మహిళలు – పురుషుల్లో వచ్చే ప్రధాన క్యాన్సర్లు మరియు లక్షణాలు
క్యాన్సర్ ఈ పేరు వెంటనే చాలు అందరూ భయపడతారు. క్యాన్సర్ వచ్చిందంటే ఇక చావు తప్పదు, అని చాలామంది భయంతో వణికి పోతారు. ప్రస్తుత కాలంలో వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. కాన్సర్ నుంచి మనం బయట పడగలము అని నమ్మకాన్ని కూడా ఇస్తుంది. అయితే క్యాన్సర్ అంటే ఏమిటి ? అది మన శరీరంలో ఏ ఏ భాగాలకి సోకుతుంది. నిజంగానే వాటికి మందు లేదా ? ఒకవేళ మందు ఉంటే నిజంగానే నయమైపోతుందా ? ఇటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
క్యాన్సర్ అంటే ఏమిటి? What is cancer?
సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి కణాలు ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతూ పెరుగుతాయి. అయితే పాత కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ కణాలు అదుపు లేకుండా పెరిగి గడ్డలుగా ఏర్పడతాయి. దీనినే క్యాన్సర్ అంటారు ఈ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకి అవయవాలను దెబ్బతీస్తాయి.
క్యాన్సర్ ఎన్ని రకాలు గా వస్తుంది
క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రకరకాల క్యాన్సర్లు బయటపడుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వాటిలో పురుషులలో మరియు స్త్రీలలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఏ భాగాలకు సోకుతుంది. అసలు ఆ క్యాన్సర్లను ఏమంటారు తెలుసుకుందాం.
పురుషులలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రకాలు
పురుషులలో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, అలాగే మల ద్వార క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
స్త్రీలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రకాలు
స్త్రీలలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భసయ్య క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అసలు క్యాన్సర్ వచ్చేముందు ఏమైనా సంకేతాలు ఇస్తాయా ఇస్తే మనం వాటిని ఏ విధంగా తెలుసుకోవాలి.
క్యాన్సర్ వచ్చే ముందు కానీ లేదా వచ్చిన ప్రారంభమైన దశలోనే మనకు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా శరీరంలోకి క్యాన్సర్ ప్రవేశించిన వెంటనే శరీరంలో ఏ భాగంలో అయినా గడ్డలు ఏర్పడడం ఒక లక్షణం. అలాగే కారణం లేకుండా విపరీతమైనటువంటి వెయిట్ లాస్ జరగడం కూడా ఒక లక్షణం. ఏ శ్రమ చేయకుండానే అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం కూడా ఒక లక్షణమే. చర్మం రంగు మారడం లేదా మచ్చలు వంటి ఏర్పడటం వాటి పరిమాణం పెరగడం ఇది కూడా క్యాన్సర్ వచ్చే ముందు దశలో ఉన్నటువంటి సంకేతాలుగా మనం భావించవచ్చు.
అలాగే ఒకవేళ నోటి క్యాన్సర్ వస్తే నోటిలో పుండ్లు ఎంతకీ తక్కకుండా ఉంటాయి. అలాగే తెల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి. రొమ్ము క్యాన్సర్ బారిన పడితే రొమ్ము లో గడ్డలు ఏర్పడడం, చనుమునల నుండి స్రావాలు రావడం గమనిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే దీర్ఘకాలికంగా దగ్గు రావడం, ఆ దగ్గులో రక్తం కూడా పడటం వంటివి కూడా గమనిస్తారు. గర్భసయ్య క్యాన్సర్ సాధారణంగా స్త్రీలకి ప్రతి నెలలో ఏదో ఒక రోజు వారి యొక్క నెలసరి అవుతూ ఉంటుంది. కానీ గర్భాశయ క్యాన్సర్ సోకినటువంటి స్త్రీలలో నెలసరి కి సంబంధం లేకుండా రక్తస్రావం జరగడం కూడా క్యాన్సర్ లక్షణంగా చెప్పవచ్చు.
క్యాన్సర్ వస్తే మరణమేనా మందులు ఉన్నాయా?
నేటి ఆధునిక ప్రపంచంలో దాదాపుగా అన్ని రకాల క్యాన్సర్లకి సరియైనటువంటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఏ దశలో ఉంది అనే దాని మీదనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ క్యాన్సర్ రకాలు మొదటి లేదా రెండవ స్టేజిలో గుర్తించినప్పుడు వాటిని నివారించడానికి సులభం అవుతుంది. స్త్రీలలో వచ్చేటటువంటి రొమ్ము, గర్భసయ్య, థైరాయిడ్, మరియు చర్మ క్యాన్సర్లను మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసేటటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. కీమోతెరపి, రేడియేషన్ మరియు ఇమ్యునో థెరపీ మందుల ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశము ఉంటుంది.
కానీ కొన్ని రకాల క్యాన్సర్లు నయం చేయడానికి లేదా పూర్తిగా నయం కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. వాటిలో ప్రధానంగా చెప్పుకుంటే క్లోమ గ్రంధి, మెదడు అలాగే నాలుగో దశలో ఉన్నటువంటి ఏ క్యాన్సర్ అయినా పూర్తిగా నయం కాకపోవచ్చు. కానీ అత్యాధునికమైన మందుల ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక వైద్యంలో వాటిని కూడా క్రమంగా నయం చేసే సాంకేతికత మనకు అందుబాటులో ఉంది.
క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
క్యాన్సర్ అనేది రకరకాలుగా వ్యాపిస్తుంది. అంటే సాధారణంగా క్యాన్సర్ వ్యాపించడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి . వాటిలో ప్రధానమైన కారణము జన్యుపరమైన లోపాలు. అంటే తన రక్త సంబంధీకులలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ లక్షణాలు తర్వాత సంతతి తరానికి కూడా ట్రావెల్ చేయబడతాయి. అంటే జెన్యుపరంగా కొన్ని తరాల తర్వాత కూడా అ క్యాన్సర్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు లేదా జీవనశైలి కూడా ఒక విధంగా క్యాన్సర్ కి మనం ఆశ్రయం ఇస్తున్నాము అని చెప్పుకోవచ్చు.
క్యాన్సర్ వస్తే భయపడాలా ? అసలు ఏం చేయాలి.
కొన్ని సంవత్సరాల క్రితం బిపి అనేది ఎవరికి వచ్చేది కాదు. కానీ ఈ కాలంలో ఒక వయసు దాటిన తర్వాత అందరూ బీపీ బారిన పడుతున్నారు. అలాగే షుగర్ అంటే కూడా పూర్వకాలంలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అనేకమంది సుగర్ బారిన పడుతున్నారు. అంటే మన జీవన శైలి మారుతున్న కొద్దీ మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కానీ లేదంటే మన జీవన ప్రమాణం కానీ మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ కూడా అటువంటి కోవకు చెందినదే. క్యాన్సర్ ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అని చెప్పటానికి లేదు. అలాగని వచ్చిన తర్వాత అది పూర్తిగా నయం కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అనేకమందిని మనం చూస్తున్నాము. క్యాన్సర్ బారిన పడిన వారు కూడా పూర్తిగా నయమై సాధారణ జీవితం అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి క్యాన్సర్ సోకితే భయపడాల్సిన పనిలేదు ధైర్యంగా ముందుకు సాగి దాన్ని జయించి, సాధారణ జీవితానికి అలవాటు పడాలి. అలాగే వచ్చినటువంటి రోగాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి కావలసినటువంటి అన్ని సహకారాలు కుటుంబం నుండి పొందాలి.
మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే ఈ సమాచారం మీ మిత్రులతో మరియు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి!
Disclaimer
ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం విద్యాపరమైన మరియు అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా లక్షణాలు, ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే, తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. స్వయంగా మందులు తీసుకోవడం లేదా చికిత్స ప్రారంభించడం ప్రమాదకరం కావచ్చు.
