కృష్ణలంక లాకప్ డెత్ మిస్టరీ: మాయమైన సీసీటీవీ ఫుటేజ్, తెర వెనుక అసలేం జరిగింది?
విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మొదలైనటువంటి ఒక చీకటి కథ నేడు మొత్తం దేశాన్ని కదిలిస్తోంది. 25 సంవత్సరాల సాయి కృష్ణ మే 9 2026 వ తారీఖున పోలీసులు చేతికి చిక్కాడు. తిరిగి ఇంటికి రాలేదు, శవము ఇవ్వలేదు, బూడిదైనా అందించలేదు. అతని తల్లి విజయలక్ష్మి నెల రోజులకు పైగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. నా కొడుకు ఎక్కడ అని ప్రశ్నించింది సమాధానం మాత్రం రాలేదు .ఆ తల్లి పోరాటం చివరకు రాష్ట్రాన్ని కదిలించింది. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ కేసులో CI నాగరాజు అరెస్టు అయ్యాడు. SIT దర్యాప్తు మొదలైంది. హైకోర్టు జోక్యం చేసుకుంది. కానీ న్యాయం ఇంకా పూర్తిగా రాలేదు.
అసలు ఎవరు ఈ సాయి కృష్ణ అసలు ఆయన మీద ఉన్న కేసులు ఏమిటి?
సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందినటువంటి 25 సంవత్సరాల యువకుడు. అతనిపై కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో ఒక POCSO కేసు కూడా ఉంది.అందులో అతను ముద్దాయి. అతను భారీ నేరం చేసినటువంటి గ్యాంగ్స్టర్ కాదు. gig worker గా పని చేసి జీవనోపాధి సంపాదించుకునే సాధారణ యువకుడు. అతనిపై కొన్ని non-bailable warrants పెండింగ్లో ఉన్నాయి. వాటి ఆధారంగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నేరం చేసిన వ్యక్తిని అరెస్టు చేయవచ్చు, కోర్టుకు హాజరుపరచవచ్చు, కానీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపే హక్కు ఏ పోలీస్ కు గాని, వ్యవస్థలకు కానీ లేదు. వ్యవస్థలకు, చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఒక దారుణమైన ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చలోకి తీసుకొని వచ్చింది. రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది.
మే 9 నుండి ఇప్పటివరకు అసలు ఏం జరిగింది
మే 9 2026న పోలీసులు సాయి కృష్ణను మార్కాపురంలో పట్టుకొని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు.SIT తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం ఒక సబ్ ఇన్స్పెక్టర్ మే 6 నుండి మే 8 వరకు సాయి కృష్ణను పోలీస్ స్టేషన్లో చూశాడు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా అతన్ని పోలీస్ స్టేషన్లో చూసింది. అనే విధంగా కూడా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చిన తర్వాత అతన్ని illegal custody లో ఉంచారు. తీవ్రమైన శారీరక హింసకు గురి చేశారు. సాయి కృష్ణ తన ఫోన్ ని CI నాగరాజుకు ఇచ్చినట్లు చెప్తున్నారు. కానీ నాగరాజు ఆ ఫోన్ ని మెజిస్ట్రేట్ దగ్గర డిపాజిట్ చేయలేదు. ఇది ఒక ఇది చట్ట ఉల్లంఘన చర్య.
మే 23 నుండి మే 26 మధ్యకాలంలో సాయి కృష్ణ మరణించినట్లు అనుమానాలు ఉన్నాయి. SIT కృష్ణలంక దహన వాటికలో దహనమైనటువంటి అనాధ శవాలు (unclaimed bodies) వివరాలను సేకరించింది. తల్లి నెల రోజులకు పైగా కొడుకు కోసం వేచి చూసింది.ఎటువంటి సమాచారం రాకపోవడంతో మే 2 తారీఖున ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో Habeas Corpus petition దాఖలు చేసింది. కోర్టు జూన్ 15 లోపు సాయి కృష్ణను హాజరుపరచాలని ఆదేశించింది. పోలీసులు అది చేయలేకపోయారు కాబట్టి హైకోర్టు 29న డెడ్లైన్ ని విధించింది. ఆరోజు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.
నాగరాజు తల్లి విజయలక్ష్మి తను పడ్డ బాధని, అనేక సార్లు తను పోలీస్ స్టేషన్ కు వెళ్లిన, తనకు న్యాయం జరగలేదని, తన కొడుకుని తనకు అప్పగించాలని, తప్పు చేసి ఉంటే శిక్షించొచ్చు కానీ నా కొడుకుని నాకు అప్పగించకుండా, అసలు ఉన్నాడా? చనిపోయాడా? కూడా తెలియని స్థితిలో నేను బ్రతుకుచున్నాను. ఒకవేళ చనిపోయి ఉంటే నా కొడుకు బూడిదనైనా నాకు ఇవ్వండి. అని కంటనీరు పెట్టుకొని ఏడ్చిన విషయం మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దానివల్ల రాష్ట్రంలో ఈ సమస్య ఒక అనాగరిక చర్య లాగా చట్టాన్ని మితిమీరి పోలీసులు వివరించిన చర్య లాగా వ్యవస్థల మీద నమ్మకం లేని స్థితిలోకి తీసుకువెళ్లే ఒక దారుణమైన సంఘటన లాగా ప్రజలు భావించారు.
ఈ సంఘటనల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి, ధైర్యం చెప్పి, తర్వాత మీడియా సమావేశాన్ని పెట్టారు. ఆ సమావేశంలో తన మీద కేసులు ఉన్న మాట వాస్తవమే, కానీ సాయి కృష్ణని శిక్షించాల్సిన బాధ్యత కోర్టులకు ఉంటుంది. కానీ చట్టాలను చేతిలో తీసుకొని పోలీసులు సాయి కృష్ణని శిక్షించడం ఏమిటి? సాయి కృష్ణ ని కోర్టుకు అప్పగించాలి అలాకాకుండా చిత్రహింసలకు గురిచేసి, చంపి, శవాన్ని కూడా మాయం చేసే హక్కు వీరికి ఎవరిచ్చారు. వీరికి సపోర్టుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? అంటూ విమర్శలను గుప్పించాడు. దాని ద్వారా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ప్రభుత్వం సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
జూన్ 17న సీఎం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ IPS అధికారి చేత దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేశాడు. CI నాగరాజును సస్పెండ్ చేశారు. జూన్ 19న CI నాగరాజు నాగరాజుపై సెక్షన్ 103(1) murder, 127(4) మరియు 127(6) wrongful confinement, మరియు 238 evidence destruction కింద కేసు నమోదు చేశారు. జూన్ 22న జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క X ఖాతాలో CM ని నిలదీశారు FIR నమోదయి నాలుగు రోజులైంది. అరెస్టు ఎందుకు జరగలేదు? అని ప్రశ్నించారు. దాని తర్వాత జూన్ 23 వ తారీఖున SIT అధికారులు విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 5 గంటలు నాగరాజును ప్రశ్నించిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. జూన్ 24న SIT కోర్టుకు remand report సమర్పించింది. సాయి కృష్ణ కస్టడీలో మరణించాడని అధికారికంగా ధ్రువీకరించింది. కోర్టు నాగరాజు కు జులై 8 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
CCTV (సీసీటీవీ) మిస్టరీ- ఇది అతి పెద్ద సవాలుగా మారింది.
మే 1 నుండి జూన్ వరకు దాదాపుగా నెలరోజుల ఫుటేజ్ ని పూర్తిగా డిలీట్ చేశారు. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే మిగిలింది. ఈ CCTV ఫుటేజ్(footage) ని కావాలని డిలీట్ చేశారు అని అనుమానిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో CCTV ఫుటేజ్(footage) మాయమై పోవటానికి ఆధారాలు దాచిపెట్టే, లేదా తుడిచి పెట్టే ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారు. కోర్టు కూడా మే 1 నుండి జూన్ 1 వరకు ఫుటేజ్ ని సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించింది. కానీ ఆదేశం వచ్చేలోగానే CCTV ఫుటేజ్(footage) మాయమైపోయింది. ఇది అత్యంత తీవ్రమైనటువంటి విషయం. ఒక కోర్టు ఆదేశాన్ని కూడా లెక్కచేయకుండా ఆధారాలు(evidence) ని మాయం చేశారంటే, ఇది కేవలం CI నాగరాజు ఒక్కడి పని మాత్రమే కాదని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం data recovery experts తో deleted footage retrieve చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. CCTV ఫుటేజ్(footage) వస్తే కేసు మరింత బలపడుతుంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు.
అసలు సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమయింది -మిస్టరీ
SIT రిమాండ్ రిపోర్ట్ లో లాక్ అప్ డెత్ ని దాచి పెట్టడానికి సాయి కృష్ణ శవాన్ని ఎవరు గుర్తించినటువంటి ప్రదేశానికి తీసుకువెళ్లారని, దాన్ని పూడ్చి పెట్టడానికి లేదా కాల్చివేయడానికి ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. శవాన్ని పూడ్చి పెట్టారా లేదా కాల్చివేశారా అని విషయం ఇంకా తేలలేదు. దర్యాప్తు జరుగుతూ ఉంది.కృష్ణా లంక ఎలక్ట్రిక్ crematorium లో శవాన్ని రహస్యంగా దహనం చేశారని అనుమానం. ఒక జర్నలిస్ట్ చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి — “జయరాజ్-బెన్నిక్స్ కేసులో అత్యంత దారుణంగా చంపినా శవాలు కుటుంబానికి ఇచ్చారు. ఈ కేసులో శవమే ఇవ్వకపోవడం అందరినీ షాక్ చేసింది.” అమ్మకు కొడుకు బూడిద కూడా ఇవ్వలేదు — కృష్ణా నదిలో కలపడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ దారుణం AP పోలీస్ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది.
నేరం రుజువైతే శిక్ష ఏమిటి?
నాగరాజుపై BNS సెక్షన్ 103(1) murder, 127(4) మరియు 127(6) wrongful confinement, మరియు 238 evidence destruction కింద కేసు నమోదైంది. ఇవి మూడూ అత్యంత తీవ్రమైనటువంటి అభియోగాలు.సెక్షన్ 103(1) — అంటే murder రుజువైతే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు. తమిళనాడు జయరాజ్-బెన్నిక్స్ లాకప్ డెత్ (custodial death) కేసులో ఏప్రిల్ 2026లో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధించారు. ఆ కోర్టు తీర్పు ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకంగా మారింది. సాక్ష్యం నాశనం కింద 7 సంవత్సరాల వరకు, తప్పుడు నిర్బంధంలో 3 సంవత్సరాల వరకు అదనపు శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే అసలు సవాలు ఉంది — CCTV లేదు, శవం లేదు, DNA లేదు. సాక్షుల వాంగ్మూలాలు, సందర్భోచిత సాక్ష్యం, శ్మశాన వాటిక రికార్డులు, కాల్ రికార్డ్ల ఆధారంగా SIT కేసు నిర్మాణం అవసరం. Data recovery లో footage వస్తే నాగరాజుకు తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది.
నాగరాజు కేసు ఉదంతో రాజకీయ పరిణామాలు
జూన్ 20న కాకినాడ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తి మా కులానికి చెందిన వాడు అయితే నేను సపోర్ట్ చేయాలా? అని నేరుగా ప్రశ్నించారు. ఇది వైఎస్ఆర్సిపి లోని కాపు వర్గాన్ని ఆగ్రహానికి గురిచేసింది. వైసీపీ పార్టీ నాయకులు మరొకణంలో ప్రశ్నించింది. నెల రోజులకు పైగా ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా అదుపులో ఉంచుకొని, హింసించడం అనే విషయం పోలీస్ కమిషనర్, DGP, కి తెలియకుండా ఎలా ఉంటుంది అని ఆరోపించారు. ఇందులో కచ్చితంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పెద్దల హస్తం ఉందని బలంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఈ కేసులో తర్వాత ఏం జరగబోతూ ఉంది
జూన్ 29న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు కు సంబంధించినటువంటి వాదనలు జరగబోతున్నాయి. సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచడం అసాధ్యం కాబట్టి SIT తను దర్యాప్తు రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు ఆ వివరాలు పరిశీలించి కోర్టు ఈ కేసు యొక్క తదుపరి దశను నిర్ణయిస్తుంది. జూలై 8న CI నాగరాజు judicial remand తీరుతుంది. బెయిల్ వస్తుందా లేదా అనే నిర్ణయం జరుగుతుంది. SIT ఇంకా సాక్షదారాలు, సీసీటీవీ ఆధారాలు, కాల్ రికార్డ్స్ యొక్క ఆధారాలను సేకరిస్తూ ఉంది. లాకప్ డెత్ మరియు ఆ సంఘటనకు సంబంధించినటువంటి అందర్నీ గుర్తించటానికి దర్యాప్తు వేగంగా జరుగుతుంది . ఒకవేళ నాగరాజు ఒక్కడే కాదు అతనితో పాటు పనిచేసిన కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ శవాన్ని తరలించడంలో సహకరించారా? లేదా? ఒకవేళ వారికి కూడా సంబంధం ఉంటే వారు కూడా ఈ కేసులో బాధ్యులుగా ఉంటారు. దర్యాప్తు ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదు.
ఈ కేసు Jayaraj-Bennix కేసుకంటే మరింత దారుణమైనదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు — ఎందుకంటే కనీసం శవమైనా ఇవ్వలేదు. జయరాజ్-బెన్నిక్స్ కేసులో ఆరు సంవత్సరాల పోరాటం తర్వాత 2026లో మరణశిక్ష వచ్చింది. ఈ కేసులో evidence destroy చేసినా, CCTV మిస్సైనా, శవం మాయమైనా — ఒక అమ్మ పోరాటం ఆగలేదు. SIT దర్యాప్తు, హైకోర్టు నిఘా, రాజకీయ pressure అన్నీ ఒకే దిశలో ఉన్నాయి. గాడే విజయలక్ష్మి కొడుకుకు న్యాయం కోసం వేచి ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే వేచి ఉంది.
Disclaimer
ఈ వ్యాసంలో పొందుపరిచిన సమాచారం వివిధ వార్తా కథనాలు, మీడియా నివేదికలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం మరియు ఇతర బహిరంగ వనరుల ఆధారంగా సంకలనం చేయబడింది. ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ప్రచురించబడింది.
ఈ వ్యాసంలో పేర్కొన్న సంఘటనలు, ఆరోపణలు, తేదీలు, సమయాలు, వ్యక్తులపై ఉన్న అభియోగాలు మరియు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు సంబంధిత మీడియా నివేదికలు మరియు అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిలోని ప్రతి అంశాన్ని రచయిత లేదా వెబ్సైట్ స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు, న్యాయపరమైన విచారణ లేదా అధికారిక పరిశీలనలో ఉండవచ్చు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఎవరినీ దోషిగా లేదా నిర్దోషిగా నిర్ధారించబడిన వ్యక్తిగా పరిగణించరాదు.
ఈ వ్యాసం ఏ వ్యక్తి, సంస్థ, రాజకీయ పార్టీ, ప్రభుత్వ విభాగం లేదా దర్యాప్తు సంస్థను ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పరచడం, నిందించడం లేదా ప్రభావితం చేయడం కోసం రాయబడలేదు. కొత్త ఆధారాలు, అధికారిక ప్రకటనలు లేదా కోర్టు తీర్పుల ఆధారంగా వివరాలు మారే అవకాశం ఉంది.
ఈ వ్యాసంలోని సమాచారాన్ని ఉపయోగించే ముందు పాఠకులు అధికారిక పత్రాలు, కోర్టు రికార్డులు మరియు సంబంధిత అధికారుల ప్రకటనలను పరిశీలించడం మంచిది.
