అన్నదాతలకు గుడ్ న్యూస్! పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలయ్యాయి.
గత కొన్ని విడుదలగా పీఎం కిసాన్(PM Kisan) లబ్ధిదారుల యొక్క సంఖ్యను పరిశీలిస్తే ప్రభుత్వం అనర్హులను ఏరివేసే ప్రక్రియను మరింతగా కఠినంగా అమలు చేస్తోందని అనిపిస్తుంది. గత నవంబర్ నెలలో విడుదలైనటువంటి 21వ విడతతో పోలిస్తే ఈసారి సుమారుగా 3.8 లక్షల మంది రైతులు అర్హతలు యొక్క జాబితా నుండి తగ్గిపోయారు. 2024 చివరలో 0 కోట్లకు పైగా ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు 9.32 కోట్లకు పడిపోవడం గమనార్హం.
PM Kisan లబ్ధిదారుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు
ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం “అర్హులైన మరియు పేద రైతులకు” మాత్రమే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని కీలక మార్పులే ఈ సంఖ్య తగ్గడానికి కారణం.
తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య: గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గత కొన్ని విడతలుగా పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే, ప్రభుత్వం అనర్హులను ఏరివేసే ప్రక్రియను ఎంత కఠినంగా అమలు చేస్తోందో అర్థమవుతుంది.
| కాలం (విడత) | లబ్ధిదారుల సంఖ్య |
| 2024–25 (ఆగస్టు–నవంబర్) | 9,59,28,628 |
| 2024–25 (డిసెంబర్–మార్చి) | 10,06,85,615 |
| 2025–26 (ఏప్రిల్–జూలై) | 9,71,41,402 |
| 2025–26 (నవంబర్ 19 – 21వ విడత) | 9,35,79,869 |
| 2026 (మార్చి 14 – 22వ విడత) | 9,32,00,000 (సుమారు) |
భూమి రికార్డుల ధృవీకరణ (Land Seeding)
చాలామంది రైతుల పేరు మీద సాగు భూమి ఉన్నప్పటికీ, అది రెవెన్యూ రికార్డులలో లింక్ అయ్యి లేకపోవడం వలన మరియు డేటా బేస్ లో ల్యాండ్ సీడింగ్ NO అని ఉండటం వల్ల ఈ విడతలో వీరికి డబ్బులు అందే అవకాశాలు లేవు.
ఇ-కేవైసీ (e-KYC) పెండింగ్
ప్రభుత్వం ప్రతి రైతుకు ఇ-కేవైసీ (e-KYC) తప్పనిసరి చేసింది. అయితే ఆధార్ ఆధారిత ధ్రువీకరణ పూర్తి చేయని వారిని తాత్కాలికంగా ఈ జాబితా నుండి తొలగించారని తెలుస్తుంది.
అనర్హుల ఏరివేత (Exclusion Criteria)
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ క్రింద చెప్పబడిన వారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు: మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
ప్రభుత్వ ఉద్యోగులు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (గ్రూప్-డి మినహా).
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు: గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు.
పెన్షనర్లు: నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు.
వృత్తి నిపుణులు: డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు.
కుటుంబ నియమం (One Family – One Benefit)
ఒక రేషన్ కార్డులో భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు వారిద్దరికీ ప్రభుత్వ సాయం అందుతున్నట్లయితే వారిలో ఒకరికి ఈసారి డబ్బులు అందకపోవచ్చు. అలాగే 2019 ఫిబ్రవరి 1 తరువాత ఎవరైతే భూమిని కొనుగోలు చేసి ఉంటారో అటువంటి వ్యక్తుల విషయంలో కూడా కఠినమైనటువంటి ల్యాండ్ సర్వే, ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది.
మీ డబ్బులు వచ్చాయా లేదా? ఇలా చెక్ చేసుకోండి (Status Check)
రైతులు తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి కింద పేర్కొన్న పద్ధతులను అనుసరించవచ్చు:
అధికారిక వెబ్సైట్: pmkisan.gov.in సందర్శించండి.
Know Your Status: హోమ్ పేజీలో ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
వివరాలు నమోదు చేయండి: మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
OTP వెరిఫికేషన్: మీ ఫోన్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేస్తే, మీ పూర్తి పేమెంట్ హిస్టరీ కనిపిస్తుంది.
ఇక్కడ మీరు మూడు విషయాలను ముఖ్యంగా గమనించాలి:
e-KYC Status: ‘Yes’ అని ఉండాలి.
Land Seeding: ‘Yes’ అని ఉండాలి.
Aadhaar Bank Account Seeding Status: ‘Yes’ అని ఉండాలి.
ఇంటి నుంచే ఫేస్ ఆథెంటికేషన్ (Face Authentication) ద్వారా ఇ-కేవైసీ
ఒకవేళ మీ ఇ-కేవైసీ పూర్తి కాకపోతే, ఇప్పుడు మీరు మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తగా “PM-Kisan Mobile App” లో ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ముందుగా ప్లేస్టోర్ నుండి PM-Kisan యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
అందులో మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
‘e-KYC’ సెక్షన్లోకి వెళ్లి, కెమెరా ముందు మీ ముఖాన్ని స్కాన్ చేయండి.
ఓటిపి లేదా వేలిముద్రలు అవసరం లేకుండానే క్షణాల్లో మీ కేవైసీ పూర్తవుతుంది.
ఒకవేళ అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
మీకు అర్హత ఉండి, పైన చెప్పిన మూడు (e-KYC, Land Seeding, Aadhaar Link) సరిగ్గా ఉన్నా డబ్బులు రాకపోతే, మీరు కింది మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు:
హెల్ప్ లైన్ నంబర్: 155261 లేదా 011-24300606 (టోల్ ఫ్రీ).
ఈమెయిల్: pmkisan-ict@gov.in కు మీ ఫిర్యాదును పంపవచ్చు.
కిసాన్ ఈ-మిత్ర: వెబ్సైట్లో ఉన్న AI చాట్‌బాట్ ద్వారా మీ సమస్యను వివరించవచ్చు.
పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6000 రూపాయలు (ఏడాదికి మూడు విడతల్లో) చిన్నా మరియు సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో ఆసరాగా నిలుస్తుంది. అయితే పారదర్శకత పెంచే క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంతమందికి ఈ డబ్బులు ఆలస్యం అవుతున్నాయి. అయితే రైతులు ఎప్పటికప్పుడు తమ స్టేటస్లు తనిఖీ చేసుకొని అవసరమైనప్పుడు డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవడం వల్ల అర్హత ఉన్న వారికి డబ్బులు ఆగిపోకుండా నిరంతరంగా వచ్చే వెసులుబాటు ఉంటుంది. ఎవరైతే డబ్బులు రావాలని అనుకుంటున్నారో అర్హత ఉన్నవారు మీయొక్క బ్యాంక్, ఆధార్, ల్యాండ్ యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ రికార్డ్స్ లలో ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తెలుసుకొని ఒకవేళ లేకపోతే వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుంటే డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
