అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2026
భారతదేశంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. దేశంలోని నాలుగు కీలకమైనటువంటి రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుటకు భారత ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆదివారం సాయంత్రం జరిగిన హై-ప్రొఫైల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాం మరియు పుదుచ్చేరిలలో ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్లు నిర్వహించటానికి ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకొని సరైన నాయకున్ని ఎన్నుకోబోతున్నారు.
ఎన్నికల షెడ్యూల్ 2026: ఎప్పుడు? ఎక్కడ?
ఈసారి ఎన్నికలు మరింత కట్టుదిడ్డమైన భద్రత మధ్య జరగనున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తిచేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రణాళికలను సిద్ధం చేసింది.
రాష్ట్రాల వారీగా పోలింగ్ తేదీలు:
| రాష్ట్రం/యూటీ | మొత్తం సీట్లు | పోలింగ్ తేదీ | ఫేజ్ (దశలు) |
| కేరళ | 140 | ఏప్రిల్ 9 | సింగిల్ ఫేజ్ |
| అస్సాం | 126 | ఏప్రిల్ 9 | సింగిల్ ఫేజ్ |
| పుదుచ్చేరి | 30 | ఏప్రిల్ 9 | సింగిల్ ఫేజ్ |
| తమిళనాడు | 234 | ఏప్రిల్ 23 | సింగిల్ ఫేజ్ |
| పశ్చిమ బెంగాల్ | 294 | ఏప్రిల్ 23 & 29 | రెండు దశలు |
ఈసారి జరగబోయే ఎన్నికల్లో కేవలం అధికార మార్పిడి కోసమే కాకుండా, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి, అలాగే జాతీయ పార్టీలు మరింత బలాన్ని నిరూపించుకోవడానికి ఒక కీలకమైనటువంటి అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు
పశ్చిమ బెంగాల్: దీదీ వర్సెస్ మోదీ?
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నికల పోరు ఎప్పుడు చాలా రసవత్తరంగా ఉంటుంది.
గత ఫలితాలు (2021): మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) 213 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుత పరిస్థితి: బెంగాల్లో శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారగా, ‘బెంగాల్ కూతురు’ ఇమేజ్‌తో దీదీ ముందడుగు వేస్తున్నారు. ఈసారి ఎన్నికలు రెండు దశల్లో (ఏప్రిల్ 23న 152 సీట్లు, ఏప్రిల్ 29న 142 సీట్లు) జరగనున్నాయి.
తమిళనాడు: స్టాలిన్ హవా కొనసాగుతుందా?
దక్షిణాదిలో అత్యంత కీలకమైన రాష్ట్రం తమిళనాడు. 234 సీట్లకు గాను ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
గత ఫలితాలు (2021): ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే (DMK) కూటమి 159 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. AIADMK-BJP కూటమి 75 సీట్లకు పరిమితమైంది.
సవాల్: ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని బీజేపీ ఆశిస్తోంది.
కేరళ: ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా?
కేరళలో సంప్రదాయబద్ధంగా ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుంది (LDF మరియు UDF మధ్య). కానీ 2021లో పినరయి విజయన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు.
గత ఫలితాలు (2021): ఎల్డీఎఫ్ 99 సీట్లు గెలిచి వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకుంది.
నేటి పరిస్థితి: ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని కూటమి మూడోసారి గెలవాలని చూస్తుండగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.
అస్సాం: ఈశాన్య కోటలో బీజేపీ వ్యూహం
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత పటిష్టమైన ఆధారం అస్సాం.
గత ఫలితాలు (2021): బీజేపీ కూటమి 75 స్థానాలతో (బీజేపీ సొంతంగా 60) అధికారాన్ని నిలబెట్టుకుంది. హేమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుత పరిస్థితి: ఎన్ఆర్సి (NRC), నిరుద్యోగం వంటి అంశాలు చర్చకు వస్తున్నా, అభివృద్ధి మంత్రంతో ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఈసారి మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి ఓటర్ల సంఖ్య దాదాపుగా 17.4 కోట్లు ఉన్నాయి. అయితే వీరిలో ఈసారి ఇవీరిలో యువ ఓటర్ల శాతం అధికంగా ఉండడం గమనార్ధం.ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ బూత్‌లపై నిఘా ఉంచబోతుంది.
ఏది ఏమైనా ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా కీలకమని చెప్పాలి. ఒక్కొక్క రాష్ట్రానికి అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నాయి. ఒకపక్క నాయకులు ప్రజల మీద వాగ్దానాలు కురిపిస్తుంటే, పోటాపోటీగా ప్రతిపక్ష పార్టీలు మరిన్ని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అయితే సామాన్య ప్రజలకు ఎంతవరకు అవి మేలు చేకూర్చుతాయి అని వేచి చూడాల్సిన సమయం. ఇచ్చిన వాగ్దానాలు కొన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో నెరవేరుస్తుంటే, మరికొన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన వాగ్దానాలలో కొన్నిటిని మాత్రమే మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు తమ అధికారాన్ని అనుభవించి చివరి సంవత్సరంలో మాత్రమే మిగిలిన వాగ్దానాలు నెరవేర్చటానికి ఆలోచిస్తున్నాయి. మొత్తానికి సామాన్యం ప్రజలు ఈ రాజకీయ నాయకుల మధ్య కీలు బొమ్మలుగా మారారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిటమైనటువంటి భద్రత కల్పించిన అనేక నియోజకవర్గాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం, డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తుంది . పోలీసులు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా చాప కింద నీరుల మద్యం ఏరులై పారులు పారుతూ ఉంటుంది. ఒకపక్క నాయకులేమో ఎలా గెలవాలి అని ప్రణాళికలు రచిస్తుంటే, మరోపక్క సాధారణ ప్రజలు ఏ పార్టీ ఎంత డబ్బులు ఇస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నారు అని అనడంలో సందేహం లేదు. నోటు కొట్టు ఓటు పట్టు అని నినాదం ఇప్పటినుంచి కాదు ఎన్నో తరాల నుంచి జరుగుతూనే ఉంది. డబ్బు తీసుకొని ఓటు వేయడం నేరమని తెలిసిన సామాన్య ప్రజలు ఆర్థిక పరిస్థితులు వారిని లొంగదీస్తూ ఉన్నాయి. డబ్బు ఇచ్చి ఓటు కొనడం నేరమని తెలిసిన రాజకీయ పార్టీలు తమ అధికార దాహంతో ప్రజలని మభ్యపెడుతూ ఉన్నాయి . ఈ పరిస్థితులు మారి స్వచ్ఛందంగా ప్రజలకు మేలు చేయగలిగే నాయకులు రావాలని ఆశిద్దాం. అలాగే నిస్వార్ధంగా తమ భవిష్యత్తును మార్చగలిగే నాయకులను మాత్రమే ఎన్నుకునే చైతన్యం మన దేశ ప్రజలలో రావాలని కోరుకుందాం.
గమనిక (Disclaimer):
గమనిక: పైన పేర్కొన్న సమాచారం వివిధ వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న కథనాల ఆధారంగా రూపొందించబడింది. ఈ ఆర్టికల్‌లోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఎన్నికల షెడ్యూల్, తేదీలు లేదా ఇతర సాంకేతిక వివరాలకు సంబంధించి ఏదైనా తుది సమాచారం కోసం ఎల్లప్పుడూ భారత ఎన్నికల సంఘం (Election Commission of India) అధికారిక వెబ్సైట్ లేదా ప్రకటనలను అనుసరించాల్సిందిగా మనవి. సమాచారంలో ఏవైనా పొరపాట్లు లేదా మార్పులు ఉంటే దానికి ఈ వెబ్సైట్ బాధ్యత వహించదు.
మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
