

ది ప్యారడైజ్ మూవీ రివ్యూ: నాని కొత్త అవతారం చూపిన యాక్షన్ డ్రామా
గత కొన్ని నెలలుగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకులను పాటల ద్వారా ఎంతగానో అలరించిన ది పారడైజ్ (The Paradise) మూవీ థియేటర్స్ లో విడుదల అయింది. ఏస నాగుల కట్ట కాడ అంటూ రిలీజ్ అయిన పాట ఎంతగా ఆదరణ పొందుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ రీల్స్ లో చూసిన విపరీతంగా ఈ పాట మీద డాన్స్ చేశారు. జడల కాన్సెప్ట్ తో సినిమా అంతటినీ విపరీతమైనటువంటి క్రేజీలో ముంచెత్తిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం గురించి, ఆ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనే వివరాలు తెలుసుకుందాం.
సినిమా: ది ప్యారడైజ్ (The Paradise)
భాష: తెలుగు (పాన్ ఇండియా – 8 భాషల్లో విడుదల)
దర్శకత్వం: శ్రీకాంత్ ఒడేల
నటీనటులు: నాని, కయాదు లోహార్, రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిడివి: 2 గంటల 49 నిమిషాలు
సర్టిఫికెట్: A
గతంలో శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో వచ్చినటువంటి దసరా సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. అందులో ఉన్నటువంటి పాటలన్నీ చాలా పాపులర్ అయ్యాయి. న్యాచురల్ స్టార్ నానిని మొదటిసారిగా డి గ్లామర్ పాత్రలో చూపించి హిట్టు కొట్టారు. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు ది పారడైజ్ అంటూ జడల కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఎంతగానో క్యూరియాసిటీ కలిగించి సినిమా మీద విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు. ఆయా షేర్ అంటూ ఒక పాటను రిలీజ్ చేసి ప్రేక్షకులకి ఆ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత రీసెంట్ గా ఏస నాగుల కట్ట కాడ అంటూ మరొక పాటను రిలీజ్ చేసి ఒక ప్రాంతీయతను ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి సినిమా ను ఒక సరికొత్త విధానంలో చూసే విధంగా చేశారు. చివరిగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అసలు దాని కథ ఏమిటి? అందులో ఉన్నటువంటి క్యారెక్టర్రైజేషన్ ఏమిటి? ప్రేక్షకులను ఎంతగా మెప్పించింది అనే విషయాలు తెలుసుకుంటే?
సినిమా కథ సారాంశం
సవారీల జాతి అనే కొంతమంది వరస కూలీలు షికాంజ మాలిక్ (మోహన్ బాబు) గుప్పెట్లో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సమ్మక్క (సోనాలి కులకర్ణి) భారత ప్రభుత్వంతో తమ జాతికి కూడా ఒక మంచి గుర్తింపు కావాలని పోరాడుతూ ఉంటుంది. అయితే సమ్మక్క (సోనాలి కులకర్ణి) ఒక ఒక తప్పుడు వ్యక్తి అని షికాంజ మాలిక్ ఆమె కొడుకు జడల్ (నాని) చేతిపై పచ్చబొట్టు వేయిస్తాడు. జడల్ (నాని) తన తల్లి చాలా చెడ్డది అనే భావంతో చిన్నప్పటినుండి ఆమె మీద రగిలిపోతూ ఉంటాడు. చిన్న వయసులోనే జడల్ (నాని) షికాంజ మాలిక్ (మోహన్ బాబు) మనిషిని చంపి జైలుకెళ్ళిపోతాడు. తర్వాత కాలంలో మాలిక్ తన సామ్రాజ్యాన్ని తన కొడుకు అయినటువంటి విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయాల్) కు బాధ్యతలు అప్పగిస్తాడు. తర్వాత జడల్ (నాని) కూడా జైలు నుండి రిలీజ్ అయ్యి వస్తాడు. మాలిక్ మీద జడల్ ఎందుకు పగతో రగిలిపోతాడు. తన తల్లిని ద్వేషిస్తూ ఉన్న జడల్ ఆమె ప్రేమను ఎప్పుడూ, ఎందుకు అర్థం చేసుకుంటాడు. తర్వాత క్రమంలో మాలిక్ పై జడల్ ఏ విధంగా పగ తీర్చుకుంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన పాత్రలు సుబ్బు (కయాదు లోహర్), బిర్యానీ (సంపూర్ణేశ్ బాబు) , దివి (విష) బాగా ఆకట్టుకుంటారు. గుర్తింపు కోసం సమ్మక చేసిన పోరాటానికి జడల్ నాయకత్వం వహించేందుకు ముందకు వస్తాడా? తర్వాత క్రమంలో అసలు సఫారీల జాతికి గుర్తింపు లభించిందా? లేదా? తర్వాత పరిమాణాలు ఏమిటి? అనేది ఈ కథ యొక్క పూర్తి సారాంశం.
పారడైజ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినటువంటి సినిమా. కథ అంశాలు గురించి చెప్పవలసి వస్తే ఇదేమి కొత్తగా వచ్చినటువంటి కథ ఏమీ కాదు. ప్రతి సినిమాలో ఉండే ఒక రొటీన్ కథలాగే ఉంటుంది. కొంతమంది అనగారిపోయిన ప్రజలు ఉంటారు. వారికోసం, వారి విడుదల కోసము పోరాటం చేసేవారు ఒకరుంటారు. విలన్ కచ్చితంగా వారిని తన రౌడీయిజంతో తొక్కేస్తారు. తరువాత వారిలో నుంచే ఒక హీరో పుట్టుకొని వస్తాడు. ఆ హీరో వారిని విలన్ల చేతిలో నుండి రక్షిస్తాడు. ఇది అనేక సినిమాల్లో ఉన్నటువంటి రొటీన్ కథ. కానీ స్క్రీన్ ప్లే కొంచెం క్రొత్తగా చూపించారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ ఈ సినిమాలో చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ స్టార్ నానిని తను వాడుకున్న విధానం, సినిమాకి ప్రజల్లో క్రేజ్ క్రియేట్ చేయడం, ఒక హీరోకి జడలు వేసి సినిమా తీయాలి అనే ఆలోచన ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. నాని హీరోఇజం అలాగే మోహన్ బాబు గారి విలనిజం అద్భుతంగా పండించారు. అలాగే తల్లి సెంటిమెంట్ ని కూడా చక్కగా ప్రేక్షకులకు హృదయాలకు అతుక్కునే విధంగా చూపించారు.
ముందుగానే అందరికీ తెలిసిన విషయం ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉండబోతుంది అని చాలా మంది ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ సినిమా చూసిన తర్వాత తెలంగాణ పాత్రలు కనిపించిన భాష మాత్రం తెలంగాణ యాస లాగా అంతగా అనిపించలేదు.
ఫస్ట్ అఫ్ మొత్తం హీరోని ఒక విపరీతమైన ఎత్తుకు ఎత్తేస్తారు. హీరో ఎంతటి విలనైనా పోరాడగలే సమర్ధుడు అనే విధంగా ఫస్ట్ అఫ్ సాగుతుంది. విపరీతమైనటువంటి హీరోఇజం కనిపిస్తుంది. సెకండ్ అప్ కాస్త డీలపడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ హాఫ్ లో వచ్చినటువంటి స్టోరీ అంతా రొటీన్ స్టోరీ లాగే అనిపిస్తుంది . ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్ గా అనిపిస్తుంది.
Disclaimer:
ఈ మూవీ రివ్యూ మా అభిప్రాయం మరియు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. సినిమాలోని కథ, పాత్రలు, నటన, సాంకేతిక అంశాలపై పేర్కొన్న అభిప్రాయాలు వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే. సినిమాను చూడాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా పాఠకుల వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తల అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి








