు కడుతున్నాడో లేదో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయండి.
మీకు ఈ సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు మా వెబ్‌సైట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
డిజిటల్ అప్పుల ఊబి: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ పెట్టడం ఎలా?
లోన్! లోన్! లోన్! సార్, మేడం, మీకు క్రెడిట్ కార్డు (Credit card) అప్రూవల్ ఉంది, లోన్ (Lone) అప్రూవల్ ఉంది అని ఎన్నోసార్లు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ఇగ్నోర్ చేస్తారు. మరి కొంతమంది ఆ క్రెడిట్ కార్డు (Credit card) లోన్ (Lone) ఉచ్చులో పడిపోతారు. సామాన్యుల మధ్యతరగతి వ్యక్తుల యొక్క అవసరాలను క్యాష్ చేసుకొని పదేపదే మనకు ఫోన్ చేసి లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ మనకు అవసరం లేకున్నా అంటగడుతూ ఉంటారు. కొన్నిసార్లు సేల్స్ ఏజెంట్స్ అనేకసార్లు ఫోన్ చేయడం వల్ల తనకు నిజంగా డబ్బు వస్తుందేమో అవసరాలు తీరుతాయేమో అనే ఆశతో మరికొంతమంది క్రెడిట్ కార్డు (Credit card) లోన్ (Lone) కానీ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి మన చేతికి క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ వస్తే సేల్స్ ఏజెంట్ యొక్క టార్గెట్ ముగుస్తుంది. తర్వాత మన టార్గెట్ మొదలవుతుంది, అదేనండి నెలవారి క్రెడిట్ కార్డు (Credit card) రీపేమెంట్స్ లోన్ (Lone) EMI . ఒకవేళ మనం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోతే, క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయకపోతే? అంతవరకు మనల్ని గౌరవంగా మాట్లాడి తీసుకోమని ఎంకరేజ్ చేసినటువంటి క్రెడిట్ కార్డు (Credit card) లోన్ (Lone) మనకు ఇచ్చినటువంటి వారి అసలైన రంగు బయటపడుతుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మరియు ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు సామాన్యుడి అవసరాలను తీరుస్తున్నప్పటికీ, సరైన అవగాహన లేకపోతే అవి ఒక తీరని ‘రుణ ఊబి’గా మారుతున్నాయి. ముఖ్యంగా రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
లోన్ రికవరీ ఏజెంట్ల హరాస్‌మెంట్: మీ హక్కులు, చట్టపరమైన పరిష్కారాలు మరియు ఆప్షన్లు
నేడు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, నిమిషాల్లో లోన్ వచ్చేస్తోంది. “ముందు వాడుకో.. తర్వాత కట్టుకో” అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ లోన్ యాప్‌లు మనల్ని ఊరిస్తున్నాయి. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో చెల్లించలేకపోతే, ఆ “సహాయం” కాస్తా “నరకం”గా మారుతోంది. రికవరీ ఏజెంట్ల ఫోన్ కాల్స్, బంధువులకు మెసేజ్‌లు, ఇంటి వద్ద గొడవలు.. ఇవన్నీ చట్టబద్ధమేనా? ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే మనకున్న హక్కులేంటి? తెలుసుకుందాం.
రికవరీ ఏజెంట్లు ఏం చేయకూడదు? (RBI నిబంధనలు)
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రికవరీ ఏజెంట్ల కోసం కఠినమైన నియమాలను రూపొందించింది. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు ఈ క్రింది పనులు చేస్తే అది నేరం:
అకాల సమయంలో కాల్స్: ఉదయం 8 గంటల కంటే ముందు, రాత్రి 7 గంటల తర్వాత కాల్ చేయకూడదు.
వ్యక్తిగత దూషణలు: అసభ్య పదజాలంతో దూషించడం లేదా శారీరకంగా బెదిరించడం చట్టవిరుద్ధం.
గోప్యత భంగం: కస్టమర్ అనుమతి లేకుండా వారి కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులకు (బంధువులకు, స్నేహితులకు) ఫోన్ చేయడం లేదా లోన్ వివరాలు చెప్పడం తీవ్రమైన నేరం.
సామాజిక వేధింపులు: సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం లేదా ‘డిఫాల్టర్’ అని ప్రచారం చేయడం ఐటీ చట్టం ప్రకారం శిక్షార్హం.
ఆర్థికంగా కట్టలేని స్థితిలో ఉంటే మీకున్న ఆప్షన్స్:
ఒకవేళ మీరు నిజంగానే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి లోన్ కట్టలేకపోతే, పారిపోవడం పరిష్కారం కాదు. ఈ క్రింది మార్గాలను ప్రయత్నించండి:
లోన్ రీస్ట్రక్చరింగ్ (Loan Restructuring): మీ బ్యాంకును సంప్రదించి, మీ ఆర్థిక పరిస్థితిని వివరించండి. వడ్డీ తగ్గించమని లేదా కట్టే కాలపరిమితిని (EMI duration) పెంచమని కోరవచ్చు.
వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS): అసలు మొత్తం కడతామని, వడ్డీ మాఫీ చేయమని బ్యాంకుతో చర్చలు జరపవచ్చు. దీనివల్ల సిబిల్ (CIBIL) స్కోర్ తగ్గుతుంది కానీ, వేధింపులు తప్పుతాయి.
డెట్ కౌన్సెలింగ్: అనేక స్వచ్ఛంద సంస్థలు రుణ విముక్తి కోసం ఉచిత సలహాలను ఇస్తాయి.
రికవరీ ఏజెంట్ల  వేధింపులు ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని టార్చర్ చేస్తుంటే, మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు.
బ్యాంకుకు ఫిర్యాదు
ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ నోడల్ ఆఫీసర్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయండి. 30 రోజుల్లో వారు స్పందించకపోతే తదుపరి అడుగు వేయండి.
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ (RBI Ombudsman)
ఇది అత్యంత శక్తివంతమైన వేదిక. RBI Ombudsman వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 14448 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయవచ్చు
లోన్ యాప్‌లు మీ ఫోటోలను మార్ఫింగ్ చేసినా లేదా కాంటాక్ట్స్ వేధించినా వెంటనే cybercrime వెబ్సైట్ లో ఫిర్యాదు చేయండి లేదా 1930 నంబర్‌కు కాల్ చేయండి.
పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు
ఇంటికి వచ్చి గొడవ చేసినా, బెదిరించినా ఐపీసీ సెక్షన్ 506 (బెదిరింపు), సెక్షన్ 509 (మహిళల పట్ల అసభ్యత) కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయవచ్చు.
ముగింపు
అప్పు తీసుకోవడం నేరం కాదు, కానీ అప్పు పేరుతో వేధించడం ఖచ్చితంగా నేరమే. రికవరీ ఏజెంట్ల వేధింపులకు భయపడి ప్రాణాలు తీసుకోవద్దు. చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది. సరైన మార్గంలో పోరాడితే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు.
మీకు ఈ సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు మా వెబ్‌సైట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.