ఎండాకాలంలో చర్మ సంరక్షణ
ఎండాకాలం వచ్చిందంటే చాలామందికి మొదట గుర్తుకు వచ్చే సమస్య చర్మం నల్లబడటం, గ్లో తగ్గిపోవడం, సన్‌టాన్. బయటికి వెళ్లినప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే ముఖం డల్‌గా మారిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ సూర్యకాంతి, చెమట, కాలుష్యం కారణంగా చర్మం పై పొర దెబ్బతింటుంది.
చాలామంది ఖరీదైన క్రీమ్స్ వాడినా కూడా ఫలితం కనిపించదు. కారణం ఏమిటంటే సరైన స్కిన్ కేర్ రూటీన్ పాటించకపోవడం. నిజానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎండాకాలంలో కూడా మీ ఫేస్ గ్లోయింగ్, ఫ్రెష్‌గా ఉంటుంది.
ఇప్పుడు ఎండాకాలంలో ఫేస్ గ్లో తగ్గకుండా, చర్మం నల్లబడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుందాం.
ఎండాకాలంలో చర్మానికి కావలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి స్కిన్ కేర్ స్టెప్ ఏమిటంటే సన్ స్క్రీన్. సూర్యరశ్మిలో ఉన్న UV కిరణాలు చర్మానికి చాలా నష్టాన్ని చేస్తాయి. ఇవి చర్మం నల్లగా అవ్వడమే కాకుండా చర్మం ముడతలు పడేవిధంగా చేస్తుంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు SPF 30 లేదా SPF 50 సన్ స్క్రీన్ వాడడం మంచిది . దీనిని ఎలా వాడితే బాగుంటుందంటే? బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు అప్లై చేసుకోవడం మంచిది. ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్ళీ అప్లై చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఇది అప్లై చేసేటప్పుడు ముఖం మాత్రమే కాకుండా మెడ చేతులు వంటి భాగాలను కూడా కవర్ చేస్తే బాగుంటుంది.
Water: రోజుకు కనీసం 3–4 లీటర్లు నీరు తాగాలి
ఎండాకాలంలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏమిటంటే సమస్య డిహైడ్రేషన్. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల మన శరీరంలో ఉన్నటువంటి నీరు చెమట రూపంలో త్వరగా బయటికి వెళ్లిపోతుంది, కాబట్టి మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. దీని ద్వారా మన ముఖము కూడా చాలా డల్ గా కనిపిస్తుంది. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం చాలా మంచిది. నీరు తాగటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శరీరానికి నీరు అందడం వల్ల మన చర్మం కూడా హైడ్రేట్ అవుతుంది. కాబట్టి మన చర్మం న్యాచురల్ గ్లో కోల్పోకుండా ఉంటుంది. అంతేకాకుండా తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్,లు ఎండాకాలంలో ఎక్కువగా దొరికేటటువంటి పుచ్చకాయలు, నిమ్మరసం వంటివి తీసుకోవడం వల్ల మన శరీరము చాలా హైడ్రేట్ గా ఉండి చర్మం న్యాచురల్ గ్లోని కోల్పోకుండా ఉండేలా చేస్తాయి.
ఫేస్ వాష్: రోజుకు రెండు సార్లు తప్పనిసరి
ముఖ్యంగా బయట ప్రయాణించేవారు, లేదంటే ఉద్యోగం కొరకు కచ్చితంగా ఎండలో ప్రయాణం చేసేవారు, ట్రాఫిక్ లో ప్రయాణం చేసేవారు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే? ఎండ వల్ల వచ్చే చెమట, కాలుష్యము దుమ్ము ధూళి మన చర్మ రంధ్రాలలో ముఖ్యంగా, ముఖంలో పేరుకుని పోయి ముఖాన్ని నల్లగా మారుస్తాయి. దీనికోసం సల్ఫేట్ లేని మైల్డ్ ఫేస్ వాష్ తో ఉదయం మరియు పడుకునే ముందు మొహాన్ని శుభ్రపరుచుకోవడం మంచిది. అలాగే ముఖం జిడ్డుగా అనిపిస్తే చల్లటి నీటితో అప్పుడప్పుడు ముఖాన్ని కడుక్కోవడం చాలా ఉత్తమమైన మార్గం.
Natural Remedies:ఇంటి వద్దే చేసుకునే అద్భుతమైన ఫేస్ ప్యాక్స్
ఎండాకాలంలో మన మొక్క సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ తో తయారైనటువంటి ఫేస్ ప్యాక్ ను వాడుతూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా మన ఇంటి వద్దనే న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని వాడడం చాలా మంచిది అవి ఏమిటంటే?
కలబంద (Aloe Vera) – కూలింగ్ ఏజెంట్
కలబంద మన చర్మానికి చల్లదనం ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు తాజా కలబంద యొక్క జెల్‌ను మన ముఖానికి రాసుకొని మసాజ్ చేస్తే సన్ బర్న్ తగ్గే అవకాశం ఉంటుంది.
పెరుగు మరియు శెనగపిండి – ట్యాన్ రిమూవర్
రెండు చెంచాల సెనగపిండిలో కొంచెం పెరుగు, చిటికెడు పసుపు కలిపి మన ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంపై ఉన్నటువంటి నలుపును తొలగించి మన చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది.
టమోటా రసం – నేచురల్ బ్లీచ్
టమాటో లో ఉన్నటువంటి లైకోపిన్ చర్మాన్ని తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. టమాట ముక్కని తీసుకొని ముఖంపై రుద్ది 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఎండాకాలంలో పాటించవలసినటువంటి ఆహార నియమాలు
మన తినే ఆహారం కూడా మన చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. బెర్రీ లు, నారింజలు మరియు ఆకుకూరలు ‘C విటమిన్’ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి చర్మంలోని మృత కణాలను తొలగించి కణాలను రిపేర్ చేస్తాయి. నూనెలో వేయించినటువంటి పదార్థాలు జంక్ ఫుడ్ బాగా తగ్గించడం మంచిది. ఎందుకంటే ఇవి చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చి మొటిమలు వచ్చేందుకు చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది.
మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
క్లాత్ ప్రొటెక్షన్: బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి కాటన్ క్లాత్ కట్టుకోవడం లేదా గొడుగు వాడటం అలవాటు చేసుకోండి.
కళ్ల సంరక్షణ: ఎండ వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండాలంటే మంచి నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించండి.
స్క్రాబ్ చేయకండి: ఎండ నుంచి రాగానే గట్టిగా ముఖాన్ని రుద్దకండి. ఇది చర్మాన్ని మరింత ఇరిటేట్ చేస్తుంది.
ఎండాకాలం వచ్చిందంటే చాలామంది ఎక్కువగా ఆందోళన పడేది ముఖ్యంగా మహిళలు వారి యొక్క చర్మ సౌందర్యం ఎక్కడ తగ్గిపోతుందో,మొహం టాన్ గా మారి నల్లబడుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే పైన చెప్పిన చిట్కాలని క్రమం తప్పకుండా పాటించి, అలాగే ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా సరైన రీతిలో పాటించి, ఎక్కువగా నీరు తీసుకోవడం, అలాగే మజ్జిగ, సి విటమిన్ కలిగినటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటూ శరీరానికి కావలసినటువంటి నీటిని ఎక్కువగా తీసుకోవటం వలన మీ చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎక్కువగా కాంతివంతంగా మారుతుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వండి. చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండండి.
మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
