శాంటా క్లాజ్: పుట్టుక, చరిత్ర, మరియు ప్రపంచాన్ని ఏకం చేసిన క్రిస్మస్ మ్యాజిక్ వెనుక అసలు కథ!
క్రిస్టమస్ (Christmas) పండగ అంటే సంబరాలు డెకరేషన్లు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ డెకరేషన్ లో మనము ఏ చర్చికి వెళ్లినా, ఏ షాప్ లో చూసిన, ఎక్కడ క్రిస్టమస్ (Christmas) సెలబ్రేషన్స్ జరిగిన, ప్రతి చోట ఒక ఎర్రనికోటు, నల్లని బూట్లు, తెల్లటి పొడవైన గడ్డం, కలిగినటువంటి ఒక ముసలి తాత మనకు కనిపిస్తాడు ఆయనే శాంటా క్లాజ్ (Santa Claus). క్రిస్టమస్ పండగ వచ్చిందంటే బహుశా ఎవరి ఇంటి డెకరేషన్ లో అయినా, ఏ చర్చి డెకరేషన్ లో అయినా శాంటా క్లాజ్ (Santa Claus) లేకుండా ఆ డెకరేషన్ ఉండదు.
అసలు ఎవరు ఈ శాంటా క్లాజ్ (Santa Claus) ఈయనకు క్రిస్టమస్ (Christmas) పండగకు సంబంధం ఏమిటి?
శాంటా క్లాజ్ (Santa Claus) యొక్క అసలైన పేరు నికోలస్ (నికోలస్ ఆఫ్ బారి లేదా నికోలస్ ఆఫ్ మైరా).
నికోలస్ “శాంటా క్లాజ్ (Santa Claus)” ఒక గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన తన ఆస్తి మొత్తాన్ని పేదలకు, రోగులకు, దిక్కులేని అనాధలకు, అలాగే ఎన్నో చారిటీలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. దాని ద్వారా నికోలస్ కి ఆయన చేసిన దానగుణానికి ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
అయితే ఆయన “శాంటా క్లాజ్ (Santa Claus)” చేసిన సహాయం వల్ల ఒక గొప్ప కథ ప్రసిద్ధి చెందింది. ఏమిటంటే ఒక వ్యక్తి కి ముగ్గురు కుమార్తెలు ఉంటారు. అయితే అతను చాలా పేదవాడు. తన కుమార్తెలకి వివాహం చేసుకోలేక ఎంతో కష్టపడతాడు. ఆ పేద వ్యక్తి చివరకు తన కూతుర్లని పోషించుకోలేక వారిని అమ్మదలుచుకుంటాడు. ఆయన గురించి తెలుసుకున్న శాంటా క్లాజ్ (Santa Claus) ఎవ్వరికీ తెలియకుండా మూడు వేర్వేరు రాత్రుల్లో ఆ ఇంట్లోని పొగ గొట్టం (చిమ్నీ) ద్వారా బంగారు నాణేలను విసిరాడు. ఆ నాణేలు ఆరిపోతున్న నిప్పు పక్కన ఆరబెట్టిన సాక్సుల్లో (మేజోళ్ళలో) పడ్డాయి. ఈ కథే… శాంటా సాక్సుల్లో బహుమతులు పెట్టే సంప్రదాయానికి మొదటి పునాది అయింది.
బిషప్‌గా పదవి: నికోలస్ కాలక్రమేణా మత గురువుగా, తర్వాత మైరా (ప్రస్తుత టర్కీ) నగరానికి బిషప్‌గా మారారు. పేదలకు, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఆయన అందించిన ప్రేమ, రక్షణ కారణంగా, ఆయన “పిల్లల సంరక్షక సెయింట్” (Patron Saint of Children) గా గుర్తింపు పొందారు.
నికోలస్ డిసెంబర్ 6న మరణించారు. అందుకే అనేక యూరోపియన్ దేశాలలో డిసెంబర్ 6న సెయింట్ నికోలస్ డేగా జరుపుకుంటారు, పిల్లలకు బహుమతులు ఇస్తారు.
ప్రపంచం అంతా శాంటా క్లాజ్ (Santa Claus) ను ఎందుకు గుర్తించింది? (World Recognition)
సెయింట్ నికోలస్ యొక్క ఈ కథ, మరియు ఆయన పేరు శతాబ్దాలు గడిచే కొద్దీ ప్రపంచమంతా విస్తరించింది. డచ్ వలసదారులు (Dutch Settlers): డచ్ వలసదారులు తమ సంప్రదాయమైన సింటెర్క్లాస్ (Sinterklaas) (సెయింట్ నికోలస్‌ను డచ్ భాషలో ఇలా అంటారు) ను అమెరికాకు తీసుకువచ్చారు. కాలక్రమేణా ఈ Sinterklaas అనే పదమే ఆంగ్లంలో Santa Clausగా మారింది.
సాహిత్య రచనలు:
1823లో క్లెమెంట్ క్లార్క్ మూర్ (Clement Clarke Moore) అనే రచయిత రాసిన “A Visit from St. Nicholas” (లేదా “’Twas the Night Before Christmas”) అనే కవిత శాంటా క్లాజ్‌కు ఆధునిక రూపాన్ని ఇచ్చింది. ఈ కవితే శాంటా జింకల బండిలో వస్తాడని, పొగ గొట్టం ద్వారా దిగుతాడని, ఎనిమిది జింకలు ఉంటాయని ప్రపంచానికి పరిచయం చేసింది.
ప్రకటనలు (Advertising) & కొకా-కోలా పాత్ర:
1930వ దశకంలో, కళాకారుడు హాడాన్ సండ్బ్లోమ్ (Haddon Sundblom) కోకా-కోలా కంపెనీ ప్రకటనల కోసం శాంటాను చిత్రించారు. సండ్బ్లోమ్ సృష్టించిన ఆనందకరమైన, గుండ్రంగా ఉన్న, ఎరుపు, తెలుపు దుస్తులు ధరించిన శాంటా రూపం… ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, నేటికీ ప్రామాణిక రూపంగా నిలిచిపోయింది.
పండుగ యొక్క సారాంశం:
శాంటా క్లాజ్ (Santa Claus) యొక్క దయ గుణం, ఆయన చేసినటువంటి ఉదారమైన సేవలు, ఆయనను ప్రపంచమంతా గుర్తించేలా చేశాయి. అలాగే ఈరోజు ప్రపంచంలో అత్యంత ఆరాధింపబడే క్రిస్టమస్ పండుగలో ఆయన ఒక భాగంగా మారిపోయాడు. పిల్లలు నిజంగానే ఒక తాత వచ్చి బహుమతులు ఇస్తాడని కథలు చాలా నమ్మి ఎదురుచూస్తూ ఉంటారు. శాంటా క్లాజ్ (Santa Claus) యొక్క పాత్ర ప్రేమకు, దయకు, ఇతరులకు సహాయం చేయటానికి మొదటిగా కనిపించే పాత్రగా క్రిస్టమస్ సంబరాలలో గుర్తింపు పొంది ప్రపంచమంతా విస్తరించి పోయింది. అందుకనే ప్రతి క్రిస్టమస్ (Christmas) డెకరేషన్ లో శాంటా క్లాజ్ (Santa Claus) తప్పకుండా మనకు కనిపిస్తాడు.
