Five upcoming IPOs in India set to raise over ₹6,500 crore in March 2026
భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రైమరీ మార్కెట్ (IPO Market) మాత్రం సెగలు పుట్టిస్తోంది. వచ్చే వారం ఏకంగా 5 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. ఇందులో మెయిన్ బోర్డ్ ఐపీఓలతో పాటు, ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT) మరియు ఒక SME ఐపీఓ కూడా ఉన్నాయి. మొత్తం మీద రూ. 6,578 కోట్లకు పైగా నిధులను మార్కెట్ నుంచి సేకరించాలని ఈ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో లిస్ట్ అయినటువంటి 8 IPO లలో 7 కంపెనీలు ఇన్వెస్టర్లకు నష్టాలను చూపించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న IPO ల పరిస్థితి ఏంటి? గ్రే మార్కెట్ ఏం చెబుతుంది వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాజ్‌పుతన స్టెయిన్లెస్ ఐపీఓ (Rajputana Stainless IPO)
స్టీల్ రంగంలో మంచి పట్టు ఉన్నటువంటి రాజ్‌పుతన స్టెయిన్లెస్ తన అదృష్టాన్ని ఈసారి పరీక్షించుకోనుంది. మార్చి 9 సోమవారం నుండి మార్చి 11 బుధవారం వరకు IPO అందుబాటులో ఉంటాయి . దీని యొక్క లక్ష్యము దాదాపు 255 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవాలని చూస్తుంది. ప్రైస్ బాండ్ దాదాపుగా 116 రూపాయలు నుండి 122 రూపాయలు వరకు ఉంటుంది. ఈ కంపెనీ ప్రొఫైల్ విషయానికొస్తే ఇది గుజరాత్ కేంద్రంగా పనిచేసే స్టెయిన్లెస్ స్టీల్ బిలెట్స్ మరియు బార్స్ తయారు చేస్తుంది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి కీలకమైన రంగాలకు ఇది ఉత్పత్తులను సరఫరా చేస్తుంది . అలాగే అమెరికా యూఏఈ వంటి దేశాలకు ఎగుమతులు చేయడం అనేది ఈ కంపెనీకి ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్.
ఇన్నోవిషన్ ఐపీఓ (Innovision IPO)
సర్వీస్ సెక్టార్లో రాణిస్తున్న ఇన్నోవిషన్ లిమిటెడ్ తన ఐపీఓను సిద్ధం చేసింది. ఇది మార్చి 10వ తారీకు మంగళవారం నుండి మార్చి 12వ తారీకు గురువారం వరకు ఈ IPO లు అందుబాటులో ఉంటాయి . ఇది 323 కోట్లను రూపాయలు నిధులను సమీకరించనుంది. ఇందులో దాదాపుగా 250 కోట్ల రూపాయలు కొత్తగా ఇష్యూ చేస్తున్నటువంటి ఐపీఓస్ ప్రైస్ బ్యాండ్ వచ్చి 521 నుండి 548 వరకు ఉంటుంది.సెక్యూరిటీ సర్వీసెస్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ మరియు మ్యాన్ పవర్ సోర్సింగ్‌లో ఈ కంపెనీకి 17 ఏళ్ల అనుభవం ఉంది. 23 రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం, 180కి పైగా కార్పొరేట్ క్లయింట్లను కలిగి ఉండటం విశేషం.
రాజ్‌మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (Raajmarg Infra InvIT IPO)
వచ్చేవారం రాబోతున్నటువంటి ఐపిఓ అన్నిటికంటే ఇది చాలా పెద్దది. సురక్షితమైన రాబడిన ఆశించే వారి కోసం NHAI తీసుకొని వస్తుంది. మార్చి 11వ తేది బుధవారం నుండి మార్చి 13వ తేదీ శుక్రవారం వరకు ఇది అందుబాటులో ఉంటుంది. దీని యొక్క మొత్తం విలువ 6,000 కోట్ల రూపాయలు. ప్రైస్ బ్యాండ్ దాదాపుతూ 99 నుండి 100 రూపాయల వరకు ఉంటుంది.ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పాన్సర్ చేస్తున్న ఇన్విట్. 260 కిలోమీటర్ల మేర ఉన్న 5 టోల్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయమే దీనికి ఆధారం. ఇది సాధారణ షేర్లలా కాకుండా ‘డివిడెండ్’ తరహా ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.
స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ (Skyways Air Services IPO)
లాజిస్టిక్స్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మార్చి 18న ఇది ప్రారంభమవుతుంది. 4.22 కోట్ల రూపాయలు ఇది సమీకరించనుంది.ఎయిర్ కార్గో, ఓషన్ ఫ్రైట్ మరియు కస్టమ్స్ క్లియరెన్స్‌లో ఈ కంపెనీ దిగ్గజం. ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా వంటి అంతర్జాతీయ విమాన సంస్థలతో వీరికి ఒప్పందాలు ఉన్నాయి.
ఆప్సిస్ ఏరోకామ్ – SME ఐపీఓ (Apsis Aerocom SME IPO)
చిన్న కంపెనీలే అయినప్పటికీ భారీ లాభాలు ఇచ్చే విధంగా ఎస్ఎంఈ విధాన విభాగంలో ఈ ఐపీఓ వస్తుంది. మార్చి 11 నుండి మార్చి 13 వరకు ఇది అందుబాటులో ఉంటుంది దాదాపుగా 35 నుండి 36 కోట్ల రూపాయలు నిధులను సమీకరించినది. ప్రైస్ బ్యాండ్ 14 రూపాయలు నుండి 110 రూపాయలు వరకు ఉండనుంది.ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలకు కావలసిన ప్రెసిషన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తుంది. రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ బూస్ట్ దీనికి కలిసి రావచ్చు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి – ఇన్వెస్టర్లు గ్రహించాల్సిన విషయాలు
మార్కెట్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ చాలా బలహీనంగా ఉంది. దీని ప్రభావం ఐపీఓలపై స్పష్టంగా కనిపిస్తోంది.
నెగెటివ్ లిస్టింగ్స్: గత 8 ఐపీఓలలో 7 ఐపీఓలు డిస్కౌంట్‌తో (నష్టంతో) లిస్ట్ అయ్యాయి. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
తక్కువ GMP: గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. కొన్ని కంపెనీలకు సింగిల్ డిజిట్ లాభం మాత్రమే కనిపిస్తోంది.
లిస్టింగ్ గెయిన్స్ vs లాంగ్ టర్మ్: కేవలం లిస్టింగ్ రోజే లాభాలు పొంది బయటకు వచ్చేయాలనుకునే వారికి (Listing Gains) ఇది సరైన సమయం కాకపోవచ్చు. కానీ, కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించవచ్చు.
వచ్చేవారం రాబోతున్నటువంటి ఐదు ఐపిఓల్లో కూడా వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఇవి స్టీల్, సర్వీస్, ఇన్ఫ్రా, లాజిస్టిక్ మరియు డిఫెన్స్ వంటి వివిధ రకాల విభిన్న రంగాలకు చెందినటువంటి కంపెనీలు క్యూ కట్టనున్నాయి. అయితే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు తొందరపాటు పెట్టుబడి పెట్టకుండా కంపెనీల యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని చూసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా రాజ్ మార్క్ ఇన్విట్ వంటివి స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే మిగిలినటువంటి ఐపీఓలను కూడా వాటి యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
గమనిక: షేర్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
ఇప్పుడే మా యొక్క వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
![]()
