నిద్ర మరియు బరువు తగ్గడం (Sleep and Weight Loss)
ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవన శైలిలో అనేకమంది ఆలోచిస్తున్న ఒక సమస్య బరువు తగ్గడం ఎలా ? బరువు తగ్గడానికి కావలసినటువంటి ప్రతి డైట్ ఫాలో అవుతారు. ప్రతి వీడియో చూస్తారు, ప్రతి చిట్కా పాటిస్తారు, జిమ్ముకు వెళ్తారు కఠినమైనటువంటి డైటింగ్ పాటిస్తారు, డిటాక్స్ డ్రింకులని తాగేస్తూ ఉంటారు, కానీ బరువు మాత్రం తగ్గడం లేదని తెగ బాధపడిపోతుంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా రాత్రిపూట 11 గంటల తర్వాత కూడా మేల్కొని ఉండడం. అసలు రాత్రిపూట మన శరీరంలో ఏం జరుగుతుంది 11 గంటల తర్వాత కూడా మనం మేల్కొని ఉంటే మన హార్మోన్లు ఏ విధంగా మారుతాయి. అసలు నిద్రకి బరువుకి సంబంధం ఏమిటి ? పూర్తి సమాచారం తెలుసుకుందామా?
మన శరీరము దైనందిక జీవితంలో అలవాటు పడి, ఒక సమయాన్ని పాటిస్తూ ఉంటుంది. ఆ సమయాన్ని మనం డిస్టర్బ్ చేస్తే దాని ప్రతికూల ప్రభావాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మన శరీరము ఏ సమయానికి ఏ క్రియ చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
రాత్రి 10:30 తర్వాత శరీరంలో ఏమి జరుగుతుంది?
రాత్రి 10:30 గంటలు దాటిన తర్వాత మన శరీరము సహజంగానే జీర్ణక్రియను మందగించే దశలోకి వెళ్తుంది. సూర్యాస్తమయం తర్వాత మన శరీరంలోని కార్యకలాపాలు సాధారణంగా తగ్గిపోతాయి. కానీ మనం ఆ సమయంలో కూడా మేల్కొని ఉండటం వల్ల శరీరం తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అవుతుంది. ఈ ఒత్తిడి వల్ల మెదడు ‘కార్టిసోల్’ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. సాధారణంగా ఇది పగలు మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, కానీ రాత్రి వేళ దీని ఉనికి ప్రమాదకరం. రక్తంలో కార్టిసోల్ స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం కొవ్వును కరిగించే ప్రక్రియను (Fat Burning) నిలిపివేసి, ఉన్న కొవ్వును భద్రపరచడం (Fat Storage) ప్రారంభిస్తుంది. ఫలితంగా మీరు ఎంత తక్కువ తిన్నా బరువు పెరుగుతూనే ఉంటారు.
11PM–3AM: మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సమయం
మన శరీరము ఒక సమయం నుండి ఒక సమయం వరకు శరీరంలోని కణజాలం మరమ్మత్తులు చేసుకుంటుంది, మరియు వ్యర్థాలను శుద్ధి చేస్తుంది . రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. కాలేయం (Liver) తన డిటాక్సిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఒకవేళ మనం ఈ సమయంలో కూడా నిద్రపోకుండా మేల్కొని ఉంటే, ఈ సహజమైనటువంటి శుద్ధి ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి మెటబాలిక్ రేటు పడిపోతుంది. దీనినే శాస్త్రవేత్తలు ‘మెటబాలిక్ ఖోస్’ (Metabolic Chaos) అని పిలుస్తారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించదు, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఆకలి ప్రభావం వల్ల ఏ మార్పులు వస్తాయి: లెప్టిన్ vs గ్రెలిన్
మనం సరిగ్గా నిద్రపోనప్పుడు మన ఆకలిని నియంత్రించే రెండు ముఖ్యమైన హార్మోన్లు తారుమారవుతాయి. అవి ‘లెప్టిన్’ మరియు ‘గ్రెలిన్’.
లెప్టిన్: ఇది మనకు కడుపు నిండిందనే సంకేతాన్ని ఇస్తుంది. నిద్ర లేకపోతే దీని స్థాయిలు పడిపోతాయి.
గ్రెలిన్: ఇది ఆకలిని ప్రేరేపించే హార్మోన్. నిద్ర తక్కువైతే ఇది విపరీతంగా పెరుగుతుంది.
అందుకే రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారు మరుసటి రోజు విపరీతమైన ఆకలితో ఉంటారు. ముఖ్యంగా వారికి ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారం కంటే జంక్ ఫుడ్, స్వీట్లు మరియు పిండి పదార్థాలు (Carbs) తినాలనే కోరిక (Cravings) ఎక్కువగా కలుగుతుంది. రాత్రి 11 దాటిన తర్వాత మేల్కొని ఉంటే కలిగే ‘మిడ్ నైట్ క్రేవింగ్స్’ బరువు పెరగడానికి అతిపెద్ద కారణం.
మనం తాగే డీటాక్స్ డ్రింకులు ఎందుకు పనిచేయవు.
చాలామంది ఉదయాన్నే నిమ్మరసం తేనే లేదా రకరకాల డీటాక్స్ పానీయాలు తాగుతూ ఉంటారు. అయితే రాత్రి నిద్ర సరిగా లేకపోతే ఇవేమీ సరైనటువంటి ప్రతిఫలం చూపించవు. శరీరంలో జరగవలసినటువంటి సహజమైన క్లీనింగ్ ప్రక్రియ సరిగా జరగనప్పుడు మనం బయట నుండి ఎన్ని రకాల డీటాక్స్ డ్రింకులు తాగిన కేవలం అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం (Bloating), మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా బరువు తగ్గలేడు.
మంచి నిద్ర మరియు బరువు తగ్గాలని కోరుకునే వారి కోసం నిపుణుల సూచనలు
ఎవరైతే బరువు తగ్గాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారో వారు తమ జీవనశైలిలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.
11 గంటల డెడ్ లైన్: రాత్రి 11 గంటల లోపు ఖచ్చితంగా గాఢ నిద్రలోకి వెళ్ళాలి. దీనివల్ల శరీరం తన రిపేర్ పనులను సజావుగా చేసుకోగలుగుతుంది.
డిజిటల్ డిటాక్స్: నిద్రపోయే కనీసం ఒక గంట ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు పక్కన పెట్టాలి. వీటి నుండి వచ్చే ‘బ్లూ లైట్’ మెలటోనిన్ (Melatonin) అనే నిద్ర హార్మోన్ విడుదలను అడ్డుకుంటుంది.
ముందస్తు భోజనం: నిద్రపోయే కనీసం 3 గంటల ముందే భోజనం ముగించాలి. దీనివల్ల పడుకునే సమయానికి జీర్ణక్రియ పూర్తయి, శరీరం విశ్రాంతి దశకు చేరుకుంటుంది.
లైటింగ్: గదిలో వెలుతురు తక్కువగా (Dim Lights) ఉండేలా చూసుకోండి. చీకటిగా ఉన్నప్పుడే శరీరం మెలటోనిన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది, ఇది నాణ్యమైన నిద్రకు దోహదపడుతుంది.
క్రమశిక్షణ: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. వీలైతే రోజూ ఒక 15 నిమిషాల ముందు పడుకోవడానికి ప్రయత్నిస్తూ మీ నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించుకోండి.
బరువు తగ్గాలి అనుకోవడం చాలా మంచి విషయం. దానికోసం మనము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల డైట్లు ఫాలో అవుతుంటా, క్రమశిక్షణగా ప్రతిదీ సమయానికి చేస్తూ ఉంటాం, కానీ నిద్ర అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. కాబట్టి మన ప్రయత్నం సఫలం అవ్వాలంటే మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంతో పాటు అంటే ప్రతి డైట్ మన దైనందిక జీవితంలో ఉన్నప్పుడు దానికి నిద్ర అనేది ఒక బూస్టింగ్ గా పనిచేస్తుంది. కాబట్టి సమయానుకూలమైనటువంటి నిద్ర కేవలం ఊబకాయము, బరువు తగ్గడం వంటి సమస్యలనే కాదు మన శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలకి సహజ సిద్ధమైన ఔషధంలా, వైద్యంగా పనిచేస్తుంది. కాబట్టి నిద్రను నిర్లక్ష్యం చేయకుండా సమయానుకూలంగా నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన జీవ క్రియకు నిద్ర ఆటంకం కాకూడదు. కాబట్టి సమయానుకూలంగా నిద్రపోయి చక్కని ఆరోగ్యాన్ని పొందండి.
మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపించిందా? మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి! ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
