తలైవర్ నుంచి మరో మాస్ సినిమా కాదు, ఒక మాస్టర్‌పీస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.
సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వినగానే అనేకమంది ప్రేక్షకుల కళ్ళ ముందు కనిపించేది ఒక హీరో కాదు ఆయన క్రియేట్ చేసిన స్టైల్ అలాగే ఒక సినిమాటిక్ ఫెనామినా. చరిత్రలో చూస్తే ఏ హీరో కైనా వయసు పెరిగే కొద్దీ సినిమా అవకాశాలు తక్కువగా ఉంటాయి. లేటు వయసులో ఎలాంటి సినిమాలు తీయాలో అర్థం కాక, కథలు సిద్ధం చేయలేక డైరెక్టర్లు అవస్థలు పడుతూ ఉంటారు. కానీ రజనీకాంత్ విషయంలో పూర్తి భిన్నంగా ఉంది. సినిమా కథతో సంబంధం లేకుండా కేవలం స్టయిల్, మాస్ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటి వాటితోనే అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. దీనికి పెద్ద నిదర్శనమే Jailer అలాగే Jailer 2 సినిమాలు.
2023 లో వచ్చినటువంటి జైలర్ సినిమా రజినీకాంత్ కెరీర్ లో ఒక అద్భుతమైన విజయాన్ని అలాగే కలెక్షన్స్ ని ఇచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చినటువంటి జైలర్ 2 సినిమా ప్రేక్షకుల మనసులు దోచి భారీ విజయాన్ని ఇచ్చింది. విడుదలైనటువంటి కొద్ది రోజులలోనే వందల కోట్ల రూపాయల వసూళ్లని సాధించడమే కాకుండా 2026 లో అత్యధికమైన వసూళ్లు సంపాదించిన తమిళ చిత్రంగా నిలిచిందని తాజా బాక్సాఫీస్ నివేదికలు చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది…జైలర్ 2 తర్వాత రజినీకాంత్ ఏ సినిమా చేయబోతున్నారు?
జైలర్ 2… కేవలం సీక్వెల్ కాదు, తలైవర్ బ్రాండ్‌కు మరో రీసెట్
జైలర్ 2 లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించారు. అయితే జైలర్ మొదటి సినిమాలో ఏర్పడినటువంటి క్యారెక్టర్ ఇమేజ్ ని మరింత పవర్ ఫుల్ గా రెండో సినిమాలో కూడా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతంగా రూపొందించారు. రజినీకాంత్ స్క్రీన్‌పై కనిపించే విధానం, ఆయన డైలాగ్ డెలివరీ, మాస్ మూమెంట్స్, అనిరుధ్ సంగీతం—ఇవన్నీ కలిసి సినిమాకు భారీ థియేట్రికల్ ఎనర్జీని తీసుకొచ్చాయి. ముఖ్యంగా Jailer 2 మొదటి భాగం సక్సెస్‌ను కేవలం ఒక సాదా హీరో లాగా కాకుండా మరింత పవర్ఫుల్ క్యారెక్టర్రైజేషన్ తో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో భారీ ఫైట్లు లేవు, భారీ డైలాగులు లేవు, అమాయకంగా కనిపించే మోహము, ఏది చెప్పినా తలాడించే ఒక సామాన్యుడి పాత్రలోనే ఉంటాడు. కానీ సమయాన్ని బట్టి ఆ పాత్రలో ఉన్నటువంటి పవర్ఫుల్నెస్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కలిపి అద్భుతంగా చూపించారు.
జైలర్ 2 సినిమా లో నిజం చెప్పాలంటే కథ అసలే లేదు. ఇది చదువుతున్న వారికి ఎవరికైనా దీని కథ అర్థమైందా? ఒకే ఒక్క లైన్ లో కూడా ఈ కథ గురించి పూర్తిగా అవగాహన రాదు. కేవలం రజినీకాంత్ స్టైల్ ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని మిక్స్ చేసి సినిమా తీశారు. ఈ సినిమా యొక్క పూర్తి మాయజాలం ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హీరో ఎలివేషన్స్ రజినీకాంత్ స్టైల్ తప్ప మరొకటి కనిపించదు. కానీ సినిమా వందల కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది అది కేవలం రజినీకాంత్ గారికి మాత్రమే సొంతం అయ్యింది ఈ విధమైన కథకు కేవలం రజనీకాంత్ మాత్రమే సూట్ అవుతారు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. తలైవర్ మార్కెట్ ఇంకా ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ.
అయితే రజినీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. ప్రస్తుతం రజినీకాంత్ తదుపరి ప్రాజెక్ట్ గురించి పలు రకాల చర్చలు, అప్డేట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘తలైవర్ 173’ పేరుతో ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
రజినీకాంత్ తర్వాతి సినిమా ఎందుకు ఇంత పెద్ద విషయంగా మారింది?
సాధారణంగా ఒక హీరో సినిమా హిట్ అయితే తదుపరి సినిమాపై అంచనాలు పెరుగుతాయి. కానీ రజినీకాంత్ విషయంలో అది వేరే లెవెల్. ఎందుకంటే ఆయన సినిమా విడుదల అంటే తమిళనాడులో మాత్రమే కాదు—తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, హిందీ మార్కెట్, ఓవర్సీస్లో కూడా భారీ థియేట్రికల్ ఈవెంట్‌గా మారుతోంది. Coolieకు ముందు రజినీకాంత్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌పై ఏర్పడిన భారీ హైప్ దీనికి ఉదాహరణ. ఆ సినిమా 2025లో విడుదలై భారీ బాక్సాఫీస్‌ను సాధించినప్పటికీ, విమర్శకులు మరియు ప్రేక్షకుల స్పందన మాత్రం మిశ్రమంగా వచ్చింది. అక్కడి నుంచి Jailer 2తో రజినీకాంత్ మళ్లీ తన మాస్ జోన్లో భారీ ప్రభావాన్ని చూపించారు.ఇప్పుడు తదుపరి దర్శకుడి ముందు ఒకే ఒక సవాలు ఉంది.
జైలర్ 2 స్థాయిని ఎలా దాటాలి?
ఇది రజినీకాంత్ కెరీర్లో మరో చారిత్రాత్మక దశ కావచ్చా?
నా దృష్టిలో అసలు ఆసక్తికరమైన అంశం ఇదే.
రజినీకాంత్ ఇప్పుడు తన కెరీర్లో “ఎన్ని సినిమాలు చేశాడు?” అనే దశలో లేరు.
“ఇంకా ఎలాంటి సినిమాలు చేయగలడు?” అనే దశలో ఉన్నారు. అదే తేడా.
75 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాదు యంగ్ హీరోలని మంచి ఫేమ్ ఉన్న హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి వసూళ్లు సాధించడం అనేది చాలా గొప్ప విషయం.
అందుకే తదుపరి సినిమా కేవలం మరో సినిమా కాదు.
అది “తలైవర్ ఎరా”లో మరో కొత్త అధ్యాయం కావచ్చు.
తలైవర్‌కు ఇప్పుడు కావాల్సింది మరో “మాస్ సినిమా” కాదు… ఒక “మాస్టర్‌పీస్”
తన సినిమా కెరియర్లో ఎన్నో పాత్రలు చేశారు. అద్భుతమైన హీరోయిజాన్ని చూపించారు. తనలో ఉన్న స్టైల్ ని ప్రపంచానికి పరిచయం చేసారు. అద్భుతమైన పాటలు ఆయన సినిమాలో ఉన్నాయి ఆయన వేసే చిన్న చిన్న చెప్పులకే ఫిదా అయిపోయాయి ఫాన్స్ కోట్ల మంది ఉన్నారు.
రజినీకాంత్‌కు మాస్ ఉంది. ఫ్యాన్ బేస్ ఉంది. ఓపెనింగ్ ఉంది. మార్కెట్ ఉంది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు అడుగుతున్నది ఒక్కటే—
“తలైవర్ నుంచి ఇంకోసారి గుర్తుండిపోయే సినిమా ఎప్పుడు?”
Baashha, Sivaji, Enthiran, Kabali, Petta, Jailer వంటి సినిమాలు రజినీకాంత్ కెరీర్లో ప్రత్యేకమైన మైలురాళ్లు.
ఇప్పుడు Jailer 2 కూడా భారీ విజయాల జాబితాలో చేరడంతో, తదుపరి సినిమా కోసం అంచనాలు మరింత పెరిగాయి.
ఒక సినిమా… ఒక హీరో… ఒక ఇండస్ట్రీపై ప్రభావం
రజినీకాంత్ సినిమా విజయం అంటే కేవలం నిర్మాతకు లాభం కాదు. అది తమిళ సినిమా మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. తమిళ సినిమాకు ఉన్న పాన్-ఇండియా మార్కెట్ ఎంత పెద్దదో మరోసారి నిరూపించే అవకాశం కలుగుతుంది. ailer 2 ఇప్పటికే ఈ విషయంలో బలమైన ఫలితాలను చూపించింది. తాజా నివేదికల ప్రకారం విడుదలైన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ₹576 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు.రజినీకాంత్ బ్రాండ్ విలువకు ఒక సూచిక.
ఫైనల్ వర్డ్: తలైవర్ సినిమా అంటే ఇప్పటికీ ఒక సెలబ్రేషన్!
సినిమా ప్రపంచంలో హీరోలు వస్తారు… వెళ్తారు. కొంతమంది స్టార్స్ అవుతారు. కొంతమంది సూపర్‌స్టార్స్ అవుతారు. కానీ కొంతమంది మాత్రం ఒక శకంగా మారిపోతారు. రజినీకాంత్ అలాంటి అరుదైన నటుడు.
Jailer 2 సక్సెస్ తర్వాత ఆయన తదుపరి సినిమా ఏదైనా కావచ్చు. దర్శకుడు ఎవరైనా కావచ్చు. కథ ఏదైనా కావచ్చు.
కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం—
తలైవర్ తదుపరి సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన రోజే… సినిమా ప్రపంచం మొత్తం దాని వైపు తిరిగి చూస్తుంది.
ఎందుకంటే రజినీకాంత్ సినిమా అంటే కేవలం ఒక రిలీజ్ కాదు…అది ఒక ఈవెంట్.
మరి ఆ ఈవెంట్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టించబోతుందో… అదే ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న!
తాజా వార్తల అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి
Navayugam TV ఛానల్లో జాయిన్ అవ్వండి









