
మీ Gmail ఇన్ బాక్స్ నిండా స్పామ్ మెయిల్స్ ఉన్నాయా? గూగుల్ తెచ్చిన కొత్త ‘Manage Subscriptions’ ఫీచర్ తో అనవసరమైన మెయిల్స్ కు ఒక్క క్లిక్ తో చెక్ పెట్టండి. దీనిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి.
Manage Subscriptions
రోజువారి జీవితంలో మనం ఎన్నో వెబ్సైట్లో లాగిన్ అవుతూ ఉంటాము తెలిసో తెలియకో ప్రమోషన్లని, ఆఫర్లని, సబ్స్క్రైబ్లని, చాలా వాటిని మనము నొక్కుతూ ఉంటాము. మనకు తెలియకుండానే మన Gmail అకౌంట్ వారి యొక్క వెబ్సైట్లో కానీ యాప్ లలో కానీ చేరిపోయి ఉంటుంది. దాని వలన మనకు అవసరం లేని మెయిల్స్ వస్తూ ఉంటాయి . కొంతమంది అవి చూస్తుంటారు. మరి కొంతమంది అసలు దాని గురించి మర్చిపోతూ ఉంటారు. దాని వలన అందులో అనవసరమైనటువంటి “Spam” లేదా “Promotional” Mails ఎక్కువగా వస్తుంటాయి ఎప్పుడైనా Mail ఓపెన్ చేద్దామని చెక్ చేస్తే అర్థం కాని ఎన్నో మెయిల్స్ ఎందుకు వచ్చాయో తెలియని మెయిల్స్ చాలా ఉంటాయి. వాటిలో ఎక్కువగా మనకు వచ్చే మెయిల్స్ సబ్స్క్రైబ్ చేయడం వలన వస్తూ ఉంటాయి. అయితే వాటి నుండి మనము బయటపడాలంటే Unsubscribe ఒక్కటే దారి. కానీ ప్రతి మెయిల్ ఓపెన్ చేసి Unsubscribe చేయడము చాలా టైం పడుతుంది. చాలా మందికి అది చేయటానికి వీలుకాకనే అలాగే వదిలేస్తూ ఉంటారు. దాని వలన కొన్ని వందల మెయిల్స్ అందులో స్టోర్ అయి ఉంటాయి. కానీ గూగుల్ ఇప్పుడు ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపించింది అదే అదే “Manage Subscriptions”.
ఏంటి ఈ కొత్త ఫీచర్? Gmail యాప్ సైడ్ బార్ మెనూలో (పైన ఉన్న స్క్రీన్ షాట్ లో చూపినట్లు) ఇప్పుడు కొత్తగా “Manage subscriptions” అనే ఆప్షన్ కనిపిస్తోంది. దీని పక్కన “New” అనే బ్యాడ్జ్ కూడా గూగుల్ ఉంచింది. ఇది మీ మెయిల్ అకౌంట్లో ఉన్న సబ్స్క్రిప్షన్లన్నింటినీ ఒకే చోట నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.
ఇది ఎలా పని చేస్తుంది? గతంలో ఏదైనా కంపెనీ నుండి మెయిల్స్ రాకూడదు అనుకుంటే, ఆ మెయిల్ ఓపెన్ చేసి, కింద చిన్న అక్షరాలతో ఉండే ‘Unsubscribe’ లింక్ వెతికి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఫీచర్ తో:
అన్నీ ఒకే చోట: మీరు Manage Subscriptions పై క్లిక్ చేయగానే, మీకు రెగ్యులర్ గా మెయిల్స్ పంపే కంపెనీలు లేదా వెబ్సైట్ల లిస్ట్ మొత్తం కనిపిస్తుంది.
ఫిల్టరింగ్: ఎవరు మీకు వారానికి ఎన్ని మెయిల్స్ పంపుతున్నారు (ఉదాహరణకు: వారానికి 10-20 మెయిల్స్) అనే దాని ఆధారంగా ఇది లిస్ట్ ను చూపిస్తుంది.
వన్-క్లిక్ Unsubscribe:
ప్రతి పేరు పక్కన ఒక ‘Unsubscribe’ బటన్ ఉంటుంది. మీకు అవసరం లేని వాటిని అక్కడికక్కడే తీసేయవచ్చు.
ఈ ఫీచర్ వల్ల కలిగే లాభాలు:
సమయం ఆదా: వందల కొద్దీ మెయిల్స్ ను వెతికి డిలీట్ చేసే పని తప్పుతుంది.
క్లీన్ ఇన్ బాక్స్: అనవసరమైన ప్రమోషనల్ మెయిల్స్ తగ్గి, మీకు ముఖ్యమైన ఆఫీస్ లేదా పర్సనల్ మెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి.
స్టోరేజ్ ఆదా: అనవసరమైన మెయిల్స్ రావడం ఆగితే, మీ గూగుల్ స్టోరేజ్ కూడా త్వరగా నిండిపోకుండా ఉంటుంది.
మీకు ఈ ఫీచర్ వచ్చిందా? గూగుల్ ఈ ఫీచర్ ను ప్రస్తుతం యూజర్లందరికీ దశలవారీగా (Roll out) అందిస్తోంది. మీ Gmail యాప్ ను లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ చేసుకోండి. ఎడమ వైపు ఉన్న మెనూ బార్ (Three lines) పై క్లిక్ చేసి, అక్కడ “Manage subscriptions” ఆప్షన్ ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా రాకపోతే, మరికొన్ని రోజుల్లో మీకూ వచ్చే అవకాశం ఉంది.
యూజర్ ఎక్స్పీరియన్స్ ని Google ఎప్పుడు మెరుగు పరుస్తూనే ఉంటుంది. అటువంటి ప్రయత్నాలలో ఇది కూడా నిజానికి ఇది చాలా ఉపయోగకరమైన ఫ్యూచర్ అని చెప్పవచ్చు. In Box లో తక్కువ మెయిల్స్ అది కూడా మనకు అవసరమైన మెయిల్స్ మాత్రమే పెట్టుకోవడం అనేది చాలా చక్కగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఈ ఫ్యూచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
