ఆహారం & రెసిపీలు – నవయుగం TV
Sago Recipes:సగ్గుబియ్యం అంటే కేవలం పాయసమేనా? ఈ 10 రకాల వెరైటీ వంటకాలు టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
సగ్గుబియ్యం అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చేది పండగ రోజుల్లో మనం తినేటటువంటి పాయసం. కానీ సగ్గుబియ్యాన్ని మన రోజువారి ఆహారంలో కూడా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? కేవలం పాయసం చేసుకోవడమే కాదు సగ్గుబియ్యంతో అద్భుతమైనటువంటి బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్,ఎనర్జీ డ్రింక్స్ వంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది తక్షణమే మనకి శక్తిని ఇచ్చి, జీర్ణక్రియకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది.
సగ్గుబియ్యంతో చేసే పది రకాలైనటువంటి రుచికరమైన వంటకాలు మరియు అవి ఎందుకు మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకుందామా?
సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? (Health Benefits)
వంటకాల్లోకి వెళ్లేముందు సగ్గుబియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం:
తక్షణ శక్తి: ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
జీర్ణక్రియ: ఇది సులభంగా అరుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
శరీర ఉష్ణోగ్రత: ఎండకాలంలో బాడీని కూల్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
బరువు పెరగాలనుకునే వారికి: కృశించిన వారు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ఇది సహాయపడుతుంది.
గ్లూటెన్ ఫ్రీ: ఇది సహజంగానే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి అందరూ తినవచ్చు.
సగ్గుబియ్యంతో 10 రకాల అద్భుత వంటకాలు
సగ్గుబియ్యం కిచిడీ (Sabudana Khichdi)
కావలసినటువంటి పదార్థాలు
నానబెట్టిన సగ్గుబియ్యం – 1 కప్పు,వేయించిన పల్లీల పొడి – అర కప్పు,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర
మహారాష్ట్రలో ఎంతో రుచిగా తినేటటువంటి మరియు చాలా ఫేమస్ అయినటువంటి వంటకం సగ్గుబియ్యం కిచిడి ఎలా చేయాలో నేర్చుకుందాం.
తయారీ విధానము
ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి నాలుగు గంటల పాటు నీరు పోసి నానబెట్టాలి. ఒక బాండీలో నెయ్యి వేసి ఆ నెయ్యి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. నెయ్యి లేకపోతే నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు. అందులో మనకు కావాలంటే ఉడికించినటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టినటువంటి సగ్గుబియ్యము, వేరుసెనగ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాండిలో వేసి రంగు మారే వరకు ఉడికించుకొని లేదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చి దించుకోవాలి. చివరిగా నిమ్మరసం అలాగే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా అందరూ మెచ్చే విధంగా సగ్గుబియ్యం కిచిడి తయారవుతుంది.
సగ్గుబియ్యం వడ (Sabudana Vada)
కావలసినటువంటి పదార్థాలు
నానబెట్టిన సగ్గుబియ్యం – 1 కప్పు,ఉడికించిన బంగాళాదుంపలు – 2,వేయించిన పల్లీల పొడి – 3 స్పూన్లు,కారం, ఉప్పు, జీలకర్ర
తయారీ విధానము
సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత సరిపడా ఆలుగడ్డలని ఉడికించుకొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి. కొత్తిమీర,ఉప్పు, శెనగపిండి వేసుకొని అన్నింటిని ఒక చిక్కగా ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతితో వడలు లాగా ఒత్తుకొని మరిగినటువంటి నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకుని దింపుకుంటే సగ్గుబియ్యం వడ రెడీ అయిపోతుంది.
సగ్గుబియ్యం పాయసం (Sago Kheer)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం – అర కప్పు,పాలు – అర లీటరు,బెల్లం లేదా చక్కెర – తగినంత,యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్
తయారీ విధానము
ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసుకొని బాగా మరిగించాలి పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టినటువంటి సగ్గుబియ్యం వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికాక అందులో కొంచెం పంచదార లేదా బెల్లాన్ని వేసి మెల్లగా కలుపుకోవాలి (బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆపుకొని ఉంటే మంచిది ఎందుకంటే కొన్నిసార్లు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ). చివరిగా యాలకుల పొడిని అలాగే వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లని అందులో చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
సగ్గుబియ్యం దోశ (Sago Dosa)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం – 1 కప్పు,పుల్లటి పెరుగు – 1 కప్పు,బియ్యం పిండి – అర కప్పు,పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు.
తయారీ విధానము
ముందుగా ఒక కప్పులో సగ్గుబియ్యాన్ని అలాగే బియ్యాన్ని రెండింటిని విడివిడిగా కనీసం 5 నుండి 6 గంటలు నానబెట్టాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం పెరుగును వేసి కలియబెట్టి రాత్రంతా ఉంచితే అది పులిసి దోసెలు వేసుకోవడానికి సిద్ధంగా తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం అందులో ఉప్పు జీలకర్ర కలిపి మామూలుగా మనము దోసెలు వేసుకునే విధంగానే పెనంపై దోసెలు వేసుకుంటే ఇవి చాలా మెత్తగా తెల్లగా రుచికరంగా ఉంటాయి. ప్రతిరోజు రొటీన్ గా చేసుకునే దోసెలకు బదులు మనం ఈ విధంగా వెరైటీ దోశలు చేసుకుంటే మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
సగ్గుబియ్యం పునుగులు (Sago Bonda)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం – 1 కప్పు,పుల్లటి పెరుగు – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు,ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి
తయారీ విధానము
ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని అరకప్పు పెరుగులో 4 నుండి 5 గంటలసేపు నానబెట్టాలి. తర్వాత సగ్గుబియ్యం పెరుగును బాగా పీల్చుకున్నాక అందులో తగినంత మైదా పిండి లేదా బియ్యం పిండి కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మరుగుతున్నటువంటి నూనె బాండీలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి చాలా రుచికరంగా ప్రతిరోజు మనం తింటున్నటువంటి బోండాలకి బోండాలకు బదులుగా ప్రతి సాయంకాలం మనం స్నాక్స్ లాగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఇంటిల్లిపాది ఆస్వాదించుకోవచ్చు.
సగ్గుబియ్యం ఉప్మా (Sago Upma)
కావలసినటువంటి పదార్థాలు:
నానబెట్టిన సగ్గుబియ్యం – 1 కప్పు,ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు),వేయించిన పల్లీలు – 2 స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం.
తయారీ విధానము
ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు , పచ్చి శెనగ పల్లీలు అలాగే ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలియ పెట్టుకోవాలి . తర్వాత నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేయాలి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాల వరకు ఉడికించాలి. సగ్గుబియ్యం మెత్తబడ్డాక కొత్తిమీర అలంకరణ కోసం వాడుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం ఉప్మా ప్రతిరోజు మనము ఉప్మా తిని బోర్ కొట్టి మానేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి వారు ఈ వెరైటీ ఉప్మాను చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే కొత్త రుచులు చూచినట్లు ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కచ్చితంగా ప్రయత్నం చేయండి.
సగ్గుబియ్యం పుడ్డింగ్ (Sago Pudding)
కావలసినటువంటి పదార్థాలు:
సగ్గుబియ్యం, పాలు, బెల్లం (లేదా చక్కెర), యాలకల పొడి, కొద్దిగా నెయ్యి, కాజు, కిస్‌మిస్.
తయారీ విధానము:
ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్లలో బాగా నానబెట్టుకోవాల. ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించి, అందులో ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాల. అవి అద్దం ముక్కల్లా మెరుస్తా ఉడికినప్పుడు, చక్కెర గానీ బెల్లం గానీ వేసి కలపాలా. నెయ్యిలో వేయించిన కాజు, కిస్‌మిస్ చల్లితే.. పుడ్డింగ్ తయార్! ఇది తింటే “ఆహా” అనాల్సిందే!
సగ్గుబియ్యం అప్పడాలు (Sago Papad)
ఎండకాలం వచ్చిందంటే చాలు, మా ఊర్లో మిద్దెల మీద ఈ అప్పడాలే కనిపిస్తాయి.
కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యం, నీళ్లు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు.
తయారీ విధానము:
ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి బాగా తెర్లనివ్వాల. అందులో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలా. అది దగ్గరపడి గంజిలాగా అయ్యాక.. ఒక ప్లాస్టిక్ కవర్ మీద చిన్న చిన్న గరిటెలతో బిళ్లల్లాగా పోయాల. రెండు రోజులు ఎండలో బాగా ఎండితే చాలు.. నూనెలో వేస్తే తెల్లగా, పెద్దగా పువ్వుల్లాగా వస్తాయి. పప్పు చారులోకి ఇవి ఉంటే ఆ మజాయే వేరబ్బా!
సగ్గుబియ్యం గంజి (Sago Java)
ఒంట్లో వేడి చేసినా, నీరసంగా ఉన్నా మా ఊర్లో ఫస్ట్ ఇచ్చేది ఇదే!
కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యం, నీళ్లు, కొద్దిగా ఉప్పు, మజ్జిగ (లేదా పాలు).
తయారీ విధానము:
సగ్గుబియ్యాన్ని నీళ్లలో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాల. అది పల్చగా ఉన్నప్పుడే దించేసి, చల్లారాక అందులో గట్టి మజ్జిగ, కొద్దిగా ఉప్పు వేసి తాగితే.. అబ్బా! కడుపులో చల్లగా, ప్రాణం లేచి వస్తాది. మీకు తీపి కావాలంటే చక్కెర వేసుకొని తాగొచ్చు.
సగ్గుబియ్యం పకోడీ (Sago Pakoda)
సాయంత్రం పూట వాన పడుతుంటే, వేడి వేడి పకోడీ పడాల్సిందే కదా!
కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యం, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె.
తయారీ విధానము:
నానబెట్టిన సగ్గుబియ్యంలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి గట్టిగా కలుపుకోవాల. నూనె బాగా కాగాక.. చిన్న చిన్న ముద్దల్లాగా వేసి ఎర్రగా వేయించాల. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. చాయ్‌లో నంజుకుని తింటే ఆ కిక్కే వేరు!
పైన చెప్పినటువంటి ఈ వంటకాలు నిజంగా చాలా రుచిగా ఉంటాయి. మనం ప్రతి రోజు రొటీన్ గా తిని అలిసిపోయి ఏం చేయాలో అర్థం కాక ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే రుచికి రుచి ఉంటాయి కాబట్టి కనీసం నెలలో ఒకసారైనా ఈ వెరైటీ వంటకాలను ట్రై చేయండి. రుచికరంగా అలాగే ఆరోగ్యవంతమైన వంటకాల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ట్రై చేసి మీ ఇంటి సభ్యుల చేత ఆహా ఏమి రుచి అని అనిపించుకోండి.
సగ్గుబియ్యంతో చేసినటువంటి ఈ వంటకాలు మీకు నచ్చాయా అయితే దీనిని మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మా యొక్క వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వలన ఎప్పటికప్పుడు మా వెబ్సైట్ యొక్క అప్డేట్స్ మీకు అందుతాయి
📱 Join Our WhatsApp Channel
Lady’s Finger / Okra:జిగురు లేకుండా చేసే 5 రుచికరమైన బెండకాయ వంటకాలు
బెండకాయ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది దానికి ఉన్నటువంటి జిగురు. ఈ చిగురు వల్లే మనలో చాలామంది దీని తినడానికి ఇష్టపడరు. కొంతమంది తన జీవితంలో ఇష్టం లేని కూర అంటే బెండకాయ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దానికి ఉన్నటువంటి జిగురులోనే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? మెదడు చురుకుదనం నుంచి గుండె ఆరోగ్యం వరకు బెండకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు.
బెండకాయలోని పోషక విలువలు (Nutrition Facts)
బెండకాయలో కేలరీలు తక్కువ, పీచు పదార్థం (Fiber) ఎక్కువ. ఇందులో ఉండే ముఖ్యమైన పోషకాలు:
విటమిన్లు: విటమిన్ సి, విటమిన్ కె1, మరియు విటమిన్ బి6.
యాంటీ ఆక్సిడెంట్స్: పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్.
ఖనిజాలు: మెగ్నీషియం, ఫోలేట్ మరియు పొటాషియం.
బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ఉపయోగాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.
గుండె ఆరోగ్యం: బెండకాయలోని మ్యుసిలేజ్ (జిగురు) శరీరంలోని కొలెస్ట్రాల్‌ను పీల్చుకుని బయటకు పంపుతుంది.
షుగర్ కంట్రోల్: రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తి: విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది.
గర్భిణీ స్త్రీలకు మేలు: ఇందులో ఉండే ‘ఫోలేట్’ శిశువు మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
జిగురు లేకుండా బెండకాయతో 5 రకాల అద్భుతమైన వంటకాలు
మీకు బెండకాయ కూర నచ్చకపోతే, ఈ క్రింది పద్ధతుల్లో ట్రై చేయండి. జిగురు అస్సలు ఉండదు!
1. బెండకాయ 65 (Crispy Okra Fry)
ఇది స్టార్టర్‌లాగా లేదా పప్పు చారులోకి నంచుకోవడానికి అద్భుతంగా ఉంటుంది.
కావలసినవి: బెండకాయలు (నిలువుగా చీల్చినవి), శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె.
తయారీ విధానం:
బెండకాయ ముక్కలకు కొద్దిగా శనగపిండి, బియ్యం పిండి, మసాలాలు కలిపి పక్కన పెట్టండి (నీళ్లు పోయకూడదు).
వేడి నూనెలో వీటిని విడివిడిగా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి.
చివరగా కరివేపాకు, వేయించిన పల్లీలు కలిపితే క్రిస్పీ బెండకాయ రెడీ!
2. దహీ బెండి (Okra Yogurt Curry)
జిగురు లేకుండా క్రీమీగా ఉండే గ్రేవీ వంటకం.
కావలసినవి: బెండకాయ ముక్కలు, పెరుగు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా.
తయారీ విధానం:
ముందుగా బెండకాయ ముక్కలను కొద్దిగా నూనెలో వేయించి పక్కన పెట్టుకోండి.
అదే మూకుడులో ఉల్లిపాయలు, మసాలాలు వేసి వేయించాలి.
స్టవ్ సిమ్ లో పెట్టి పెరుగు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు వేయించిన బెండకాయలు వేసి 5 నిమిషాలు ఉడికిస్తే ‘దహీ బెండి’ సిద్ధం.
3. బెండకాయ మసాలా ఫ్రై (Stuffed Bhindi)
కావలసినవి: బెండకాయలు (మధ్యలోకి గాటు పెట్టినవి), వేయించిన పల్లీల పొడి, నువ్వుల పొడి, కారం, ఉప్పు.
తయారీ విధానం:
పల్లీ పొడి, నువ్వుల పొడి, ఉప్పు, కారం కలిపి మసాలా సిద్ధం చేసుకోండి.
ఈ పొడిని బెండకాయల మధ్యలో స్టఫ్ చేయండి.
బాండీలో కొద్దిగా నూనె వేసి ఈ బెండకాయలను తక్కువ మంటపై మూత పెట్టి వేయించండి.
4. బెండకాయ పులుసు (Okra Tamarind Stew)
సాంప్రదాయ పద్ధతిలో రుచిగా ఉండే వంటకం.
కావలసినవి: బెండకాయ ముక్కలు, చింతపండు రసం, బెల్లం ముక్క, పచ్చిమిర్చి, తాలింపు గింజలు.
తయారీ విధానం:
పోపు వేసి ఉల్లిపాయలు, బెండకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
అందులో చింతపండు రసం, తగినంత నీరు, ఉప్పు, కారం వేయాలి.
కొద్దిగా బెల్లం ముక్క వేసి చిక్కబడే వరకు మరిగిస్తే రుచికరమైన పులుసు రెడీ.
5. బెండకాయ పల్లీ వేపుడు (Okra Peanut Stir-fry)
కావలసినవి: బెండకాయ ముక్కలు, పల్లీలు, వెల్లుల్లి కారం.
తయారీ విధానం:
బెండకాయ ముక్కలను హై ఫ్లేమ్‌పై వేయించడం వల్ల జిగురు పోతుంది.
ముక్కలు వేగాక వేయించిన పల్లీలు, వెల్లుల్లి కారం చల్లి కలపాలి. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
జిగురు పోవాలంటే చిట్కా:
బెండకాయ కోయడానికి ముందే కడిగి, తడి లేకుండా తుడవాలి. వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం లేదా పెరుగు లేదా ఆమ్చూర్ పొడి కలిపితే జిగురు మొత్తం పోయి ముక్కలు విడివిడిగా వస్తాయి.
ముగింపు:
ఈసారి కూరగాయల మార్కెట్ కి వెళ్ళినప్పుడు ధైర్యంగా బెండకాయ తీసుకోండి. దానిని ఇక్కడ చెప్పిన విధంగా మీకు నచ్చిన పద్ధతిలో వంట చేయండి. దానిని మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి. కచ్చితంగా ఈసారి వాళ్ళు ఇష్టంగా తింటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా భయపడుతున్నటువంటి జిగురు వాళ్లకు కనిపించదు. అందులోనూ ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల కూడా మరి కొంత రుచిగా ఉంటుంది. దానివల్ల వారు ఇష్టపడి తినడమే కాదు బెండకాయ అంటే నాకు కూడా ఇష్టం అని అంటారు. బెండకాయ కూరను కూడా వారి జీవితంలో తినటానికి ఇష్టపడతారు. దాని ద్వారా వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఈసారి మర్చిపోకుండా బెండకాయ కూర తింటారు కదూ!
కేవలం 10 నిమిషాల్లో వంట! ప్రెషర్ కుక్కర్ సైన్స్: ఆహారం త్వరగా ఉడకడానికి అసలు కారణం ఏమిటి?
ప్రతి ఒక్కరి వంటింట్లో ప్రెషర్ కుక్కర్ తప్పనిసరిగా ఉంటుంది. ఉదయం హడావిడిలో ఉన్న లేదా అతిధులు అనుకోకుండా వచ్చిన పప్పు, అన్నం కూరగాయలు లాంటివి క్షణంలో ఉడకబెట్టడానికి ఇది మనకు చాలా సహాయపడుతుంది. అయితే ఒక సాధారణ పాత్రలో గంటల తరబడి ఉడికే ఆహారము ప్రెజర్ కుక్కర్లో కేవలం 10 నుండి 20 నిమిషాల్లో ఎలా ఉడికిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
సాధారణమైన వంట పాత్రలలో చేసే వంట మరియు ప్రెజర్ కుక్కర్ లో చేసే వంట మధ్య ఉన్న ఈ తేడాకు కారణం ఏదో మంత్రం కాదు కేవలం అద్భుతమైన భౌతిక శాస్త్ర సూత్రం మాత్రమే. మనం ప్రెజర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడకడానికి గల అసలు కారణాలు ఏమిటి దాని వెనకాల వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయ రహస్యం అలాగే దాని పనితీరును వివరంగా తెలుసుకుందామా!
సాధారణ వంట పాత్రలలో వంట మరియు దాని ఉష్ణోగ్రత పరిమితి:
ప్రెజర్ కుక్కర్ యొక్క పనితీరును మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం సాధారణమైనటువంటి వంట పాత్రల్లో జరిగే వంట ప్రక్రియను బాగా అర్థం చేసుకోవాలి.
సాధారణంగా మనం ఒక గిన్నెలో నీటిని కానీ ఏదైనా పదార్థాన్ని కానీ ఉంచి వేడి చేసినప్పుడు అది ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత ఆవిరిగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతను నీటి మరుగు స్థానం (Boiling Point of Water) అంటారు.
100°C కి మించి వేడి చేయలేమా?
సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో, నీటి మరుగు స్థానం స్థిరంగా ఉంటుంది. అంటే, మీరు ఎంత ఎక్కువ వేడి చేసినా, ఆ నీటి ఉష్ణోగ్రత 100°C కి మించి పెరగదు. అదనపు శక్తి ఎంత నీటి ఆవిరిగా మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మనం ఎంతగా వేడి చేసిన 100° మాత్రమే ఉష్ణోగ్రత ఉంటుంది మిగిలిన ఉష్ణోగ్రత అంతా నీటి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది.ఓపెన్ పాట్‌లో ఆహారం 100°C వద్ద మాత్రమే ఉడుకుతుంది. ముఖ్యంగా పప్పులు లేదా గట్టి మాంసం వంటివి ఈ ఉష్ణోగ్రత వద్ద ఉడకడానికి చాలా సమయం పడుతుంది.
ప్రెషర్ కుక్కర్ లో ఆహారం త్వరగా ఉడకడానికి గల ముఖ్య కారణం: అధిక పీడనం
ప్రెషర్ కుక్కర్ పనితీరు యొక్క ఏకైక మరియు ప్రధాన రహస్యం పీడనం (Pressure).ప్రెషర్ కుక్కర్ అంటే దాని పేరులోనే ఉంది – పీడనం ఆధారంగా పని చేసే కుక్కర్. దీని యొక్క రూపకల్పన ఆహారం త్వరగా ఉడకడానికి వీలు కల్పిస్తుంది.
ఆవిరిని బంధించడం (Trapping the Steam)ప్రెషర్ కుక్కర్ సాధారణ పాత్రలా కాకుండా, గట్టిగా బిగించే ఎయిర్-టైట్ మూత (Airtight Lid) మరియు రబ్బరు గాస్కెట్ (Gasket) ను కలిగి ఉంటుంది.
కుక్కర్‌ను వేడి చేయడం ప్రారంభించినప్పుడు, నీరు ఆవిరిగా మారుతుంది.
ఈ ఎయిర్-టైట్ మూత ఆవిరిని బయటికి పోకుండా లోపలే బంధిస్తుంది.
దీని ఫలితంగా, లోపల పేరుకుపోయిన ఆవిరి కారణంగా పీడనం (Pressure) వేగంగా పెరుగుతుంది.
పెరిగిన పీడనం, పెరిగిన మరుగు స్థానం (Pressure-Temperature Relationship)ఇక్కడే అసలైన శాస్త్రం దాగి ఉంది.
భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం, ఒక ద్రవంపై పీడనం పెరిగితే (Increased Pressure), దాని మరుగు స్థానం కూడా పెరుగుతుంది (Increased Boiling Point).
సాధారణంగా 15 psi (Pounds per Square Inch) పీడనం పెరిగితే, కుక్కర్ లోపల నీటి మరుగు స్థానం 100°C నుండి సుమారుగా 121°C (250°F) కు పెరుగుతుంది.
అంటే, ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం 100°C వద్ద కాకుండా, 121°C వంటి అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతుంది. ఈ అదనపు 121°C ఉష్ణోగ్రత వంట సమయాన్ని లేదా ఆహార పదార్థాలు ఉడికే సమయాన్ని చాలా తగ్గిస్తుంది.
ఆహారంపై అధిక ఉష్ణోగ్రత ప్రభావంఅధిక ఉష్ణోగ్రత అనేది ఆహారం త్వరగా ఉడకడానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం:
కణజాలం (Cellulose) విచ్ఛిన్నం:
పప్పులు, ధాన్యాలు మరియు కూరగాయలలోని గట్టి పీచు పదార్థాలను (Cellulose) వేగంగా విచ్ఛిన్నం చేయడానికి అధిక ఉష్ణోగ్రత అవసరం.
121°C ఉష్ణోగ్రత వద్ద, ఈ కఠినమైన సెల్యులోజ్ నిర్మాణాలు త్వరగా మెత్తబడతాయి.అందుకే ప్రెషర్ కుక్కర్‌లో వండిన మాంసం మరియు పప్పులు చాలా మృదువుగా ఉంటాయి.
శక్తిని మరింత సమర్థవంతంగా చేరవేయడం (Efficient Heat Transfer):
అధిక పీడనం కారణంగా ఏర్పడిన ఆవిరి (steam) సాధారణ గాలి కంటే ఉష్ణాన్ని మరింత వేగంగా మరియు సమర్థవంతంగా ఆహారంలోకి చేరవేస్తుంది.ఉదాహరణకు, 100°C నీటి కంటే, 121°C పీడన ఆవిరి (steam) ఉష్ణాన్ని సుమారు 10 రెట్లు వేగంగా బదిలీ చేస్తుంది.
ప్రెషర్ కుక్కర్ లోని భద్రత మరియు భాగాలు (Safety Features):
ప్రెషర్ కుక్కర్ సైన్స్ ఎంత అద్భుతమైనదో, దాని రూపకల్పనలో భద్రత కూడా అంతే ముఖ్యం. అధిక పీడనాన్ని నియంత్రించడానికి కుక్కర్ కొన్ని కీలక భాగాలను కలిగి ఉంటుంది.
వెయిట్ వాల్వ్ / విజిల్ (Weight Valve/Whistle): ఇది లోపల పీడనం ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అదనపు ఆవిరిని విడుదల చేసి, లోపలి పీడనాన్ని నియంత్రిస్తుంది. ఇది ఒక భద్రతా లక్షణం మరియు వంట సమయాన్ని కొలవడానికి సంకేతం కూడా.
సేఫ్టీ వాల్వ్ (Safety Valve):
వెయిట్ వాల్వ్ పని చేయని పక్షంలో, పీడనం ప్రమాదకర స్థాయికి పెరిగితే, ఈ సేఫ్టీ వాల్వ్ కరిగి లేదా తెరుచుకుని మొత్తం పీడనాన్ని విడుదల చేస్తుంది.
ప్రెషర్ కుక్కర్ వాడకం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు:
ప్రెషర్ కుక్కర్ ఆహారాన్ని వేగంగా ఉడికించడం మాత్రమే కాదు, ఇంకా కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ప్రయోజనం
వివరణ
సమయం ఆదా
వంట సమయం 50% నుండి 70% వరకు తగ్గుతుంది, ఇది ఆధునిక జీవనశైలికి కీలకం.
ఇంధనం ఆదా
తక్కువ సమయం స్టవ్‌పై ఉండటం వలన గ్యాస్ లేదా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
పోషకాలు భద్రం
తక్కువ వంట సమయం మరియు మూసి ఉన్న వాతావరణం కారణంగా, ముఖ్యమైన విటమిన్లు (విటమిన్ సి వంటివి) మరియు పోషకాలు ఆవిరైపోకుండా లేదా నీటిలో కరిగిపోకుండా కాపాడబడతాయి.
రుచి మరియు తేమ
మూసివున్న కుక్కర్‌లో ఆహారం దాని సహజ తేమతో మరియు సుగంధాలతో ఉడుకుతుంది, దీని వలన ఆహారం మరింత రుచికరంగా ఉంటుంది.
ముగింపు (Conclusion):
ప్రెషర్ కుక్కర్ పనితీరు యొక్క కీలకం పీడనం మరియు ఉష్ణోగ్రత మధ్య ఉన్న సంబంధంలోనే ఉంది. సాధారణ వంట పాత్రలు 100°C వద్ద పరిమితమై ఉంటే, ప్రెషర్ కుక్కర్ తన సాంకేతికతతో ఆ ఉష్ణోగ్రతను 121°C కు పెంచుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతే వంట సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.మరుసారి మీ కుక్కర్ విజిల్ శబ్దం చేసినప్పుడు, అది కేవలం ఆవిరి విడుదల చేసే శబ్దం మాత్రమే కాదని, అది మీ ఆహారాన్ని మెరుపు వేగంతో ఉడికించే అద్భుతమైన భౌతిక శాస్త్ర ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ప్రెషర్ కుక్కర్ అనేది నిజంగా ఆధునిక వంటింటికి ఒక అపురూపమైన సైన్స్ బహుమతి!
వంకాయతో 3 ప్రపంచ రుచులు: గుత్తి వంకాయ నుండి ఇటాలియన్ పర్మిజియానా వరకు!
వంకాయ అంటే ప్రతి కూరగాయలో రారాజు అని చెప్తారు. వంట చేయడము ఒక మంచి కల. ఒక కూరగాయని తీసుకొని దానిలో వివిధ రకాల మసాలాలను కలిపి వివిధ రకాల పద్ధతుల ద్వారా సరికొత్త రుచి కలిగినటువంటి వంటను తయారుచేసి అందరితో ఎంత టేస్టీగా చేసింది అని మెచ్చుకుంటే వచ్చే కిక్కే వేరు. అందులోనూ వంకాయ కూర ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుండి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా వంకాయని ఎంతో రుచిగా తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంటల నుండి ఇటలీ చైనా వంటల వరకు మన వంకాయ కూరను రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దాం.
వంకాయ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వారికి వెంటనే గుర్తు వచ్చేది గుత్తి వంకాయ్ లేదా గ్రేవీతో కూడినటువంటి ఒక వంటకం బాగా నోరు ఊరిస్తుంది. అయితే అందరికీ బాగా ఇష్టమైనటువంటి ఒక గుత్తి వంకాయ కూరను మనం ఎలా చేయాలో చూద్దామా.
గుత్తి వంకాయ రెసిపీ:(Gutti Vankaya Kura)
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు: చిన్న గుత్తి వంకాయలు – 15 నుండి 20
నూనె: 4-5 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
మసాలా తయారీకి:పల్లీలు (వేయించినవి):
1/4 కప్పునువ్వులు (వేయించినవి):
2 టేబుల్ స్పూన్లుఎండు కొబ్బరి తురుము:
2 టేబుల్ స్పూన్లుధనియాలు:
2 టేబుల్ స్పూన్లుజీలకర్ర:
1 టీస్పూన్ఎండుమిర్చి:
5-7 (లేదా కారం పొడి)ఉల్లిపాయ ముక్కలు:
1 మీడియం సైజ్అల్లం-వెల్లుల్లి పేస్ట్:
1 టీస్పూన్పసుపు:
1/2 టీస్పూన్ఉప్పు: తగినంతచింతపండు రసం: 1 టేబుల్ స్పూన్ (చిన్న నిమ్మకాయంత)
యారీ పద్ధతి (Step-by-Step Process):
మసాలా వేయించడం:
ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి.
మసాలా పేస్ట్:
వేయించిన దినుసులను చల్లార్చి, మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, అవసరమైతే కొంచెం నీరు కలిపి మెత్తని ముద్దలా (పేస్ట్) చేసుకోవాలి.
వంకాయలు సిద్ధం చేయడం:
వంకాయలను కడిగి, తొడిమలు తీయకుండా, కింద భాగం వరకు కట్ కాకుండా నాలుగు భాగాలుగా (cross) చీల్చాలి. వెంటనే వాటిని ఉప్పు నీటిలో వేయాలి.
మసాలా నింపడం:
ఉప్పు నీటిలోంచి వంకాయలను తీసి, చీల్చిన భాగంలో తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ను జాగ్రత్తగా నింపాలి. మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి.
కూర వండడం:
ఒక మందపాటి కళాయిలో నూనె వేడి చేసి, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర) వేయాలి. కరివేపాకు కూడా వేయాలి.
వంకాయలను ఉంచడం: మంటను తగ్గించి, నింపిన వంకాయలను నూనెలో జాగ్రత్తగా పేర్చాలి. మూత పెట్టి, సన్నని మంటపై 5 నిమిషాలు ఉడికించాలి.
గ్రేవీ కలపడం:
మిగిలిన మసాలా పేస్ట్‌ను, చింతపండు రసాన్ని మరియు అవసరమైన ఉప్పును కలిపి, కొద్దిగా నీరు పోసి ఆ మిశ్రమాన్ని వంకాయలపై పోయాలి.
ఉడికించడం:
మూత పెట్టి, వంకాయలు పూర్తిగా మెత్తబడే వరకు సుమారు 15-20 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. కూర నూనె పైకి తేలితే వంటకం సిద్ధమైనట్లే. తరువాత వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే అద్భుతమైన రుచి ఉంటుంది.
బ్రింజాల్ పర్మిజియానా (వెస్ట్రన్ శైలి) (Eggplant Parmigiana):
ఇందులో భారీగా మసాలాలు వేయకుండా కేవలం సువాసనలతో చీఫ్ తో వంకాయని వండి రుచిగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వంకాయలను కూరలుగా చేయాలంటే ప్రధానంగా బేకింగ్ లేదా గ్రిల్లింగ్ ద్వారా తయారు చేస్తారు.
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు: పెద్దవి – 2
టొమాటో సాస్: 1.5 కప్పులు (లేదా పాస్తా సాస్)
చీజ్: మొజారెల్లా చీజ్ (తురుము) – 2 కప్పులు, పర్మేసన్ చీజ్ – 1/2
కప్పుఆలివ్ ఆయిల్: వేయించడానికి మరియు బేకింగ్‌కు
కోటింగ్ కోసం: గుడ్లు – 2, బ్రెడ్‌క్రంబ్స్ – 1 కప్
పుమసాలా & హెర్బ్స్:అల్లం-వెల్లుల్లి: 1 టేబుల్ స్పూన్ (తరిగినది)
ఒరేగానో (Oregano), బాసిల్ (Basil): 1 టీస్పూన్ చొప్పున (లేదా మిక్స్‌డ్ హెర్బ్స్)
ఉప్పు, నల్ల మిరియాల పొడి: తగినంత.
తయారీ పద్ధతి (Step-by-Step Process):
వంకాయ సిద్ధం: వంకాయలను 1/4 అంగుళం మందంతో గుండ్రటి స్లైసెస్‌గా కట్ చేయండి. వాటిపై ఉప్పు చల్లి, $20$ నిమిషాలు ఉంచి, ఆపై గుడ్డతో బాగా తుడిచి, తేమను తొలగించండి (ఇది చేదును తొలగిస్తుంది).
వంకాయ కోటింగ్: ఒక ప్లేట్‌లో బ్రెడ్‌క్రంబ్స్, మరొక ప్లేట్‌లో కొట్టిన గుడ్లు తీసుకోండి. వంకాయ స్లైసెస్‌ను ముందుగా గుడ్డులో, ఆపై బ్రెడ్‌క్రంబ్స్‌లో పూర్తిగా కోట్ చేయండి.
వేయించడం: ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేడి చేసి, కోట్ చేసిన వంకాయ స్లైసెస్‌ను బంగారు రంగు వచ్చేవరకు (సుమారు 2 నిమిషాలు ప్రతి వైపు) వేయించి, టిష్యూ పేపర్‌పై తీయండి.
బేకింగ్ ట్రే సిద్ధం: ఓవెన్‌ను 180 d కి ప్రి-హీట్ చేయండి. ఒక బేకింగ్ ట్రే లేదా డీప్ డిష్ అడుగున కొద్దిగా టొమాటో సాస్ వేయండి.
లేయర్లను పేర్చడం:
మొదటి పొర: వేయించిన వంకాయ స్లైసెస్‌ను ఒకదానిపై ఒకటి కొంచెం అతికించి పేర్చండి.
రెండవ పొర: వంకాయలపై టొమాటో సాస్‌ను సమంగా వేయండి.
మూడవ పొర: దానిపై సగం మొజారెల్లా చీజ్, కొంచెం పర్మేసన్ చీజ్, ఒరేగానో, బాసిల్ మరియు మిరియాల పొడి చల్లండి.
పునరావృతం: మన దగ్గర మసాలా ఉన్నంతవరకు మళ్లీ అదే రిపీట్ చేయాలి. చివరి పొరలో సాస్ మరియు చీజ్ ఉండేలా చూసుకోండి.
బేకింగ్: సిద్ధం చేసిన ట్రేను ఓవెన్‌లో ఉంచి, చీజ్ కరిగి, బంగారు గోధుమ రంగులోకి మారే వరకు సుమారు 30 నుండి 40 నిమిషాలు బేక్ చేయండి. సర్వ్ చేయడానికి ముందు 10 నిమిషాలు చల్లార్చండి.
ఫ్యూజన్/డిఫరెంట్ ఫ్లేవర్ శైలి (ఇండో-చైనీస్ లేదా స్పైసీ గ్రిల్)
హనీ-చిల్లీ బ్రింజాల్ (ఫ్యూజన్ శైలి):
ఈ వంకాయ కూర విధానంలో చైనా వంటకాల్లో వాడే శాసలతో మరియు భారతీయ వంటకాలలో వాడేటువంటి మసాలాలతో కలిపి తయారుచేస్తారు ముఖ్యంగా తక్కువ సమయంలో అధిక వేడిలో ఈ వంటను చేయడం దీని యొక్క ప్రత్యేకత.
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు: మీడియం సైజ్ – 2 (ముక్కలుగా కట్ చేసినవి)
పిండి మిశ్రమం: మొక్కజొన్న పిండి (Corn Flour) – 1/4 కప్పు, మైదా – 1/4 కప్పు, ఉప్పు, మిరియాల పొడి.
నూనె: డీప్ ఫ్రై చేయడానికి.
సాస్ కోసం:వెల్లుల్లి (తరిగినది): 2 టీస్పూన్లు
అల్లం (తరిగినది): 1 టీస్పూన్
ఉల్లిపాయ, పచ్చిమిర్చి: తరిగినవి
చిల్లీ సాస్ (రెడ్/గ్రీన్): 1 టేబుల్ స్పూన్
సోయా సాస్: 1 టేబుల్ స్పూన్
వెనిగర్: 1 టీస్పూన్
తేనె (Honey): 1-2 టేబుల్ స్పూన్లు
నువ్వులు (Sesame Seeds): పైన చల్లడానికి.
తయారీ పద్ధతి (Step-by-Step Process):
వంకాయలు ఫ్రై చేయడం:
వంకాయ ముక్కలను మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, మిరియాల పొడి కలిపిన మిశ్రమంలో బాగా కోట్ చేయాలి.
వేయించడం:
నూనెను బాగా వేడి చేసి, వంకాయ ముక్కలను బ్యాచ్‌లుగా వేసి, క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్‌గా అయ్యేవరకు వేయించాలి. టిష్యూ పేపర్‌పై తీసి పక్కన పెట్టుకోవాలి.
సాస్ సిద్ధం:
ఒక పాన్‌లో నువ్వుల నూనె వేడి చేసి, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి $30$ సెకన్లు వేయించాలి.
ఉల్లిపాయలు & సాస్‌లు:
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఎక్కువ వేడి మీద 1 నిమిషం వేయించాలి. ఆ తరువాత, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి బాగా
కలపాలి.
తేనె మరియు చిక్కదనం:
మంట తగ్గించి, తేనె మరియు కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేయాలి. అవసరమైతే, కొంచెం నీటిలో కలిపిన మొక్కజొన్న పిండి (slurry) వేసి, సాస్‌ను చిక్కగా చేయాలి.
కలపడం: చివరగా, వేయించిన వంకాయ ముక్కలను సాస్‌లో వేసి, సాస్ మొత్తం ముక్కలకు పట్టేలా వేగంగా కలపాలి.
సర్వింగ్: వెంటనే నువ్వులు చల్లి, వేడిగా సర్వ్ చేయాలి. (చల్లబడితే క్రిస్పీనెస్ తగ్గుతుంది).
ఈ విధంగా మనకు నచ్చిన వంకాయతో రకరకాల రెసిపీ తయారుచేసి మన కుటుంబ సభ్యులకు అందించవచ్చు అలాగే రుచికరమైన వంటను ఆస్వాదించవచ్చు.
Discover the joy of cooking with Vankaya different recipes that showcase the versatility of eggplant in various cuisines.
Explore more with Vankaya different recipes that bring unique flavors to your table.