Google Pay Flex Credit Card
నేటి డిజిటల్ యుగంలో చాలామంది నగదు రహితమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యూపీఐ(UPI) పేమెంట్ వచ్చిన తర్వాత జేబులో పర్సు లేకపోయినా పర్వాలేదు కానీ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్లి ఏదైనా కొనేయొచ్చు అనే విధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) మరియు ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) బ్యాంక్ కలిపి సరికొత్త డిజిటల్ క్రెడిట్ కార్డు ని ప్రవేశపెట్టారు.అదే “గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్“.
ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రయోజనాలు ఏమిటి? అలాగే దీన్ని సులభంగా ఎలా పొందాలో వివరాలు తెలుసుకుందాం.
గూగుల్ పే ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
సాధారణంగా క్రెడిట్ కార్డ్ అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది ఏటీఎం వంటి ప్లాస్టిక్ కార్డు. కానీ ఫిజికల్ కార్డు లేకుండానే పూర్తి డిజిటల్ క్రెడిట్ కార్డు కూడా ఉంటుందని తెలుసా? అంటే క్రెడిట్ కార్డు మన చేతికి రాకున్నా పర్లేదు కానీ మొబైల్ ఫోన్లో అది యాక్టివ్ లో ఉంటుంది. దాని ద్వారా మనం ట్రాన్సాక్షన్లు కూడా చేయవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం కూడా లేదు.
రూపే (RuPay) నెట్వర్క్ పవర్
ఈ కార్డు యొక్క అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది రూపే (RuPay) ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. దీని ద్వారా మన క్రెడిట్ కార్డు ని నేరుగా గూగుల్ పే యూపీఐ కి లింక్ చేసుకోవచ్చు. అలాగే మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు ద్వారా మనము స్కాన్ చేసి మన క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి అమౌంట్ ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు.
గూగుల్ పే ఫ్లెక్స్ కార్డ్ ప్రత్యేకతలు (Key Features)
ఈ క్రెడిట్ కార్డ్ కి కొన్ని ప్రత్యేకమైన లాభాలు కూడా ఉన్నాయి. అందులో బాగా ఉపయోగపడే ఫ్యూచర్ ఏమిటంటే? మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్ కి రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి . సాధారణంగా వేరే క్రెడిట్ కార్డులకైతే మనం చేసిన ట్రాన్సాక్షన్ కి నెల తరువాత రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. కానీ ఈ క్రెడిట్ కార్డు కి మాత్రం మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కి వెంటనే రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. వాటిని తర్వాత మనము ఉపయోగించుకోవచ్చు.ఇందులో ఒక స్టార్ విలువ ఒక రూపాయికి సమానం ($1 Star = 1 Rupee$). ఇది వినియోగదారులకు చాలా స్పష్టమైన లాభాన్ని ఇస్తుంది.దరఖాస్తు చేయడం నుండి కేవైసీ (KYC) వరకు అంతా పేపర్‌లెస్ మరియు ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతుంది.మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోయినా, ఈ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే వెసులుబాటు ఉంటుంది.
ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బాగా లాభదాయకంగా ఉంటుంది
ఎవరయినా యూపీఐ పేమెంట్స్ ద్వారా చిన్నచిన్న పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటే వాళ్ళకి ఈ కార్డు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రతిసారి మనము కార్డు తీసుకొని వెళితేనే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి లేకపోతే లేదు అన్న టెన్షన్ లేకుండా, మన మొబైల్ ఫోన్ లోనే ఉండటం వల్ల ఈజీగా మనం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ యాడ్ అవటంవల్ల వాటిని తిరిగి ఉపయోగించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. తక్కువ డాక్యుమెంటేషన్ త్వరగా క్రెడిట్ కార్డు పొందాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు.
గూగుల్ పే ఫ్లెక్స్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలి? (Step-by-Step Guide)
మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే (GPay) యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసి ఓపెన్ చేయండి.యాప్ హోమ్ స్క్రీన్‌పై క్రిందికి స్క్రోల్ చేస్తే ‘Manage your money’ లేదా ‘Money’ సెక్షన్ కనిపిస్తుంది.అక్కడ మీకు ‘Credit Cards’ లేదా ‘Get Flex’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.మీ పాన్ కార్డ్ (PAN), వృత్తి (Job/Business), మరియు నెలవారీ ఆదాయ వివరాలను ఎంటర్ చేయండి.ఆధార్ నంబర్ ద్వారా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయండి. అవసరమైతే వీడియో కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది.మీ క్రెడిట్ స్కోర్ మరియు వివరాలను బ్యాంక్ పరిశీలించి, నిమిషాల్లోనే అప్రూవల్ ఇస్తుంది.కార్డు ఆమోదం పొందిన వెంటనే, మీ డిజిటల్ కార్డు గూగుల్ పే యాప్‌లో కనిపిస్తుంది. మీరు వెంటనే షాపింగ్ మొదలుపెట్టవచ్చు.
ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits)
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి మరియు తరచుగా యూపీఐ వాడేవారికి ఈ కార్డు ఒక వరమని చెప్పవచ్చు.
| ప్రయోజనం | వివరణ |
| క్యాష్‌బ్యాక్ & రివార్డ్స్ | గూగుల్ పే ద్వారా చేసే లావాదేవీలపై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. |
| నో జాయినింగ్ ఫీ | ప్రారంభ ఆఫర్ కింద అనేకమందికి తక్కువ ఫీజు లేదా జీరో ఫీజుతో లభించే అవకాశం ఉంది. |
| షాపింగ్ ఆఫర్స్ | మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు. |
| డైరెక్ట్ క్రెడిట్ | రివార్డులు నేరుగా మీ గూగుల్ పే వాలెట్ లేదా స్టేట్మెంట్ డిస్కౌంట్‌గా మారతాయి. |
గూగుల్ పే మరియు యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా తీసుకువచ్చినటువంటి ఈ ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్ నిజంగానే వినియోగదారులకు చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు. మన దగ్గర మనీ లేని సమయంలో ఈ క్రెడిట్ కార్డ్ వాడుకొని అత్యవసర పరిస్థితులలో యూపీఐ ద్వారా మనము ట్రాన్సాక్షన్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ఎంత భద్రంగా వాడుకుంటామో అలాగే మరికొన్ని క్రెడిట్ కార్డ్స్ అయినా లోన్స్ అయినా మనకు పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడిన ప్రతిసారి దాని బిల్లులు సకాలంలో చెల్లించడం అనేది మన మనీ మేనేజ్మెంట్ కి అలాగే మన క్రమశిక్షణ కి నిదర్శనం. లేదంటే మనం క్రెడిట్ కార్డ్ బిల్లులకి ఎక్కువగా వడ్డీ చెల్లించవలసి వస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ని జాగ్రత్తగా ఉపయోగించుకొని దాని ద్వారా లాభం పొందే విధంగా చూసుకోవాలి.
