బ్యాంక్ ఛార్జీల షాక్: SMS & ATM ఫీజుల పూర్తి విశ్లేషణ
ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీ యుగంలో మనం చేసే ప్రతి చిన్న లావాదేవీలకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా అవసరం పడుతుంది. అయితే ఒకప్పుడు మనకు ఉచితంగా లభించే అటువంటి సేవలు ఇప్పుడు కస్టమర్లకి పెద్ద భారంగా ఉండబోతున్నాయి. ఇటీవల పార్లమెంట్ గణాంకాల ప్రకారం, కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023-25 కాలంలో) రూ.3,388 కోట్ల రూపాయలను కేవలం SMS సేవల ద్వారానే ఆర్జించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డిజిటల్ ఇండియా లో భాగంగా దాదాపుగా అన్ని బ్యాంకింగ్ సంస్థలు కూడా తమ బ్యాంకు యొక్క లావాదేవీలను డిజిటల్ గా ప్రజలకు అందించేందుకే మొగ్గు చూపుతున్నారు. మొదట్లో మనం జరిపినటువంటి లావాదేవీలకు అంటే డబ్బులు విత్ డ్రా, చేసిన డిపాజిట్ చేస్తే మనకి ఒక ఎస్ఎంఎస్(SMS) అలర్ట్ వచ్చేది. కాలక్రమేనా టెలికాం కంపెనీలు ఈ డిజిటల్ సేవలకు గాను అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. అలాగే డిజిటల్ సెక్యూరిటీని పెంచే క్రమంలో కూడా ‘డిజిటల్ టోకెన్ అథెంటికేషన్’ (DBT) వంటి వ్యవస్థల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నది కావడంతో బ్యాంకులన్నీ ఈ భారాన్ని తమ భరించకుండా కస్టమర్లపై వేస్తున్నారు.
ATM విత్డ్రావల్స్: మీ డబ్బు తీసుకోవడానికీ పరిమితులే!
ఒకప్పుడు మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బును ఎన్నిసార్లయినా ATM ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి మారిపోయింది. అంటే ఒక నిర్ణీత విత్ డ్రా పరిమితి దాటన తర్వాత చేసే ప్రతి విత్ డ్రా పై రూ.21 వరకు (జీఎస్టీ అదనం) వసూలు చేస్తున్నాయి.
సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి ప్రతి నెలలో 5 ఉచిత లావాదేవీలు ATM ద్వారా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా వారి యొక్క సొంత బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఏటీఎంలో చేసుకోవాలి. కానీ ఇతర బ్యాంకు ఏటీఎంలో వాడి విత్ డ్రా చేయాలంటే మెట్రో నగరాలలో అయితే 3 నాన్ వెట్రో నకరాలలో అయితే 5 లావాదేవీల వరకు ఉచితంగా ఉంటుంది. పరిమితి దాటిన తర్వాత చేసే ఆర్థిక లావాదేవీలకు రూ.21 + GST, ఆర్థికేతర లావాదేవీలకు (బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివి) రూ.10 + GST వసూలు చేస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే కేవలం మనము ట్రాన్సాక్షన్స్ చేసినందుకే డబ్బులు వసూలు చేయడమే కాకుండా మనం కలిగి ఉన్నటువంటి ATM కార్డు కు కూడా ప్రతి ఏడాదికి రూ.150 నుండి రూ.500 వరకు బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.
SBI ఆదర్శం: మిగతా బ్యాంకులు ఎందుకు చేయడం లేదు?
భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ వ్యవస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరం నుండి తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్ చార్జీలను పూర్తిగా రద్దు చేసింది అయితే ఇది కోట్ల మంది ఖాతాదారులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు మిగిలిన బ్యాంకులు కూడా ఇదేవిధంగా అదే బాటలో నడవాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నాను కానీ ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో అదనపు భారం వేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి డిజిటల్ బ్యాంకింగ్. మిగిలిన బ్యాంకులు ఎస్బిఐ చేసిన విధంగానే ఎస్ఎంఎస్ చార్జీలు పూర్తిగా రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
దేశంలో అందరికీ డిజిటల్ బ్యాంకింగ్ సౌలభ్యం కలిగించాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ ఈ విధంగా ప్రజలపై బ్యాంకులో భారాన్ని మోపడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉండే అనేకమంది ఈ డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బ్యాంకు ఛార్జీల భారం తగ్గించుకోవడానికి కస్టమర్లు ఈ క్రింది చిట్కాలను పాటించవచ్చు:
మొబైల్ యాప్స్ వాడకం: SMS అలర్ట్ల కంటే బ్యాంక్ మొబైల్ యాప్స్ (ఉదా: mPassbook) ద్వారా లావాదేవీలను ట్రాక్ చేయడం ఉచితం.
ATM ప్లానింగ్: పదే పదే చిన్న మొత్తాలు డ్రా చేయకుండా, నెలకు అవసరమైన మొత్తాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవడం ద్వారా అదనపు ఛార్జీలు తప్పించుకోవచ్చు.
UPI లావాదేవీలు: వీలైనంత వరకు నగదు విత్డ్రా తగ్గించి, UPI (PhonePe, Google Pay) ద్వారా నేరుగా చెల్లింపులు చేయడం వల్ల ATM వాడకం తగ్గుతుంది.
మినిమమ్ బ్యాలెన్స్: చాలా బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అదనపు పెనాల్టీలు వేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ కనీస నిల్వ ఉండేలా చూసుకోండి.
SMS ఛార్జీలలో టాప్-6 బ్యాంకుల జాబితా (2023-25 గణాంకాలు)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. బ్యాంకుల వారీగా వసూలు చేసిన మొత్తం (కోట్ల రూపాయల్లో) కింద చూడవచ్చు
| బ్యాంక్ పేరు | వసూలు చేసిన మొత్తం (రూ. కోట్లలో) |
| యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 1,188.14 |
| కెనరా బ్యాంక్ | 506.28 |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 360.45 |
| సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 308.72 |
| ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 204.89 |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 202.42 |
బ్యాంకులు తమ యొక్క నిర్వహణ ఖర్చుల పేరుతో విధిస్తున్నటువంటి ఈ చార్జీలు నిజంగా సామాన్యుడు జోబుకి చిల్లు పెడుతున్నాయి. మనం ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటాం మన అకౌంట్ లో 1000 రూపాయలు ఉన్నప్పుడు లేదా 5000 రూపాయలు ఉన్నప్పుడు ఎస్ఎంఎస్ చార్జీల పేరుతో అమౌంట్ కట్ అవుతుంది. తర్వాత మినిమం బాలన్స్ మైంటైన్ చేయడం లేదని మరి ఎక్కువగా డబ్బులు అకౌంట్ నుండి కట్ అవుతూ ఉంటాయి . అలాగే ఏటీఎం కార్డు వాడినందుకు ఎస్ఎంఎస్ చార్జెస్ కొరకు ప్రతి అవసరాన్ని ప్రతి ఖర్చుని బ్యాంకు కస్టమర్ల మీద వేస్తూ ఉన్నారు . ఒక చిన్న మొత్తము కూడా సామాన్యునికి భారంగా మారుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితికి ప్రభుత్వం సరైన విధానాన్ని తీసుకొని రావాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. డిజిటల్ ఇండియాలో డిజిటల్ సేవలు పెరగాలంటే ఇది చాలా ముఖ్యమైన అంశము. నేటికీ కూడా మన భారతదేశంలో కనీసం బ్యాంక్ అకౌంట్ లేనివారు కూడా కోట్లల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా పేదవాడికి గ్రామాలలో నివసించే వారికి ఆ సేవలు ఇంకా అందుబాటులో రావటం లేదు. ఇటువంటి పరిస్థితి అంతా మనదేశంలో మారి ప్రజలందరూ ఆర్థికంగా బలపడాలని కోరుకుందాం.
