ప్రేమ ప్రయాణం: 1990 vs 2026
ప్రేమ(LOVE)! బహుశా ఈ పదం తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరేమో? ప్రేమలో పడని వారు కూడా ఎవరూ ఉండరేమో? ప్రేమ ఎప్పుడూ మారదు. కానీ ప్రేమించే వ్యక్తులే మారుతూ ఉంటారు. ప్రేమించే విధానం కూడా మారుతూ ఉంటుంది. అటువంటి చక్కని వివరణాత్మకమైన రెండు ప్రేమ కథలు, రెండు తరాలలో పుడితే ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుంది. అని వివరించే ప్రయత్నమే ఈ కథ. మన అందరి జీవితాలలో జరుగుతున్నటువంటి ప్రేమ కథ.
కాలచక్రం అనేది చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ప్రేమిస్తుంటే, ఇప్పుడేమో ఫోన్లతో మాట్లాడుతూ ప్రేమిస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ అంటే అదో పెద్ద యుద్ధం, ఒక తపస్సు, ఒక యాగం లాంటిది. కానీ ఇప్పుడు ప్రేమ అంటే? రోజుకో ప్రేమ పాట స్టేటస్ గా పెట్టే ప్రేమికులు ఉన్నారు. బాధ వచ్చినా స్టేటస్ లోనే తెలుపుతారు. సంతోషం వచ్చిన స్టేటస్ లో తెలుపుతారు. వారి దృష్టిలో అదే ప్రేమ. అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రేమ కథ రెండు తరాలకు సంబంధించినది.
1990 – రాము మరియు లక్ష్మి ప్రేమ కథ (మౌనభాష)
ఆ రోజుల్లో ప్రేమించాలంటే ఒక యుద్ధమే చేసేవారు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ మెసేజ్ లు లేవు, ఉన్నదల్లా కళ్ళల్లో దాచుకున్న ఆశ, ప్రేమ, గుండెల్లో దాచుకున్న ధైర్యం ఇవే ఉండేవి.
రాము ఒక ఊర్లో ఒక సాధారణమైన మధ్యతరగతి యువకుడు. లక్ష్మి అదే ఊరుకు సంబంధించినటువంటి ఒక బాగా డబ్బున్న వారి యొక్క కూతురు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాటలతో మొదలు కాలేదు. చూపులతోనే మొదలైంది. గుడి దగ్గర ఎదురైనప్పుడు కలిగే ఒక చిన్న అనుభూతి, లక్ష్మీని సంతలో చూసినప్పుడు రాముకు కలిగే ఒక వర్ణించశఖ్యము కానీ ప్రేమ అనుభూతి, అదే వారికి ప్రేమ అంటే. రాము లక్ష్మీ ని చూడడానికి ప్రతి రోజు 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాడు. కేవలం ఆమె గుమ్మం ముందు ఒక్క క్షణం, ఆమె కనిపిస్తే చాలు, ఆ రోజంతా రాముకి ఒక పండగ. ఆ రోజుల్లో ప్రేమ వల్ల వచ్చే కష్టాలు, ప్రేమించటానికి పడే పాట్లు వర్ణనాతీతం. రాము తన మనసులో ఉన్న ప్రేమని లక్ష్మీకి ఒక ఉత్తరం ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించాడు. ఆ ఉత్తరం రాయడానికి అతడు మూడు వారాలు నిద్రపోలేదు. మూడు వారాలు ఎదురుచూసి ఆలోచించి తను రాసింది ఏంటో తెలుసా? ” నువ్వంటే నాకు ప్రాణం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను” ఈ మాట రాయటానికి ఎంతో కష్టపడ్డాడు.ఆ రాసినటువంటి ఉత్తరం లక్ష్మికి చేరటానికి ఒక వారం రోజులు సమయం పట్టింది. ఆ కాలంలో ప్రేమించి దొరికితే ఏదో రాజా ద్రోహం చేసినట్లు చూసేవారు. పంచాయతీలు పెట్టేవారు, ఊరి బహిష్కరణలు చేసేవారు, ఇంట్లో బంధించేవారు, ఇవన్నీ దాటుకొని ప్రేమని గెలవాలి.
సమయం రానే వచ్చింది. రాము, లక్ష్మీల ప్రేమ విషయం ఇంట్లో వారికి అందరికీ తెలిసిపోయింది. లక్ష్మి తండ్రి ఆమెను గదిలో వేసి తాళం వేశాడు. రాముని ఊరి బయట చెట్టు కట్టేసి కొట్టారు. కానీ వారిద్దరి మధ్య ఉన్నది శరీరాకర్షణ కాదు. కేవలం రెండు ఆత్మల అనుబంధం. రాము శరీరం నుండి రక్తం కారుతున్న, లక్ష్మీ క్షేమంగా ఉందో లేదో అని బాధ తనలో వేధిస్తుంది. తనను కూడా హింసిస్తున్నారేమో! అని అనుమానం తనని బాధపెడుతుంది. తను ఒంటిమీద పడే దెబ్బల కన్నా తను ప్రియురాలికి ఏమవుతుందో అని బాదే ఎక్కువగా ఉంది. లక్ష్మి కూడా తన ప్రేమ కోసం పోరాటం చేసింది. తన కుటుంబంతో పోరాడింది. అన్నం మానేసి ఒక మౌన పోరాటాన్ని కొనసాగించింది. చివరికి వాళ్లకు ఉన్నటువంటి పట్టుదల ముందు కులాలు, ఆస్తులు, పట్టింపులు అన్ని తలవంచాయి. అందర్నీ ఎదిరించి వారు పెళ్లి చేసుకున్నారు. కట్టుబట్టలతో ఆ ఊరు నుండి బయటికి వెళ్లిపోయి జీవనం సాగించడం మొదలుపెట్టారు. ఆరోజు వారి ప్రేమ గెలిచింది. ఆ రోజు నుండి ఈరోజు వరకు, రాముకి వయసు పైబడిన, లక్ష్మీకి చూపు మందగించిన, ఇప్పటికీ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. కలిసి కబుర్లు చెప్పుకుంటారు. ఒకరి ఒడిలో ఒకరు సేద తీరుతారు. గత కాలం ఆలోచనలతో మునిగిపోతారు అది ప్రేమ. 1990 నాటి శాశ్వత ప్రేమ.
2026 – సంజయ్ మరియు కల్పన ప్రేమ కథ (క్షణికావేశం)
ఇప్పుడు మరో ప్రేమ గురించి చూద్దాం . ఇది హైటెక్ యుగం ప్రేమంటారు. కాలం మారింది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉంది అన్న ఆలోచనలోనే ఉన్నారు. వారి దృష్టిలో ప్రేమ కూడా తమ గుప్పిట్లో ఉందని అనుకుంటారు.
సంజయ్ కల్పన ఒక ఇంస్టాగ్రామ్ రీల్ కింద చేసిన కామెంట్ ద్వారా ఇరువురు పరిచయమయ్యారు. ఒకరికొకరు రిక్వెస్ట్ పంపుకున్నారు. యాక్సెప్ట్ చేసుకున్నారు. తెల్లవారులు వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వేళ్ళకొద్దీ ఎమోజీలు, అర్ధరాత్రి వరకు చాటింగ్లో సమయాన్ని గడిపారు. పది రోజులు తిరగకముందే “ఐ లవ్ యు” అని చెప్పేసుకున్నారు. నెల తిరగకముందే “నువ్వు లేకపోతే నేను ఉండలేను” “నీకోసం నేను చచ్చిపోతాను” అనే రేంజ్ లో వాగ్దానాలు చేసుకున్నారు. వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేవు. కానీ వీళ్ళకి లేనిదే ఏమిటో తెలుసా? ఓపిక, సహనం.
ఒకరోజు కల్పన వేరే అబ్బాయి ఫోటోకి లైక్ కొట్టిందని, సంజయ్ గొడవపడ్డాడు. కల్పనకి అది నచ్చలేదు. నువ్వు “నా ఫ్రీడమ్ ని కంట్రోల్ చేస్తున్నావ్” అని వాదనకు దిగింది. కానీ సంజయ్ కల్పనలు ఒకరి మాట ఒకరు పడడానికి సిద్ధంగా లేరు. వారి మధ్య ఈగో(ego) సమస్య వచ్చింది. అంతవరకు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వంటే నాకు ప్రాణం, నీతోనే జీవితం, నీవే నా బుజ్జి, నాకన్నా, అనుకున్న వాళ్లు, ఒకసారిగా “నీ కంటే మంచి వాళ్ళు” నాకు దొరుకుతారు. అని సంజయ్ అనడం, నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయాను, అని కల్పనా అనడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనుకున్నదే తడవుగా ఒకరి నెంబర్లను ఒకరు బ్లాక్ చేసుకున్నారు. ప్రేమ పుట్టడానికి 10 రోజులు పడితే విడిపోవడానికి పది నిమిషాలు కూడా పట్టలేదు. ఈ కాలంలో పదిమంది ప్రేమించుకుంటే అందులో తొమ్మిది మంది కథలు ఇలాగనే ముగిసిపోతున్నాయి. ప్రేమ అనేది ఒక టైం పాస్ వస్తువులా మారిపోయింది.
ఒకరోజు ఒక పార్కులో రాము లక్ష్మి కూర్చుని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే పార్కులో మరో మూలన సంజయ్ కూర్చొని తన పాత ప్రియురాలి కల్పనను, తిడుతూ ఫోన్లో ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ ఉన్నాడు. రాము లక్ష్మితో ఇలా అంటున్నాడు.. లక్ష్మి నీకోసం ఆ రోజు మన ఊరి వారు కొట్టిన దెబ్బలు, ఆ నొప్పి ఈ రోజుటికి కూడా నాకు చాలా మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ దెబ్బలు తినకుండా ఉంటే, ఈరోజు నువ్వు నాకు దొరికే దానివి కాదేమో.అందుకే వాటిని నేను బాధగా ఫీల్ అవ్వలేదు. ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అని లక్ష్మితో చెబుతూ వారి ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ వారు ప్రేమించుకుంటూనే ఉన్నారు. మరోవైపు సంజయ్ కల్పన గురించి అది నన్ను మోసం చేసింది, నన్ను వాడుకున్నది, నాతో ఖర్చు పెట్టించింది, అని ఇప్పటికీ తిట్టుకుంటూనే ఉన్నాడు.
ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటో తెలుసా? రాములక్ష్మీలు ఒకరికొకరు అవసరమై బ్రతికారు. కానీ సంజయ్ కల్పన ఒకరిని ఒకరు అవకాశం గా వాడుకున్నారు. పాతకాలం ప్రేమలో త్యాగం ఉండేది. స్వచ్ఛమైన మనసు ఉండేది. ఒకరిని ప్రేమిస్తే వారితోనే జీవితాంతం కలిసి ఉండాలని దృఢమైన సంకల్పము ఉండేది. అందుకనే ఆ ప్రేమ సఫలం కావడానికి సంవత్సరాలు పట్టేది. ప్రపంచం ఉన్నంతవరకు ఆ ప్రేమ బ్రతికే ఉంటుంది. కానీ ఈ కాలం ప్రేమ కు వేగం ఎక్కువ. ఎంత వేగంగా ప్రేమ పుడుతుందో, అంతే వేగంగా క్షణాలలో ఆ ప్రేమ ఆవిరైపోతుంది. అప్పట్లో సెల్ ఫోన్ లేకపోయినా మనసులు కలిసే ఉండేవి. కానీ ఇప్పుడు 5జి ఇంటర్నెట్ ఉన్న మనుషుల మధ్య కనెక్షన్ కట్ అవుతూ ఉంది. ప్రేమంటే శరీరాల కలయిక కాదు, ఫోన్ స్క్రీన్ ల మీద మెరిసే అక్షరాలు కాదు, వాట్సప్ స్టేటస్ అసలే కాదు. ఎదుటి వారి కష్టంలో తోడు ఉండడం. వాళ్ళ లోపాలను కూడా ప్రేమించడం. అదే ప్రేమ..! ప్రేమకు ఎప్పుడు ఎక్స్పైరీ డేటు లేదు.ప్రేమించే వారు ఎక్స్పైరీ అయినా.. ప్రేమ ఎప్పుడూ ఎక్స్పైరీ అవ్వదు.
ఈ ప్రేమ కథ మీకు నచ్చిందా మీకు కూడా ఇటువంటివి ప్రేమ అనుభూతులు ఉన్నాయా అయితే ఈ కథని స్నేహితులకి బంధువులకి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి మరిన్ని ఇటువంటి కథల కోసం మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి.
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
