ప్రతి ఆదివారం ఒకే చికెన్ కర్రీ కాకుండా ఈ 7 వెరైటీ చికెన్ వంటకాల్లో మీకు నచ్చినదాన్ని ట్రై చేయండి
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ కచ్చితంగా ఉండాల్సిందే. నాన్ వెజ్ తినటం రకరకాల వంటకాలు చేసుకోవడం ప్రతి ఆదివారం సాధారణమే. కానీ చికెన్ తో ప్రతిరోజు కూర చేసుకుని తినడం బోర్ గా అనిపిస్తుంది. ప్రతిసారి ఒకే రకమైన కూర చేయాలా? మరి ఏదైనా కొత్తగా ట్రై చేయాలా? అని ప్రతి మహిళ ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకే రకమైన వంట తిని తిని బోర్ కొట్టి ఏం చేయాలి అని ఆలోచించే మహిళల కోసమే ఈ ఆర్టికల్.
చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముక్క లేనిదే ముద్ద దిగదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రొటీన్ గా ప్రతి వారం చికెన్ కర్రీ మాత్రమే చేసుకుంటూ బోర్ కొడుతూ ఉన్న వారి కోసం చికెన్ తో రకరకాల వంటలు ఎలా చేయాలి? టేస్టీ టేస్టీగా ఉండే వంటకాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
లెమన్ హనీ చికెన్ (Lemon Honey Chicken)
పుల్ల పుల్లగా తీయ తీయగా ఎంతో వెరైటీగా ఉండే లెమన్ హనీ చికెన్ (Lemon Honey Chicken) ఎలా చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్, కార్న్‌ఫ్లోర్, పెప్పర్ పౌడర్, వెన్న, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, తేనె, నిమ్మకాయ రసం, సోయా సాస్, ఉప్పు.
తయారు చేసే విధానం:
లెమన్ హనీ చికెన్ తయారు చేయటానికి మనం ముందుగా బోన్ లెస్ చికెన్ ని శుభ్రంగా కడుగుకొని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలకు కొద్దిగా పెప్పర్ పౌడర్ ఉప్పు పట్టించి దానిని కార్న్ ఫ్లోర్ లో బాగా మిక్స్ చేయాలి. ఒక పాన్ లో నూనె వేసి బాగా మరిగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను ఆ నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి ముక్కలను బాగా వేయించాలి . ఇందులో రెండు స్పూన్ల తేనె కొద్దిగా నిమ్మరసం సోయాసాస్ వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసి ఆ మిశ్రమంలో మొక్కలను బాగా వేయించుకోవాలి తర్వాత టాస్ చేసుకుంటే క్రిస్పీ అండ్ జ్యూస్ కి లెమన్ హనీ చికెన్ రెడీ అవుతుంది.
రాయలసీమ స్టైల్ కారం రోటి చికెన్ (Rayalaseema Karam Roti Chicken)
కారం కారంగా, ఘాటుగా తినే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డిష్.
కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, నూనె, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర.
తయారు చేసే విధానం:
దీనికోసం ప్రత్యేకంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం కలిపి రోట్లో లేదా మిక్సీలో కరకరా లాడేలా కారం రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేగాక, ఈ పచ్చి కారాన్ని నూనెలో పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ వేసి, తగినంత ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోయకుండా సిమ్‌లో మగ్గనివ్వాలి. చికెన్ లోని నీళ్లతోనే ఉడికితేనే అసలైన సీమ రుచి వస్తుంది. చివరగా కొత్తిమీర చల్లుకుంటే అద్భుతంగా ఉంటుంది.
పెప్పర్ చికెన్ రోస్ట్ (Pepper Chicken Roast) చలికాలంలో లేదా వర్షాకాలంలో వేడివేడిగా ఈ పెప్పర్ రోస్ట్ తింటే గొంతుకి చాలా హాయిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు: చికెన్, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు.
తయారు చేసే విధానం:
స్టవ్ మీద పాన్ పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఇదే అసలైన మసాలా! ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. చికెన్ ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత, మనం సిద్ధం చేసుకున్న మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేయాలి. చికెన్ మెత్తబడే వరకు చిన్న మంట మీద వేయించుకుంటే, నూనె పైకి తేలే పెప్పర్ రోస్ట్ సిద్ధం అవుతుంది.
చికెన్ హరియాలీ కబాబ్ (Chicken Hariyali Kebab) ఆకుపచ్చని రంగుతో, పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్‌తో నోట్లో వేస్తే కరిగిపోయే కబాబ్ ఇది.
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, గట్టి పెరుగు, గరం మసాలా, నిమ్మరసం, నూనె లేదా వెన్న, ఉప్పు.
తయారు చేసే విధానం:
ఒక మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం-వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ చేయాలి. బోన్‌లెస్ చికెన్ ముక్కలకు ఈ పేస్ట్, గట్టి పెరుగు, తగినంత ఉప్పు, గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం పట్టించి కనీసం 2 గంటలు ఫ్రిజ్‌లో నానివ్వాలి. ఆ తర్వాత పెనం మీద కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి.
కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీ (Coconut Milk Chicken Curry)
ఇది కొంచెం కేరళ స్టైల్ టేస్ట్‌ని ఇస్తుంది. గ్రేవీ చాలా క్రీమీగా, మైల్డ్‌గా ఉంటుంది.
కావలసిన పదార్థాలు: చికెన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు, ధనియాల పొడి, చిక్కటి కొబ్బరి పాలు, ఉప్పు.
తయారు చేసే విధానం:
బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. చికెన్ వేసి ఉడికించిన తర్వాత, టమోటా ముక్కలు, ధనియాల పొడి వేసి కలపాలి. చికెన్ ఉడికిన తర్వాత చివరగా చిక్కటి కొబ్బరి పాలు పోసి ఒక్క ఉడుకు ఉడికించి దించేయాలి. గుర్తుంచుకోండి, కొబ్బరి పాలు పోసిన తర్వాత కూరను ఎక్కువసేపు మరగనివ్వకూడదు, లేదంటే విరిగిపోయినట్లు అవుతుంది. ఈ గ్రేవీ వైట్ రైస్ లేదా అప్పాల్లోకి అద్భుతంగా ఉంటుంది.
చికెన్ సుక్కా (Chicken Sukka – Mangalorean Style) దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఎంతో ఫేమస్ అయిన ఈ వంటకం, పొడి పొడిగా ఉండి అద్భుతమైన సువాసన ఇస్తుంది.
కావలసిన పదార్థాలు: చికెన్, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, తురిమిన ఎండుకొబ్బరి, నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు.
తయారు చేసే విధానం:
ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, కొద్దిగా తురిమిన ఎండుకొబ్బరిని విడివిడిగా వేయించి మెత్తని పొడి చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేయించి, చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నీరు పూర్తిగా ఇంకిపోయి, మసాలా అంతా చికెన్ ముక్కలకు గట్టిగా పట్టే వరకు వేయించి దించేయాలి.
చేసే విధానం: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, కొద్దిగా తురిమిన ఎండుకొబ్బరిని విడివిడిగా వేయించి మెత్తని పొడి చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేయించి, చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నీరు పూర్తిగా ఇంకిపోయి, మసాలా అంతా చికెన్ ముక్కలకు గట్టిగా పట్టే వరకు వేయించి దించేయాలి.
కావలసిన పదార్థాలు: చికెన్, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ప్యూరీ, కడాయి మసాలా పొడి, ఉప్పు.
తయారు చేసే విధానం:
కడాయి చికెన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో వేసే ‘కడాయి మసాలా’. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను పొడిగా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి, క్యూబ్స్ లాగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలను పెద్దవిగా కోసి కాస్త క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ప్యూరీ వేసి మసాలా ఉడికించాలి. చికెన్ వేసి ఉడికించిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ-క్యాప్సికం ముక్కలు, కడాయి మసాలా పొడి వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిస్తే ఘుమఘుమలాడే కడాయి చికెన్ రెడీ!
మాస్టర్ టిప్: ఏ చికెన్ వంటకం చేసినా, చికెన్‌ని ఉడికించేటప్పుడు మంట మీడియం లేదా లో ఫ్లేమ్‌లో ఉంచితేనే మాంసం లోపలి వరకు ఉడికి జ్యూసీగా ఉంటుంది. ఈ ఆదివారం మీ ఇంట్లో వీటిలో ఏది ట్రై చేస్తున్నారో మాకు కామెంట్స్ లో చెప్పండి!



