కార్డ్బోర్డ్ బాక్సుల తయారీ వ్యాపారం
నేడు వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో ఒక వస్తువును తయారు చేయడం ఎంత ముఖ్యమో, ఆ వస్తువును వినియోగదారుడికి అందించడం కూడా అంతే ముఖ్యం. 2026 నాటికి భారతదేశం యొక్క ఈ కామర్స్ రంగం ఇంతకుముందు ఎప్పుడు లేని రీతిలో విస్తరించి ఉంది. కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు కూడా ఆన్లైన్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనితో ప్యాకేజింగ్ పరిశ్రమ స్వర్ణ యుగంగా మారింది. ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రీసైక్లింగ్ కు తగినటువంటి మరియు పర్యావరణానికి మేలు చేసేటటువంటి కార్డ్బోర్డ్ బాక్సులకు (Corrugated Boxes) డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. Amazon, Flipkart, Meesho వంటి దిగ్గజ సమస్తలే కాకుండా వేల సంఖ్యలో పుట్టుకొస్తున్న చిన్నతరహా స్టార్టప్ బిజినెస్ లు కూడా ఇప్పుడు నాణ్యమైన బాక్సుల కోసం తయారీదారుల వైపు చూస్తూ ఉన్నారు . ఇది కేవలం ఒక సీజన్ కు సంబంధించిన వ్యాపారం కాదు. ఏడాది పొడవునా నిరంతరము లాభాలను అందించే ఒక స్థిరమైనటువంటి ఉపాధి మార్గం
కార్డ్బోర్డ్ బాక్సులకు (Corrugated Boxes) :పెట్టుబడి ఎలా పెట్టాలి యంత్రాలకు ఎంత ఖర్చవుతుంది
ఈ వ్యాపారంలో అడుగు పెట్టాలనుకునే వారు మొట్టమొదటిగా వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి రెండు ప్రధాన మార్గాలను ఎంచుకోవచ్చు. మొదటిది భారీ స్థాయిలో ఉత్పత్తికి అలువైనటువంటి పూర్తిస్థాయి ఆటోమేటిక్ ప్లాంటు. దీనికోసం దాదాపుగా 20 లక్షల నుండి 1.2 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో తయారీ యంత్రాలు సుమారుగా 48 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్లాంట్ లో కార్మికుల అవసరం తక్కువగా ఉండి, ఉత్పత్తి వేగంగా, ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో లక్షలాది బాక్సులను తయారు చేయాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. రెండవది మధ్యతరహా, సెమీ ఆటోమేటిక్ ప్లాంట్ సుమారుగా 35 లక్షల పెట్టుబడి నుండి దీన్ని ప్రారంభించవచ్చు. గంటకి సుమారు 50 నుండి 100 బాక్సుల వరకు ఉత్పత్తి చేసే సామర్ధ్యం దీనికి ఉంటుంది. ఇందులో కొన్ని పనులకు కార్మికుల శ్రమ అవసరమైనప్పటికీ సాధారణంగా ప్రారంభ దశలో ఉన్న వ్యాపారులకు ఇది ఒక లాభదాయకమైన మరియు రిస్క్ తక్కువగా ఉన్నటువంటి మార్గం అని చెప్పవచ్చు.
కార్డ్బోర్డ్ బాక్సులకు (Corrugated Boxes) :ముడి పదార్థాల కొనుగోలు మరియు ఉత్పత్తి ప్రక్రియ
కార్డ్బోర్డ్ బాక్సుల (Corrugated Boxes) యొక్క నాణ్యత అనేది ప్రధానంగా, అందులో వాడే క్రాఫ్ట్ పేపర్ మరియు గమ్ (జిగురు)పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కార్ట్ పేపర్ టన్నుకు సుమారుగా 22 వేల నుండి 30 వేల వరకు ఉంటుంది. మూడు పొరలు అంటే త్రీ ప్లే లేయర్స్ బోర్డుల తయారు చేయడానికి వాడే మెటీరియల్ ఖర్చు, టన్నుకు సుమారుగా 35 వేల నుండి 45 వేల వరకు ఉండవచ్చు. సాధారణంగా ఒక సాధారణ బాక్స్ తయారీకి కనిష్టంగా ఆరు నుండి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా చేసే కస్టమ్ ప్రింటింగ్ లేదా హెవీ-డ్యూటీ బాక్సుల తయారీ ఖర్చు రూ. 60 వరకు ఉండవచ్చు. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైనది కోరగేషన్ అంటే కాగితాన్ని అలల ఆకారంలో మార్చి దానికి గట్టిదనాన్ని ఇవ్వడం, దానికి తోడుగా బాక్సులు మీద బ్రాండింగ్ చేయడం ద్వారా అదనంగా లాభాలను ఎక్కువగా సంపాదించవచ్చు.
కార్డ్బోర్డ్ బాక్సులకు (Corrugated Boxes) :కావలసినటువంటి మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణ
ఈ భారీ పరిశ్రమను స్థాపించడానికి కనీసం 5000 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. యంత్రాల తో పాటు ముడి పదార్థాలు నిలువ చేయడానికి, తయారైనటువంటి బాక్సులను భద్రపరచడానికి విశాలమైనటువంటి షెడ్డు అవసరం.మనం ఎంచుకున్న ప్రదేశం ముఖ్యంగా రవాణా మార్గాలకు దగ్గరగా ఉండడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ముడి సరుకులు తెచ్చుకోవాలన్న అలాగే తయారైనటువంటి మన సరుకులు పంపిణీ చేయాలన్న వాహనాలు రావడానికి అనుగుణమైనటువంటి రోడ్డు మార్గం అవసరం అవుతుంది. అంతేకాకుండా భారీ యంత్రాలను నడపడానికి కావలసినటువంటి హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్ కూడా ఉండాలి . ప్యాకేజింగ్ పరిశ్రమలో ఫైర్ సేఫ్టీ మరియు పర్యావరణ నిబంధనలను పాటించడం తప్పనిసరి, కాబట్టి తగిన అనుమతులను ముందుగానే తీసుకోవడం మంచిది.
లాభాలు ఎలా వస్తాయి మరియు మార్కెటింగ్ విధానం
ఈ వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే కీలకమైన అంశం మనం నిర్మించుకునే నెట్వర్క్ అంటే కేవలం ఈ కామర్స్ కంపెనీలకే పరిమితం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి స్వీట్ షాపులు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ డెలివరీ కంపెనీలు, అలాగే ఎలక్ట్రానిక్స్, చెప్పుల కంపెనీలు, షాపులు వంటి వాటితో మనం డీల్ కుదుర్చుకోవాలి . క్లయింట్లు ఉంటే స్టార్టింగ్ స్టేజిలోనే ఏడాదికి దాదాపు 5 నుండి 10 లక్షల వరకు లాభాలను సంపాదించవచ్చు. ఒకవేళ పెద్ద కంపెనీలతో దీర్ఘకాలికమైనటువంటి కాంట్రాక్టులు మనము కుదుర్చుకుంటే, లాభాలు కోట్లలో ఉండే అవకాశం కూడా ఉండవచ్చు, దానికి ఎక్కువ కాలం కూడా పట్టదు. నాణ్యతలో రాజీ పడకుండా సరైన సమయానికి సరుకును డెలివరీ చేయగలిగేటటువంటి విధానం కలిగి ఉండి ,కష్టమర్లలో నమ్మకం కలిగించాలి. ఈ పోటీ ప్రపంచంలో బ్రాండింగ్ అనేది చాలా కీలకం కాబట్టి బ్రాండింగ్ విధానాన్ని అలవాటు చేస్తే అంటే తక్కువ కాస్ట్ లో వారికి కావలసినటువంటి బ్రాండ్ విధానాన్ని మనం ప్రింట్ చేసి ఇస్తే వినియోగదారులను మనం ఆకట్టుకోవచ్చు.
2026వ సంవత్సరంలో కార్డ్బోర్డ్ బాక్సులకు (Corrugated Boxes) తయారీ వ్యాపారం అనేది ఒక మంచి సురక్షితమైన అలాగే దీర్ఘకాలికంగా లాభాలు సంపాదించగలిగేటువంటి వ్యాపారం. పెరుగుతున్న జనాభా ఆన్లైన్ అవసరాలు ఉన్నంతకాలం ప్యాకేజింగ్ పరిశ్రమకు డోకా లేదు . సరైన ప్రణాళిక నాణ్యమైన ఉత్పత్తి మరియు సరైనటువంటి రవాణా సౌకర్యాలు కలిగి ఉంటే ఈ రంగంలో మీరే అగ్రగామిగా ఎదగవచ్చు లాభాలకు కొదువ ఉండదు.
ముఖ్య గమనిక:
ఈ ఆర్టికల్లో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పైన పేర్కొన్న యంత్రాల ధరలు, ముడి సరుకుల ఖర్చులు మరియు లాభాల అంచనాలు మార్కెట్ పరిస్థితులు, మీరు ఎంచుకునే ప్రాంతం మరియు బ్రాండ్లను బట్టి మారవచ్చు. ఏ వ్యాపారమైనా ప్రారంభించే ముందు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో మార్కెట్ రీసెర్చ్ చేయడం, నిపుణుల సలహాలు తీసుకోవడం మరియు ప్రభుత్వ నిబంధనలను పరిశీలించడం శ్రేయస్కరం. పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ ఫ్యాక్టర్లను స్వయంగా విశ్లేషించుకోవలసిందిగా మనవి.
మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపించిందా? మరిన్ని బిజినెస్ సమాచారం కోసం మా వెబ్సైట్ను ఫాలో అవ్వండి! ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
