తీరంపై విరుచుకుపడనున్న 'అర్ణబ్' తుఫాన్ – రాబోయే 48 గంటల్లో తెలుగు రాష్ట్రాలపై పెను ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది.సోమవారం నుంచి వేగంగా బలపడిన ఈ తుఫాన్ విశాఖపట్నానికి ఆగ్నేయంగా కేవలం 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని, “అతి తీవ్ర” తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. బుధవారం ఉదయం 11:30 గంటల నాటికి వాయవ్య దిశగా తిరిగి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఝంఝా గాలులు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా. తీరం దాటే ప్రాంతం బాపట్ల–విశాఖపట్నం మధ్య ఉండే అవకాశం ఉంది. అంటే రాబోయే 48 గంటల్లో కేంద్రీకృతమైన తుఫాను ఆంధ్రప్రదేశ్ లోనే విలయతాండవం చేయబోతుంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. దాని ప్రభావం తెలంగాణ వరకూ విస్తరిస్తుంది వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను ద్వారా భయపెడుతున్న ముఖ్యమైన అంశం ఏమిటంటే అతి వేగంగా వీచే గాలులే కాకుండా తుఫాను సముద్రం కాటే సమయంలో సముద్రమట్టానికి రెండు మీటర్ల ఎత్తున అలలు చెలరేకి తీర ప్రాంతాలను ముంచేత్తే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తోడుగా భారీ వర్షాలు తోడైతే వరదలు వచ్చే అవకాశం ఉంది అలాగే వంట నష్టం జరగవుచ్చని అంచనా వేస్తున్నారు రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఉత్తరాంధ్ర: ముందే మొదలైన వాన
ప్రభావం ఇప్పటికే ఉత్తర కోస్తాలో బాగా కనిపిస్తూ ఉంది. మంగళవారం రూరల్ ప్రాంతాలలో కొన్ని గంటల వ్యవధిలోని దాదాపు 58 మిల్లీమీటర్ల వర్షపాతం కూర్చుందని విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను ప్రభావం ఉందని చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.అత్యంత సమీపంలో ఉన్నటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, జిల్లాల్లో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాలు ప్రధాన పరిశ్రమలు, ఓడరేవు, జనసాంద్రత ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ తుఫాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు.
గోదావరి జిల్లాలు: అత్యంత భారీ వర్ష హెచ్చరిక
IMD ముందుగా జారీ చేసిన హెచ్చరికల ప్రకారం,కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాలకు ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది. ఈ జిల్లాలలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాలువలు, డ్రైన్లు, లంక ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఈ డెల్టా ప్రాంతంలో వరి పంట కోతకు వచ్చే దశలో ఉండడంతో రైతులకు భారీగా నష్టం చేకూరే అవకాశం ఉంది.
కృష్ణా–గుంటూరు–బాపట్ల తీరం
తుఫాను తీరం దాటే ప్రదేశం బాపట్ల పరిసర ప్రాంతాలలోనే ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత చేకూరింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణ, గుంటూరు, బాపట్ల, జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం, పల్నాడు,ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రయాణ మార్గాన్ని బట్టి అలర్టుల జాబితా కూడా మారే అవకాశం ఉంది.
తెలంగాణ: తూర్పు జిల్లాలకు వర్ష గండం
తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం అంతటితో ఆగదు. అక్టోబర్ 27న తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు, 28న ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దులోని తూర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. స్థానిక వాతావరణ నిపుణుడి అంచనా ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం (అక్టోబర్ 28) మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాత్రం 27 నుంచి 29 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 28న కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చని చెప్పింది. తుఫాన్ సమీపించగానే హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అంటే వేర్వేరు అంచనాల్లో తీవ్రత విషయంలో కొంత తేడా ఉంది.తూర్పు తెలంగాణ ప్రాంతంలోనే తుఫాను ముప్పు ఎక్కువగా ఉంది అనే విషయం వాతావరణ శాఖ చెబుతూ ఉంది. వాగులు వంకలు, వంతెనలు ఉన్న ప్రాంతాలలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ తుఫాను కారణంగా తీర ప్రాంతం ప్రజలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకారం తుఫాను మార్గంలో దాదాపు 1.2 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు సోమవారం రాత్రి నాటికి సుమారుగా 50వేల మందికిపైగా ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తంగా నాలుగు లక్షల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని సమస్త సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాబోయే 48 గంటలు అత్యంత కీలకంగా మారనుంది
మంగళవారం రాత్రి నుంచి తీరంలో గాలుల వేగం క్రమంగా పెరుగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్య తుఫాన్ తీరాన్ని తాకుతుంది. అప్పుడు గాలులు, ఉప్పెన, కుండపోత వర్షం ఒకేసారి విరుచుకుపడే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత తుఫాన్ బలహీనపడుతుంది, కానీ వర్షం మాత్రం లోపలి జిల్లాలకు, తెలంగాణ వరకూ విస్తరిస్తుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం వరకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. తుఫాన్ తగ్గిన తర్వాత కూడా వరద నీరు, విరిగిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.
గమనిక (Disclaimer):తాజా అధికారిక సమాచారం కోసం దయచేసి భారత వాతావరణ శాఖ (IMD) లేదా స్థానిక ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థల ప్రకటనలను మాత్రమే అనుసరించండి.
తాజా వార్తల అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి
Navayugam TV ఛానల్లో జాయిన్ అవ్వండి







