శాలరీ స్లిప్ లేకుండా హౌస్ లోన్ ఎలా పొందాలి?
“నా దగ్గర శాలరీ స్లిప్ లేదు… అయినా నాకు హౌస్ లోన్ వస్తుందా?” అని చాలా మంది బ్యాంకుల్లో అడుగుతుంటారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, రైతులు, దుకాణదారులు, యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్లు, అలాగే చేతికి జీతం తీసుకునే ఉద్యోగులు ఈ సందేహంతో ఇబ్బంది పడుతుంటారు.
నిజానికి, హౌస్ లోన్ పొందడానికి శాలరీ స్లిప్ ఒక్కటే మార్గం కాదు. మీ ఆదాయం నిరూపించే ఇతర పత్రాలు, మంచి CIBIL స్కోర్, బ్యాంక్ లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్నులు వంటి ఆధారాలు ఉంటే కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు హౌస్ లోన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
అయితే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి? బ్యాంకులు ఏ అంశాలను ఎక్కువగా పరిశీలిస్తాయి? ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం.
లోన్ పొందాలంటే బ్యాంకులు పెట్టే కండిషన్లు అన్నీ ఇన్ని కాదు. అందులోనూ హౌస్ లోన్ లక్షల్లో ఉంటుంది. కాబట్టి మరింత ఎక్కువ డాక్యుమెంట్స్ ని అడుగుతుంటారు. గుర్తింపు కార్డులు, ఇంటి పత్రాలు, అలాగే లోన్ పొందే వ్యక్తికి ఆదాయం వస్తుందా? వస్తే ఎంత వస్తుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు.
ఉద్యోగం చేసే వారికి హౌస్ లోన్ కావాలంటే వారికి వస్తున్న ఆదాయం ఎంత? నిజంగానే వారికి నెల నెల సాలరీలు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా? లేదా అని గమనిస్తారు.అందుకోసం 3 నుండి 6 నెలల శాలరీ స్లిప్పులను కూడా బ్యాంకు వారు పరిశీలిస్తారు.
చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు లేదా పెద్ద వ్యాపారాలు చేసేవారు, ఏ రంగంలోనైనా తన సొంత ఆదాయాన్ని సంపాదించేవారు, రైతులు, దుకాణాలు నడిపేవారు ఇటువంటి వారికి ఉద్యోగస్తుల లాగా నెల నెల జీతాలు రావు వారికి శాలరీ స్లిప్పులు కూడా ఉండవు.
అయితే వీరికి హౌస్ లోన్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలి ఆధార్ ధ్రువపత్రాలు లేకుండా ఏ విధంగా వారు హౌస్ లోన్ పొందాలి.
శాలరీ స్లిప్పులు లేకుండా హౌస్ లోన్ పొందడం సాధ్యమా?
మీరు ఉద్యోగం చేయకపోయినా నెల జీతాలు బ్యాంక్ అకౌంట్ లో పడకపోయినా, అంటే కొంతమంది ఉద్యోగం చేస్తారు కానీ చేతికి డబ్బులు అందుతాయి. అటువంటి వారికి శాలరీ స్లిప్పులు ఉండవు. అటువంటి అటువంటి వారికి హౌస్ లోన్ పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
శాలరీ స్లిప్ లు లేకపోయినా మరి కొన్ని ఇతర డాక్యుమెంట్స్ ఆధారంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ హౌస్ లోన్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి.
శాలరీ స్లిప్పులు లేకపోతే బ్యాంకు స్టేట్మెంట్లు, ఆదాయ పన్ను చెల్లింపులు, బిజినెస్ ఫైనాన్షియల్ రికార్డులు వంటి డాక్యుమెంట్లు అందించి మనం ఆదాయం సంపాదిస్తున్నామని బ్యాంక్ వారికి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పత్రాల ఆధారంగా మనం లోన్ తీసుకుంటే వాటిని మనము తిరిగి కట్టగలం అని బ్యాంకు వారికి నిరూపించుకోవలసి ఉంటుంది.
ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా గమనించేది ఏమిటంటే సిబిల్ స్కోర్. ఒక వ్యక్తికి మంచి సిబిల్ స్కోర్ ఉంటే అతను బ్యాంకు లావాదేవీలలో చాలా నిజాయితీగా ఉన్నాడని బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. దానిలో ఉండే డేటా ఆధారంగా వారు గతంలో ఎప్పుడైనా చిన్న, పెద్ద మొత్తంలో కానీ రుణాలు తీసుకున్నారా దానిని ఎంతవరకు కట్టారు వంటి అనేక రకమైన సమాచారం తెలుసుకుంటారు. దానినిబట్టి వినియోగదారుడు యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు.
ఒకవేళ మన సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే హౌస్ లోన్ పొందడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఉద్యోగం చేయకపోయినా ఏదైనా వ్యాపారం చేస్తున్న చిన్న పెద్ద బిజినెస్ చేస్తున్నా హౌస్ లోన్ పొందడానికి సివిల్ స్కోర్ అనేది ఒక చాలా విధంగా సహాయపడుతుంది.
అసలు ఆదాయ ధ్రువీకరణకి ఎటువంటి పత్రాలు అవసరమవుతాయి
శాలరీ స్లిప్పు లేకున్నప్పుడు హౌస్ లోన్ తీసుకో వాలి అనుకున్నప్పుడు మనకు కొన్ని రకాల డాక్యుమెంట్లు చాలా ఉపయోగపడతాయి.
బ్యాంక్ స్టేట్మెంట్ : బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా వ్యక్తి యొక్క ఆరు నెలల నుండి 12 నెలల వరకు ఆదాయ వేయాలను పరిశీలిస్తుంది. మన యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది.
టాక్స్ రిటర్న్స్ అలాగే ఇతర వ్యాపార సంబంధిత పత్రాలు : దీని ద్వారా గత మూడు సంవత్సరాల కు సంబంధించినటువంటి ఆదాయ టాక్స్ రిటర్న్స్, జిఎస్టి, రిజిస్ట్రేషన్లు అలాగే బిజినెస్ లైసెన్సులు వంటి డాక్యుమెంట్లు ఉంటాయి . వీటిని కూడా బ్యాంకులు పరిశీలిస్తారు.
కో అప్లికేంట్ : మన కుటుంబంలో సభ్యుల్లో ఎవరైనా లేదా జీవిత భాగస్వామి ని కూడా మనం అప్లికేటుగా చేర్చుకోవచ్చు దీని ద్వారా వారి
యొక్క ఆదాయానికి సంబంధించినటువంటి ధ్రువపత్రాన్ని బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది ఇది మన యొక్క ఆదాయాన్ని మరింతగా ప్రతిబింబించేలా నమ్మకం కలిగేలా చేసి హౌస్ లోన్ పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
ఇతర డాక్యుమెంట్స్ : మన యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత బలంగా ఉందో బ్యాంకులకు తెలియజేసేందుకు మన యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను, ఎల్ఐసి పాలసీలను అలాగే మనకు ఉన్నటువంటి ఇతరత్రా ఆస్తులు అంటే మనము ఎక్కడైనా ల్యాండ్ తీసుకుని ఉన్న లేదా వ్యవసాయ భూమి, బంజరు భూమిని కానీ మనం కలిగి ఉన్నా వాటి ఆధారంగా కూడా బ్యాంకులు మన యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేసి మనకు లోన్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తుంది.
ప్రతినెల ఆదాయానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేకపోతే ?
శాలరీ స్లిప్ లేనప్పుడు లేదా ఆదాయ పన్ను రిటర్న్‌లు అనేవి చాలా ఉపయోగకరమైనటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించబడతాయి.
దరఖాస్తు చేసే ఎవరైనా గత మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆదాయపు పన్ను రిటర్న్‌లను బ్యాంకులో అడగవచ్చు. ఒకవేళ ఆదాయ పన్ను రిటర్న్‌లు అందుబాటులో లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించి వారి యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసి వారికి రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితులలో పొందే రుణాలకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.
గతంలో ఏదైనా లోన్ తీసుకొని ఉండి దాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే సిబిల్ స్కోర్ బాగా పెరుగుతుంది. దాని ఆధారంగా మనకి లోన్ లభించే అవకాశం ఉంటుంది .అయితే గతంలో ఎటువంటి లోను తీసుకోకుండా ఉంటే సివిల్ స్కోర్ మైనస్ గా బ్యాంకు వారు పరిగణిస్తారు. అందువల్ల లోన్ దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది.
కస్టమర్లకి హోమ్ లోన్ అందజేసేందుకు బ్యాంకులకు మధ్య గట్టి పోటీ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆదాయ పన్ను ధృవీకరణ పత్రం లేకుండా కూడా రుణాలు మంజూరు చేయగలవు.
ఉదాహరణకి యూట్యూబర్స్ అయినా లేదంటే ఏదైనా టెక్నికల్ గా పని చేస్తూ వారికి ఒక ఆదాయము ప్రతినెలా పొందుతూ ఉంటే అటువంటి వారికి బ్యాంకులో అమౌంట్ జమవుతుంది. కానీ వారికి శాలరీ స్లిప్పులు ఉండవు వారి క్రెడిబిలిటీని చూసి వారి యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని చూసి బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
రైతులకు అలాగే ఎన్నారైలకు కూడా హోమ్ లోన్ లు పొందవచ్చు
బ్యాంకుల కంటే కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేస్తాయి. కొన్ని నిర్దిష్టమైనటువంటి షరతులకు లోబడి శాలరీ స్లిప్పు లేకుండా కూడా బ్యాంకులు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
ఏదేమైనా బ్యాంక్ రుణము తీసుకున్న తర్వాత దాన్ని క్రమం తప్పకుండా చెల్లించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ మనము సరైన సమయానికి EMI కట్టకుండా ఉంటే అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. మనం EMI కట్టే పరిస్థితులు తక్కువగా ఉన్నప్పుడు అంటే మనము సరైనటువంటి సమయానికి EMI కట్టకుండా దానిని రెండు నెలలుగా మూడు నెలలుగా మనం ఆపి ఉన్నట్లయితే బ్యాంకు వారు మన సివిల్ స్కోర్ విషయమై రిపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఎక్కువ రోజులు మనము హౌస్ లోన్ కట్టకుండా ఉంటే మనము కట్టుకున్నటువంటి ఇల్లు, ఆస్తులను వారు వేలం వేసి వారి యొక్క రుణాన్ని వసూలు చేసుకునే హక్కు బ్యాంకు వారికి ఉంటుంది.
గమనిక: హౌస్ లోన్ మంజూరు పూర్తిగా సంబంధిత బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ విధానాలు, దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ చరిత్ర, CIBIL స్కోర్, సమర్పించిన పత్రాలు మరియు ఇతర అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత సంస్థ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించండి.
FAQ (SEO)
Q1. శాలరీ స్లిప్ లేకుండా హౌస్ లోన్ వస్తుందా?
అవును. కొన్ని పరిస్థితుల్లో బ్యాంక్ స్టేట్మెంట్, ITR, GST రికార్డులు, బిజినెస్ ఆదాయ ఆధారాలు వంటి పత్రాలతో హౌస్ లోన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
Q2. ఎంత CIBIL Score ఉంటే హౌస్ లోన్ సులభంగా వస్తుంది?
సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్ ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ప్రతి బ్యాంకు తన స్వంత అర్హత ప్రమాణాలను అనుసరిస్తుంది.
Q3. రైతులకు హౌస్ లోన్ లభిస్తుందా?
అవును. ఆదాయానికి సంబంధించిన సరైన పత్రాలు, భూమి వివరాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా అర్హత ఉంటే రైతులు కూడా హౌస్ లోన్ పొందవచ్చు.
Q4. యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్లకు హౌస్ లోన్ వస్తుందా?
స్థిరమైన ఆదాయం బ్యాంక్ ఖాతాలో కనిపించడం, ITR దాఖలు చేయడం, మంచి క్రెడిట్ చరిత్ర ఉండటం వంటి అంశాలు ఉంటే రుణం పొందే అవకాశాలు పెరుగుతాయి.
