ఇంట్లోనే సహజ పదార్థాలతో 7 రోజుల్లో గ్లాస్ స్కిన్ పొందే సింపుల్ గైడ్.
చర్మం అద్దంలా మెరిసిపోతూ, చాలా మృదువుగా, లోపల నుంచి ప్రకాశవంతంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. దీనినే గ్లాస్ స్కిన్ (Glass Skin) అని అంటారు. ఇది కొరియా దేశం నుండి వచ్చిన ఒక కొత్త ట్రెండ్. అక్కడ మహిళలు అలాగే పురుషులు ఖరీదైన మందులు, చికిత్సల మీద ఆధారపడకుండా కొరియన్ స్కిన్‌కేర్ రొటీన్ (Korean Skincare Routine) ద్వారా ఈ విధమైన మెరుపును సాధిస్తారు. అయితే ఇప్పుడు మనం 7 రోజులలో సరళమైనటువంటి పద్ధతుల ద్వారా ఈ కొరియన్ స్కిన్ ఎలా పొందుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Day 1:డబుల్ క్లెన్సింగ్ మ్యాజిక్ (Double Cleansing Method)
గ్లాస్ స్కిన్ అంటే అర్థం లాగా మన చర్మ సౌందర్యం మెరవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని చర్మాన్ని లోతుగా క్లీన్ చేయడం. రోజంతా చర్మంలో పేరుకుపోయిన జిడ్డు,మురికిని తొలగించడానికి కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో రెండు మూడు నిమిషాలు బాగా మర్దన చేయాలి. దీనిని ఆయిల్ బేస్డ్ క్లెన్సింగ్ (Oil-Based Cleansing) అంటారు.దాని తర్వాత సాధారణమైన ఎక్కువ కెమికల్స్ లేకుండా ఉండే ఫేస్ వాష్ (Face Wash) లు లేదా సున్నిపిండితో ముఖాన్ని కడగాలి ఈ విధంగా చేయడం ద్వారా చర్మ రంధ్రాలు శుభ్రమై ఆక్టివ్ అవుతాయి తర్వాత మనం చేసే హోమ్ రెమెడీస్ చర్మంలోకి సులభంగా ఇంకుతాయి.
Day 2:సున్నితమైన ఎక్స్ఫోలియేషన్ (Exfoliation / Face Scrub)
మన ముఖంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ (Dead Skin Cells) ని తొలగించకపోతే చర్మం మసకబారి కాంతిహీనంగా కనిపిస్తుంది. కొరియన్ సౌందర్య చిట్కాలలో బియ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక స్పూన్ బియ్యం పిండిలో కొద్దిగా పాలు లేదా తేనె కలిపి ఇంట్లోనా రైస్ స్క్రబ్ తయారు చేయండి. దీనితో ముఖంపై రెండు లేదా మూడు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి తర్వాత చల్లని నీటితో కడగండి. ఇది చర్మం పొడిబారకుండా డెడ్ స్కిన్ సేల్స్ ని సున్నితంగా తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
Day 3:రైస్ వాటర్ టోనర్ (Rice Water Toner for Face)
కొరియన్ల యొక్క కాంతివంతమైన చర్మానికి అసలు కారణం రైస్ వాటర్. బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టిన తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక బాటిల్లో నిలువ చేసుకోవాలి. దూది సాయంతో ఈ నీటిని ముఖానికి రాసుకోవడం వల్ల ఇది ఒక బెస్ట్ నేచురల్ టోనర్ (Natural Toner) లాగా పనిచేస్తుంది. బియ్యపు నీటిలోని పోషకాలు చర్మ రంధ్రాలను టైట్ చేసి, స్కిన్ బ్రైట్నింగ్ (Skin Brightening) కి మరియు సహజ నిగారింపుకు ఉపయోగపడతాయి.
Day 4:డీప్ హైడ్రేషన్ ఫేస్ ప్యాక్ (Deep Hydration Mask)
గ్లాస్ స్కిన్ లుక్ రావాలంటే మన చర్మం లో తేమ పుష్కలంగా ఉండాలి. తాజా కలబంద గుజ్జు (Aloe Vera Gel) ను తీసుకొని అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేయండి. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి స్కిన్ హైడ్రేషన్ (Skin Hydration) స్థాయిని పెంచుతుంది. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగితే చర్మం తాజాదనంతో నిగారింపు తో మెరుస్తూ ఉంటుంది.
Day 5:ఐస్ వాటర్ ఫేషియల్ (Ice Water Facial)
రక్తప్రసరణ మెరుగుపడితేనే ముఖానికి సహజసిద్ధమైన పింకిష్ గ్లో వస్తుంది. అందుకోసం ఒక వెడల్పాటి గిన్నెలో చల్లటి నీరు ఐస్ ముక్కలు వేసి ముఖాన్ని కొన్ని సెకన్ల పాటు అందులో ఉంచండి.ఈ ఐస్ వాటర్ మసాజ్ (Ice Water Facial) చర్మ రంధ్రాలను కుదించి ముఖంపై వచ్చే వాపును తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని తక్షణమే టైట్ చేసి ఫేషియల్ గ్లోను ఇస్తుంది.
Day 6:గ్లో బూస్టర్ ప్యాక్ (Glow Booster Face Pack)
చర్మానికి పోషణ అందించి కాంతిని రెట్టింపు చేసే సమయమిది. ఒక స్పూన్ పచ్చిపాలు, చిటికెడు కస్తూరి పసుపు, ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. తేనె చర్మం లో తేమను లాక్ చేస్తుంది. అలాగే పచ్చిపాలు చర్మానికి న్యాచురల్ నివారింపును ఇస్తుంది ఒక 15 నిమిషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ని కడిగేస్తే చర్మం పైన స్పష్టమైన మార్పు కనిపించే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
Day 7:నరిష్మెంట్ & లాకింగ్ (Moisturizer & Sunscreen)
గత ఆరు రోజులుగా మన చర్మానికి అందించిన పోషణను చర్మంలో భద్రపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశం. గ్లాస్ స్కిన్ కల నెరవేరాలంటే రోజు సన్‌స్క్రీన్ (Sunscreen)వాడడం చాలా ముఖ్యం. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ (Sunscreen)ను ఎండలోకి వెళ్లడానికి ముందు ప్రతిరోజు రాయడం మర్చిపోకండి. మేఘాలు ఉన్నా కూడా కచ్చితంగా రోజు వాడండి. ఎండ ద్వారా వచ్చే నల్ల మచ్చలు ముడతలు చర్మాన్ని నిస్తేజం చేస్తుంది. వీటన్నింటినీ సన్‌స్క్రీన్ (Sunscreen) ద్వారా మనం నియంత్రించవచ్చు. అలాగే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర చాలా ముఖ్యమైనది. నిద్ర వల్ల మన చర్మం తనను తానుగా రియాక్టివేట్ చేసుకుంటుంది. ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ ఏడు రోజుల ఛాలెంజ్‌లో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి.
గ్లాస్ స్కిన్ ఫలితం ఒక్క రోజులో వచ్చేది కాదు ఈ పద్ధతులను క్రమం తప్పకుండా నెలలో కనీసం రెండుసార్లు పాటిస్తే వారి యొక్క శరీర స్వభావాన్ని బట్టి స్వభావాన్ని బట్టి మంచి ఫలితాలు ఆశించవచ్చు ముఖ్యంగా మన స్కిన్ గ్లాస్ లాగా మెరవాలంటే ఓపిక చాల అవసరం
గమనిక (Note):
ఇక్కడ పేర్కొన్న చిట్కాలన్నీ సహజ సిద్ధమైన పదార్థాలతో కూడిన గృహ నివారణలు మాత్రమే. ప్రతి ఒక్కరి చర్మ తత్వం ఒకేలా ఉండదు కాబట్టి, ఏదైనా కొత్త పదార్థాన్ని లేదా ఫేస్ ప్యాక్‌ను ముఖానికి వేసుకునే ముందు చేతిపై లేదా మెడ భాగంలో ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేసుకోవడం మంచిది. ఒకవేళ మీకు చర్మ సంబంధిత అలర్జీలు, తీవ్రమైన మొటిమలు లేదా సున్నితమైన చర్మ సమస్యలు ఉంటే నిపుణులైన చర్మ వైద్యులను (Dermatologist) సంప్రదించిన తర్వాతే వీటిని ప్రయత్నించండి.










