ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్ అందులో స్విమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్ కోర్స్, హెలిపాడ్ ఎక్కడుందో తెలుసా?
మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల కార్లు చూసి ఉంటారు. మీరు చూసిన కార్లు ని ఖరీదైనవి అయి ఉండవచ్చు. లేదంటే ఎక్కువ మంది ప్రయాణించే దానికి వీలుగా అయి ఉండవచ్చు. ఒక కారులో మహా అయితే ఎంతమంది కూర్చుని ప్రయాణించవచ్చు, ఏడు మంది లేదా పదిమంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కారు లో ఎంతమంది ప్రయాణించవచ్చో తెలుసా? అసలు ఈ కారులో ఎన్ని రకాల అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయో తెలుసా? ఆ కారు యొక్క విశేషాలు ఏమిటో చూద్దామా.
ది అమెరికన్ డ్రీమ్’ (The American Dream)
ఈ కారుని 1986 సంవత్సరంలో జే ఓహ్బర్గ్ (Jay Ohrberg) అనే వ్యక్తి తయారు చేశారు. దీనిని 1976 మోడల్ కాడిలాక్ ఎల్డోరాడో (Cadillac Eldorado) కారు ఆధారంగా ది అమెరికన్ డ్రీమ్’ (The American Dream) అనే కారు రూపుదిద్దుతుంది. అయితే ఈ కారుని ఒక కంపెనీ లేదంటే పేరు మోసిన బ్రాండ్ తయారు చేయలేదు . దీనిని కేవలం ఒక స్క్రాప్ లేదా స్పేర్ పార్ట్లు తీసుకుని మాత్రము తయారు చేశారు. ఈ కారు తయారు చేయటానికి సంవత్సరాల తరబడి విసిగిపోకుండా ఒక కారు ల కాకుండా అది ఒక డ్రీమ్ ప్రాజెక్టుల భావించి జే ఓహ్బర్గ్ (Jay Ohrberg) అనే వ్యక్తి ఈ కారుని తయారు చేశారు. ఈ కారుని తయారు చేసిన తర్వాత దీనిని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యంతో నోరెళ్లపెట్టారు. ఎందుకంటే ఈ కారుకు ఉన్నటువంటి ప్రత్యేకత అటువంటిది.
ఈ కారు దాదాపుగా 100 అడుగుల (సుమారు 30.5 మీటర్లు) కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఇది కేవలం దాని పొడవు వల్లనే కాదు దానిలో ఉన్నటువంటి అద్భుతమైన సౌకర్యాలు వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ కారులో 75 మందికి పైగా కూర్చోవచ్చు. వీఐపీల కోసం రెక్లైనింగ్ సీట్లతో కూడిన ప్రత్యేక సెక్షన్ కూడా ఈ కారులో రూపొందించారు. ఈ కారుకి మొత్తం 26 చక్రాలు అమర్చబడ్డాయి.
మరి ఈ కారు యొక్క లగ్జరీ విషయానికి వస్తే ఈ కారులో ఒకేసారి ఆరుగురు ఉపయోగించగలిగేంత పెద్ద స్విమ్మింగ్ పూల్ మరియు జాకుజీ (Jacuzzi) సౌకర్యం ఇందులో ఉన్నాయి. ఇందులో ఒక మినీ గోల్ఫ్ కోర్స్ కూడా తయారు చేశారు. అలాగే ఈ కారులో ఒక హెలికాప్టర్ దిగటానికి వీలుగా ప్రత్యేకమైన ఏర్పాటు కూడా అంటే హెలిపాడ్ కూడా నిర్మించి పెట్టారు. అయితే ఇంత పొడవైన కారు మలుపు ఎలా తిరుగుతుంది అనే సందేహం చాలా మందికి వచ్చింది. అయితే మలుపు తిరిగేటప్పుడు దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. అది ఏమిటంటే కారు మధ్యలో ఒక హింజ్ (Hinge) అమరచబడి ఉంటుంది. దీనివల్ల ఈ కారు రెండు భాగాలుగా తయారు చేయబడడంతో ఈ కారు హింజ్ (Hinge) సహాయంతో మూలల వద్ద సులభంగా తిరగటానికి వీలు అవుతుంది.
ది అమెరికన్ డ్రీమ్’ (The American Dream) కారు ఎక్కడ ఉంది
ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. అయితే ఈ కారుని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఒర్లాండో డెజర్ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియం (Dezerland Park Car Museum, Orlando, Florida)లో ఉంది. ప్రస్తుతం ఈ కారు 2002లో పూర్తిగా మరమ్మతులు ఆటో మ్యూజియంలో భద్రపరిచారు.
