ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ క్యాన్సలేషన్లు: ఏమి జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది పూర్తి వివరాలు.
‘ఇండిగో (IndiGo)’ ఎయిర్‌లైన్స్ విమానాల రద్దులు మరియు ఆలస్యాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత లేదా అంతర్గత సమస్యలా? ప్రయాణికుల అసౌకర్యం, రీఫండ్ పాలసీల పూర్తి విశ్లేషణ.
భారతదేశ విమానయాన రంగంలో ‘ఇండిగో (IndiGo)’ ఒక తిరుగులేని పేరు.మార్కెట్ వాటాలో ‘ఇండిగో (IndiGo)’ అధిక భాగం కలిగి ఉంది. అలాగే ఇది అతి పెద్ద బడ్జెట్ ఎయిట్ లైన్స్. ఇటీవల కాలంలో మాత్రం ‘ఇండిగో (IndiGo)’ ఎయిర్‌లైన్స్ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గత కాలంలో ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎప్పుడు ఎదుర్కోలేదు. అయితే ‘ఇండిగో (IndiGo)’ విమానాలు రద్దు అవుతున్నాయని ఆలస్యాలు అవుతున్నాయని ఇప్పుడు అనేక సోషల్ మీడియాలలో, వార్త పత్రికల్లో, టీవీ చానల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కొన్ని వందల మంది ప్రయాణికులు ఈ ‘ఇండిగో (IndiGo)’ ఫ్లైట్ రద్దు కారణం చేత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ గతంలో ఇండిగో ఫ్లైట్ ‘ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్’ కి ఒక మంచి పేరుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఇండిగో విమాన సంస్థలు విమానాలను రద్దు చేయడానికి గల కారణాలు ఏమిటి? కేవలం వాతావరణమా? లేక సాంకేతిక సమస్యల? లేక సంస్థాగత స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా లోపమా ఈ సమగ్ర విషయాలన్నింటిని తెలుసుకుందాం.ఇండిగో సంస్థ యొక్క విమాన రద్దు కేవలం ఒక ఎయిర్ లైన్ సంస్థ మాత్రమే కాదు అది భారతదేశ విమానయాన మౌలిక సదుపాయాల సమర్ధతకు సంబంధించిన సమస్య.
సాంకేతిక సమస్యల నుండి సిబ్బంది కొరతవరకూ ఇండిగో విమాన రద్దుల వెనుక దాగి ఉన్న అసలైన సమస్యలు:
విమానాలు రద్దు కావడానికి అనేక అంతర్గత మరియు బాహ్య సంబంధమైన కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా నాలుగు అంశాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉంది.
1.ప్రాట్ & విట్నీ ఇంజిన్ సమస్యలు (Pratt & Whitney Engine Issues):
ఇండిగో ఎక్కువగా ఉపయోగిస్తున్న ‘ఎయిర్‌బస్ A320 నియో’ (Airbus A320 Neo) విమానాలు ప్రాట్ & విట్నీ తయారు చేసిన ఇంజిన్లతో నడుస్తున్నాయి. ఈ రకమైన ఇంజన్లలో గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా తరచుగా సాంకేతిక సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి కారణంగా ఇండిగో తన విమానాలు చాలా వరకు గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక విమానం గ్రౌండ్ అయితే దానికి సంబంధించిన అన్ని ఫ్లైట్లు రద్దువుతాయి ఇది ఇండిగో విమానాలు రద్దు కావడానికి ప్రధానమైన సాంకేతిక కారణం.
పైలట్లు మరియు క్యాబిన్ సిబ్బంది కొరత (Crew Shortage):
కోవిడ్-19 అనంతర కాలంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.ఇండిగో అధిక సంఖ్యలో విమానా సర్వీసులను అందిస్తూ ఉన్నందున పైలెట్లు మరియు క్యాబిన్ క్రూ సిబ్బంది అవసరం కూడా భారీగా ఉంటుంది. పని ఒత్తిడి సరైన విశ్రాంతి లేకపోవడం మరియు వారికి చెల్లించవలసినటువంటి వేతన సమస్యల కారణంగా కొంతమంది పైలెట్లు రాజీనామా చేయడం లేదా అనారోగ్యం సెలవులు తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. సిబ్బంది కొరతగా ఉంటే లేదా సిబ్బంది అందుబాటులో లేకపోతే ఆ విమానాన్ని నడపడానికి వీలుండదు. ఫలితంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేయక తప్పడం లేదు.
3.విమాన నిర్వహణ మరియు స్పేర్ పార్ట్స్ కొరత:
ఇండిగో విమానాల సంఖ్య వేగంగా పెరిగింది. దేశంలో ఇండిగో విమానాల సంఖ్య వేగంగా పెరిగింది అయితే వాటికి అవసరమైన సమర్థవంతమైన నిర్వహణ మరియు విడిభాగాల సరఫరా అవేగానికి అనుగుణంగా పెరగటం లేదు . విమానం గ్రౌండ్ అయినప్పుడు విడిభాగాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావటం వలన విమానా సర్వీసులు రద్ద లేదా ఆలస్యం కావడం తప్పనిసరి అవుతుంది.
వాతావరణ ప్రభావం మరియు ఎయిర్పోర్ట్ రద్దీ:
కొన్నిసార్లు భారీ వర్షాలు, పొగ మంచు లేదా ఇతర వాతావరణ సమస్యలు విమానాల రాకపోకలను చాలా ప్రభావితం చేస్తాయి. ప్రధాన విమానాశ్రయాలలో రన్-వేల కొరత మరియు విమానాల రద్దీ (Air Traffic Congestion) కారణంగా ఒక చిన్న సమస్య కూడా ఒకదానికి ఒకటి తోడై తదుపరి అన్ని ఫ్లైట్లపై ప్రభావం చూపి ‘ఇండిగో (IndiGo)’ విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.
ప్రయాణికులపై ప్రభావం: విమానం రద్దు అయితే ప్రయాణికుడి పరిస్థితి ఏంటి?
ఇండిగో విమానాలు రద్దు కావడం అనేది ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది కేవలం ప్రయాణ సమయ నష్టమే కాకుండా, ఆర్థిక మరియు మానసిక ఒత్తిడికి కూడా దారితీస్తుంది.
ఆర్థిక నష్టం మరియు ప్రయాణ ప్రణాళికల విఘాతం: చాలా మంది ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్లు లేదా రైలు ప్రయాణాలను ముందుగానే బుక్ చేసుకుంటారు. విమానం రద్దు అయినప్పుడు, వారు ఆ ప్రయాణాలకు కూడా నష్టపోతారు. ముఖ్యమైన వ్యాపార సమావేశాలు, వ్యక్తిగత వేడుకలు (పెళ్లిళ్లు, కార్యక్రమాలు), లేదా సెలవు ప్రణాళికలు పూర్తిగా దెబ్బతింటాయి. అర్ధరాత్రి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోవడం వంటివి ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా చేదుగా మారుస్తున్నాయి.
కార్పొరేట్ స్పందన మరియు రీ-షెడ్యూలింగ్: ఇండిగో విమాన రద్దులు జరిగినప్పుడు, ఎయిర్‌లైన్ తరచుగా ప్రత్యామ్నాయ విమానాన్ని (Re-scheduling) లేదా పూర్తి రీఫండ్‌ను అందిస్తుంది. అయినప్పటికీ, ప్రత్యామ్నాయ విమానాలు తరచుగా మరుసటి రోజు లేదా అంతకంటే ఆలస్యంగా ఉండటం వలన ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కస్టమర్ సర్వీస్ లైన్లు బిజీగా ఉండటం, తక్షణ సమాచారం లభించకపోవడం వంటివి సమస్య తీవ్రతను పెంచుతున్నాయి.
ప్రభుత్వం మరియు DGCA జోక్యం:
పెరుగుతున్న ఈ సమస్యపై భారతీయ విమానయాన నియంత్రణ సంస్థ (Directorate General of Civil Aviation – DGCA) కూడా దృష్టి సారించింది. ప్రయాణికుల హక్కులను కాపాడటానికి, ఆలస్యాలు మరియు రద్దుల విషయంలో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన నిబంధనలను DGCA కఠినతరం చేసింది. ఎయిర్‌లైన్స్ సరైన సమయంలో ప్రయాణికులకు సమాచారం అందించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా పరిహారం అందించడం వంటివి తప్పనిసరి అని స్పష్టం చేసింది. అయితే, క్షేత్ర స్థాయిలో ఈ నిబంధనల అమలు ఇంకా పూర్తిస్థాయిలో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రయాణీకుల హక్కులు మరియు రీఫండ్ విధానం: ఇండిగో విమానాలు రద్దు అయినప్పుడు ఏం చేయాలి?
ఇండిగో విమానాలు రద్దు అయినప్పుడు ప్రయాణికులు తమ హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. DGCA నిబంధనల ప్రకారం, విమానం రద్దు అయినట్లయితే, ఎయిర్‌లైన్స్ కింది వాటిని అందించాలి:
పూర్తి రీఫండ్: ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంటే, టికెట్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వాలి.
ప్రత్యామ్నాయ ప్రయాణం: ప్రయాణికులు కోరుకుంటే, ఎటువంటి అదనపు రుసుము లేకుండా అదే గమ్యస్థానానికి తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో లేదా ఇతర ఎయిర్‌లైన్‌లో రీ-బుక్ చేయాలి.
పరిహారం (Compensation): రద్దు గురించి 24 గంటల ముందు తెలియజేయకపోతే, మరియు ఆలస్యం నిర్ణీత గంటల కంటే ఎక్కువగా ఉంటే, ఎయిర్‌లైన్ అదనపు పరిహారం (Accommodation, Food, etc.) అందించాల్సి ఉంటుంది.
ముందుకు దారి:
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే, కేవలం తాత్కాలిక చర్యలు కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించాలి. ప్రాట్ & విట్నీ ఇంజిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం, పైలట్లు మరియు సిబ్బందికి మెరుగైన శిక్షణ మరియు వేతనాలను అందించడం, మరియు విమానాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి అత్యవసరం. ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలకు అదనపు సమయాన్ని కేటాయించడం, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, మరియు ఇండిగో విమాన రద్దుల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇండిగో తన విశ్వసనీయతను తిరిగి నిలబెట్టుకోవాలంటే, మెరుగైన ఆపరేషనల్ ఎఫిషియెన్సీని సాధించడం చాల అవసరం.
