భారత బడ్జెట్ 2026 ముఖ్యాంశాలు
భారతదేశ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను పార్లమెంటులో ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్లో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, మరియు వ్యవసాయము అలాగే సామాన్యుడికి యొక్క సంక్షేమంపై దృష్టి పెట్టారు అని అనిపిస్తుంది. బడ్జెట్ అనంగానే అనేకమైనటువంటి అంశాలు ప్రతికూల అంశాలు అందులో ఉంటాయి. కొంతమందికి నిరుస్తాహాన్ని కలిగించవచ్చు మరి కొంతమందికి ఊరట కలిగించవచ్చు. 2026 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ విధానంలో ఎవరికి మేలు జరిగింది. ఎవరికి నిరాశ మిగిలింది అనే విషయాన్ని తెలుసుకుందాం.
ధరలు తగ్గే వస్తువులు (చౌకగా మారేవి)
ఈ ఆర్థిక సంవత్సరం నుండి కింది వస్తువులపై పన్నులు/సుంకాలు తగ్గించడం వల్ల వీటి ధరలు దిగివస్తాయి:
| కేటగిరీ | వస్తువుల వివరాలు | కారణం |
| ఆరోగ్యం (Health) | క్యాన్సర్, డయాబెటిస్ మందులు, ఎక్స్-రే మిషన్లు | ప్రాణరక్షక మందులపై దిగుమతి సుంకం రద్దు/తగ్గింపు. |
| ఎలక్ట్రానిక్స్ | మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, పీసీబీ (PCB) బోర్డులు | మొబైల్ విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15% కు తగ్గింపు. |
| నిత్యావసరాలు | సన్ ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ | వంట నూనెల దిగుమతిపై పన్ను రాయితీ పొడిగింపు. |
| ఆటోమొబైల్స్ | ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) | లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి వాడే ముడి పదార్థాలపై సుంకం తగ్గింపు. |
| పరిశ్రమలు | రాగి (Copper), చిక్కుడు (Scrap) | తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు మెటల్ స్క్రాప్ పై పన్ను తగ్గింపు. |
| ఆభరణాలు | బంగారం, వెండి, ప్లాటినం | గత బడ్జెట్ కొనసాగింపుగా కస్టమ్స్ డ్యూటీ తక్కువగానే ఉండటం. |
ధరలు పెరిగే వస్తువులు (ప్రియంగా మారేవి)
కింది వస్తువులపై పన్నులు లేదా సెస్ (Cess) పెంచడం వల్ల ఇవి ఖరీదైనవిగా మారుతాయి:
| కేటగిరీ | వస్తువుల వివరాలు | కారణం |
| వ్యసన పదార్థాలు | సిగరెట్లు, హుక్కా, పొగాకు ఉత్పత్తులు | NCCD (National Calamity Contingent Duty) పెంపు. |
| విలాస వస్తువులు | దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు, హై-ఎండ్ వాచీలు | విదేశీ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. |
| ఆటోమొబైల్స్ | పెట్రోల్/డీజిల్ కార్లు (SUVలు) | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్బన్ సెస్ విధించే అవకాశం. |
| నిత్యావసరాలు | ప్లాస్టిక్ వస్తువులు, ప్యాక్ చేసిన స్వీట్లు | సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కఠిన పన్నులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం. |
| ఎలక్ట్రానిక్స్ | విదేశీ టెలికాం పరికరాలు | స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకం పెంపు. |
మధ్యతరగతి వారికి అలాగే ఆదాయ పన్ను చెల్లించే వారికి ఊరట కలిగించే అంశాలు
క్రొత్త ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లో వార్షిక ఆదాయం 8 లక్షల వరకు ఉన్నటువంటి వారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా బడ్జెట్ ని రూపొందించారు. అలాగే దేశంలో డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ప్రోత్సహించడానికి కొన్ని ఇన్సెంటివ్స్ ని కూడా ప్రకటించారు.
వ్యవసాయ రంగం (Agricultural sector)
వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయంలో ఎరువుల వాడకంలో నానో యూరియా మరియు నానో డీఏపీ వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు అందించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో యువతను వారి యొక్క ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి స్టార్టప్ కంపెనీలు ప్రారంభించేందుకు ప్రత్యేకమైనటువంటి నిధిని కేటాయించడం జరిగింది . కొన్ని రకాల కీలకమైన పంటలకు కనీస మద్దతు ధర ను శాస్త్రీయబద్ధంగా పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
మౌలిక సదుపాయాలకి పెద్దపీట
గత సంవత్సరం బడ్జెట్ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు ప్రాధాన్యతను ఇచ్చారు. ముఖ్యంగా రైల్వేలు, గ్రీన్ ఎనర్జీ, నేషనల్ హైవేస్ మీద దృష్టి పెట్టారని చెప్పవచ్చు. వందే భారత్ రైల్వే సంఖ్యను మరింతగా పెంచేందుకు అలాగే రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణకి భారీగా నిధులు కేటాయించారు. గ్రీన్ ఎనర్జీ లో భాగంగా సౌరశక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేశారు. ఈసారి బడ్జెట్లో జాతీయ రహదారుల యొక్క ఆధునీకరణ కోసం అలాగే విస్తరణ కోసం ప్రత్యేకమైన కేటాయింపులు చేశారు. దాదాపుగా పదివేల కిలోమీటర్ల క్రొత్త హైవే ల నిర్మాణం కొరకు కేటాయింపులు చేశారు.
విద్య మరియు ఉపాధి కొరకు ప్రత్యేక స్థానం
ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క బడ్జెట్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, అలాగే నైపుణ్యం పెంచడం కొరకు ప్రత్యేక మైనటువంటి శ్రద్ధ వహించారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే పీఎం కౌశల్ వికాస్ యోజన 5.0 క్రింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోటిక్స్ వంటి విభాగాలలో యువకులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి, తోడ్పాటుకి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. అలాగే మారుమూల ప్రాంతాలలో మరిన్ని ఐఐటి మరియు ఎయిమ్స్ తరహా విద్యాసంస్థలను కొత్తగా ఏర్పాటు చేయటానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం కొరకు ఎవరైతే స్టార్ట్ కంపెనీలను మొదలుపెట్టాలని అనుకుంటున్నారో అటువంటి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి రాయితీలతో కూడినటువంటి రుణాలు మంజూరు చేసే దిశగా అలాగే వారి అభివృద్ధికి తోడ్పాటు గా ఉండేలా ఈ సంవత్సరం బడ్జెట్ అనుకూలంగా ఉంది.
ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం
అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో వైద్య రంగానికి అధిక మొత్తంలో నిధులను పెంచారు. డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి పౌరుడికి హెల్త్ ఐడి మరియు ఆన్లైన్ వైద్య సేవలను అందుబాటులో తెచ్చే విధంగా రూపొందించారు. మందులు ధరల నియంత్రణ కొరకు ప్రత్యేక దృష్టి పెట్టారు. జనరిక్ మందుల దుకాణాలను విస్తరించడానికి ప్రణాళికలు వేశారు. అలాగే క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కీలకమైన పరికరాలు మరియు మందులపై దిగుమతి సుంకాలను తగ్గించారు.
పారిశ్రామిక మరియు సాంకేతిక అభివృద్ధి
మేకింగ్ ఇండియా ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ బడ్జెట్ ని రూపొందించారు. సెమీ కండక్టర్ మిషన్, భారతదేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చేందుకు అనేక రకాల సబ్సిడీలను అనుకూల పరిస్థితులను కల్పించారు. సాంకేతిక టెలికాం రంగంలో 5G నుండి 6G వైపుకు దేశాన్ని నడిపించే దిశగా పరిశోధనల కొరకు నిధులను కేటాయించారు.
పర్యావరణము
వాతావరణ మార్పులను అలాగే గ్లోబల్ వార్మింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే ఇవి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సబ్సిడీలను మరియు బ్యాటరీ స్వాపింగ్ పాలసీ విధానాన్ని తీసుకొని వచ్చారు. కరువు ప్రాంతాలకు నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు, నదుల అనుసంధానం చేయడం కొరకు అలాగే ప్రాజెక్టులను వేగవంతం చేయడం కొరకు ప్రత్యేకమైన బడ్జెట్‌ని కేటాయించారు.
ప్రతిపక్షాల అసంతృప్తి
2026-27 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వారి యొక్క వాదనలో ప్రాంతీయపరమైన అసమానతలు ఎక్కువగా చూపించారని విమర్శిస్తున్నారు. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని కేవలం రాజకీయంగా మేలు చేసే రాష్ట్రాలకే బడ్జెట్లో మేలు చేసే విధంగా ఉందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేశారని విమర్శిస్తున్నారు. ఉపాధి కల్పనపై కేటాయింపులు కేవలం నామమాత్రం గానే ఉన్నాయని నిరుద్యోగ యువతకు ఈ బడ్జెట్లో సరైనటువంటి భరోసా లభించలేదని విమర్శిస్తున్నారు. నిత్యవసర వస్తువుల యొక్క ధరలను తగ్గించేందుకు ఎటువంటి ప్రతిష్టమైన ప్రత్యేక చర్యలు తీసుకోలేదని వాదిస్తున్నారు
ఆరోగ్యం పట్ల ఈ బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే క్యాన్సర్, డయాబెటిస్ వంటి మందులపై దిగుమతి సుఖాన్ని రద్దు చేయడం దీనికి సానుకూలంగా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ పరికరాలకు కూడా కస్టమ్స్ డ్యూటీ శాతాన్ని తగ్గించారు. నిత్యవసర వస్తువులలో భాగంగా సన్ ఫ్లవర్ ఆయిల్ అలాగే పామాయిల్ వంటి వాటిపై దిగుమతి రాయితీని పొడిగించారు. ఆటోమొబైల్స్, పరిశ్రమలు వంటి వాటిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినట్లు కనిపిస్తుంది.
