పోషకాలు ఎంత ఉన్నాయన్నది కాదు… శరీరం ఎంత గ్రహించిందన్నదే అసలు ఆరోగ్యం రహస్యం!
మనం పోషక ఆహారం తీసుకోవాలని ఎందుకు అనుకుంటాం? ఆరోగ్యంగా ఉండడానికి. ఎముకల బలం కోసం, రక్తంలో ఐరన్ లోపించినప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే మనం కొన్ని కొన్ని సోషల్ మీడియాలలో పాలకంటే వేరే ఆహార పదార్థాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పినప్పుడు అది విని మనము పాలు త్రాగడం కంటే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల నాకు కాల్షియం ఎక్కువగా అందుతుంది అని అనుకొని వాటిని ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. కానీ అవి మన శరీరానికి అంతస్థాయిలో అందినట్టుగా మనకు అనిపించదు . అసలు దీనికి గల కారణం ఏమిటి అని మీకు తెలుసా దానినే ‘బయో అవైలబిలిటీ’ (Bioavailability) అంటాము.
ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుమంత్ పసునూటి సోషల్ మీడియా వేదికగా ఈ ఆసక్తికరమైన అంశాన్ని వివరించారు. మనం తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి ఎంత మేర అందుతున్నాయో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బయో అవైలబిలిటీ (Bioavailability) అంటే ఏమిటి?
అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం తిన్న ఆహారం లో ఉన్నటువంటి పోషకాలు అంటే విటమిన్ లైన, ఖనిజాలైనా, లవణాలైనా, మన జీర్ణ వ్యవస్థ ద్వారా రక్తంలోకి ఎంత శాతం చేరుతాయి అని అనే విషయం మనము తెలుసుకోవాలి. దీనినే వైద్య పరిభాషలో ‘బయో అవైలబిలిటీ’ (Bioavailability) అంటాము.
క్యాల్షియం అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఒకటే పాలు. అయితే పాలలో ఉండే దానికంటే నువ్వులు, తోటకూర, మునగాకు, కరివేపాకు, అంటూ వాటిలో క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుందనే వాదన మనము తరచుగా వింటూ ఉంటాం . ఇది నిజమేనా అంటే చాలామంది చెప్పేది నిజమని అంటారు. కానీ వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి అందే విధానంలో ఉన్నటువంటి తేడాలోనే అసలైన విషయం దాగింది.
మనం గమనిస్తే పాలకంటే కరివేపాకు లోనే నాలుగు రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. అయినప్పటికీ డాక్టరు క్యాల్షియం కోసం పాలు తాగుమని మాత్రమే చెప్తారు. కరివేపాకు ని ప్రాథమికమైన కొలమానంగా వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే? అక్కడే బయో అవైలబిలిటీ’ పాత్ర మొదలవుతుంది.
డాక్టర్ సుమంత్ పసునూటి వివరణ ప్రకారం బయో అవైలబిలిటీ (Bioavailability) అంటే?
పాలలోని క్యాల్షియంను మన శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది . కరివేపాకులో క్యాల్షియం ఎక్కువగా ఉన్నప్పటికీ అందులో ఉండే ఇతర ఫైబర్ లేదా కొన్ని రకాల యాంటీన్యూట్రీషియన్స్ వల్ల ఆ క్యాల్షియం శరీరానికి పూర్తిగా అందదు. అందుకే కేవలం పదార్థాల జాబితాలో మాత్రమే కాకుండా శరీరం గ్రహించే శక్తిని బట్టి ఆహారాన్ని ఎంచుకోవాలని డాక్టర్ సుమంత్ సూచిస్తున్నారు.
పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న కూడా వాటిలోని పోషకాలన్నీ మన శరీరానికి అందకుండా చేసేటటువంటి కొన్ని రకాల అడ్డంకులు ఉంటాయి. అవి ఏంటంటే యాంటీ-న్యూట్రియంట్స్ (Anti-nutrients) ఆకుకూరల్లో ఆక్సలేట్లు (Oxalates), ధాన్యాల్లో ఫైటేట్లు (Phytates) ఉంటాయి. ఇవి కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలతో ఐరన్ వంటి ఖనిజాలతో కలిసి పోతాయి. అందువలన శరీరం వాటిని గ్రహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాగే మనం వండే విధానంలో కూడా తేడా ఉంటుంది ఎందుకంటే కొన్ని రకాల కూరగాయల్ని ఉడికించడం వల్ల వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. మరికొన్నింటిని పచ్చిగా తింటేనే ఎక్కువగా మేలు దొరుకుతుంది. కానీ ఉండే విధానంలో చాలామంది సరేనా పద్ధతులు పాటించకపోవడం వలన అ పోషకాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. అలాగే ఐరన్ కలిగి ఉన్నటువంటి ఆహారం తీసుకునే సమయంలో వాటితో పాటు విటమిన్ సి కలిగి ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ మన శరీరానికి బాగా అందుతుంది. ఒకవేళ అదే ఐరన్ ఉన్న ఆహారంతో పాటు టీ లేదా కాఫీ తాగితే అందులోని టానిన్లు మన శరీరానికి ఐరన్ పూర్తిగా అందకుండా అడ్డుకుంటాయి.
మనం తినే మునగాకు తోటకూర వృధా అయినట్టేనా?
వృధా అయినట్టు కాదు. ఎందుకంటే తోటకూర, కరివేపాకు లలో కాల్షియం మాత్రమే కాదు ఫైబర్, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటా.యి అయితే వీటిని కేవలం క్యాల్షియం కోసం మాత్రమే తీసుకోవడం కంటే పాలతో పాటు ఇవి కూడా ఆహారంగా తీసుకుంటే మంచిదని కొంతమంది వైద్యుల యొక్క అభిప్రాయం .
అసలు మన ఎముకల బలం కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
మన రోజువారి జీవితంలో రోజు ఒక గ్లాసు పాలు లేదా పెరుగు మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియము సులభంగా అందుతుంది. అలాగే ఆకుకూరలను కాసేపు నానబెట్టడం లేదా ఉడికించడం వల్ల వాటిలోని అడ్డంకులు తొలగిపోయి అవి మన జీర్ణ వ్యవస్థలో త్వరగా వాటిల్లో ఉండే పోషకాలు మనకు అందేలా చేస్తాయి. అలాగే ఎముకల బలానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు దానికి తోడుగా దానిని శరీరం గ్రహించాలంటే విటమిన్ డి కూడా అవసరం కాబట్టి విటమిన్ డి మన శరీరానికి అందే విధంగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఏ ఆహారంలో ఎంత శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయో తెలుసుకుందాం.
| ఆహార పదార్థం | కాల్షియం పరిమాణం (సుమారు mg) | శరీరానికి అందే శాతం (Bioavailability) | ముఖ్య గమనిక |
| కరివేపాకు | 830 mg | తక్కువ (సుమారు 5-10%) | ఇందులో కాల్షియం అత్యధికం, కానీ శరీరం త్వరగా గ్రహించదు. |
| నువ్వులు | 975 mg | మధ్యస్థం | పీచు పదార్థం వల్ల శోషణ తక్కువగా ఉంటుంది. |
| రాగులు | 344 mg | మధ్యస్థం | శాకాహారులకు ఇది అద్భుతమైన ఎముకల బలాన్ని ఇచ్చే ఆహారం. |
| తోటకూర | 250 – 300 mg | తక్కువ | ఇందులో ఆక్సలేట్లు ఉండటం వల్ల కాల్షియం శోషణ తక్కువ. |
| మునగాకు | 440 mg | మధ్యస్థం | కాల్షియంతో పాటు విటమిన్-సి కూడా ఉంటుంది. |
| గేదె పాలు | 195 – 210 mg | అత్యధికం (30-35%) | తక్కువ మొత్తంలో ఉన్నా శరీరం చాలా వేగంగా గ్రహిస్తుంది. |
| పెరుగు | 120 – 150 mg | అత్యధికం | జీర్ణక్రియకు మంచిది, కాల్షియం బాగా అందుతుంది. |
| బాదం | 260 mg | మధ్యస్థం | రోజూ నానబెట్టి తింటే శోషణ పెరుగుతుంది. |
| పనీర్ | 480 mg | అధికం | పాల పదార్థం కాబట్టి ప్రోటీన్ తో పాటు కాల్షియం లభిస్తుంది. |
| చేపలు (సార్డైన్స్) | 380 mg | అధికం | వీటిలోని ఎముకలతో సహా తింటే కాల్షియం పుష్కలం. |
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తింటున్నాము అనేదే ముఖ్యమైన విషయం కాదు ఎందుకంటే అది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడం కూడా ముఖ్యమే.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం సోషల్ మీడియాలో నిపుణులు వెల్లడించిన వివరాల ఆధారంగా రూపొందించబడింది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డైట్ ప్లాన్ కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
